అబ్దుల్ ముహాసిన్ ముహమ్మద్ సజ్జాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మావ్లానా
అబ్దుల్ ముహాసిన్ ముహమ్మద్ సజ్జాద్
ముఫక్కీర్-ఇ-ఇస్లామ్
జమియత్ ఉలేమా -ఇ-హింద్ కు రెండవ ప్రధాన కార్యదర్శి
In office
1940 జూలై 13 – 1940 నవంబరు 23
అంతకు ముందు వారుఅహ్మద్ సయీద్ దెహ్లవీ
తరువాత వారుఅబ్దుల్ హలీం సిద్దికీ[1]
వ్యక్తిగతం
జననం1880
మరణం1940 నవంబరు 23(1940-11-23) (వయసు 59–60)
మతంIslam
జాతీయతIndian
DenominationSunni Islam
JurisprudenceHanafi
ప్రముఖ కృషిFatwa Tark-e-Mawalat
విద్యాసంస్థMadrasa Subhāniya, Allahabad
Founder ofMuslim Independent Party

అబుల్ ముహాసిన్ ముహమ్మద్ సజ్జాద్ (1880 - 1940 నవంబరు 23) భారతీయ ఇస్లామిక్ పండితుడు. అతను 20 వ శతాబ్దంలో జీవించిన అత్యంత ప్రభావశీలమైన ఉలేమాలలో ఒకడు. [2] సజ్జాద్, అంజుమన్-ఉలామా-ఇ-బీహార్, జమియత్ ఉలేమా-ఇ-హింద్, ఇమారత్-ఇ-షరియాల వ్యవస్థాపకుడు. [3] అబుల్ ముహాసిన్ ముహమ్మద్ సజ్జాద్ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. అతడు సహాయనిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో పాల్గొన్నాడు. అతను భారతదేశ విభజనను వ్యతిరేకించాడు. మిశ్రమ జాతీయవాదం భావనను సమర్థించాడు. బీహార్‌లో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లతో నిరాశ చెందిన ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేందుకు 1935 లో అతను ముస్లిం స్వతంత్ర పార్టీని స్థాపించాడు. ముస్లిం స్వతంత్ర పార్టీ 1937 లో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు అయిన యూనస్, 1937 ఏప్రిల్ 1 న బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. [4] [5]

ప్రారంభ జీవితం, చదువు[మార్చు]

మహమ్మద్ సజ్జాద్, బ్రిటిషు భారతదేశంలో బీహార్ ప్రావిన్స్‌, నలంద జిల్లా లోని పన్‌హెస్సా గ్రామంలో జన్మించాడు. [6] తండ్రి హుస్సేన్ బక్ష్, అతనికి 4 సంవత్సరాల వయసులో ఉన్నపుడు మరణించాడు. [7]

సజ్జాద్ అన్నయ్య 1948 వరకు జీవించిన సూఫీ సన్యాసి సూఫీ అహ్మద్ సజ్జాద్. ఆ గ్రామంలో ఒక మసీదు సమీపంలో సూఫీ అహ్మద్ సజ్జాద్ యొక్క మజార్ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ముహర్రం నెల 27 న ఈ సూఫీ పేరిట ఉర్సు జరుపుకుంటారు. ఈ పుణ్యక్షేత్రపు ప్రస్తుత సజ్జాదా నాషిన్ (వారసత్వ నిర్వాహకుడు) సాధువు మనవడు పీర్ సయ్యద్ షా మొహమ్మద్ జియావుద్దీన్ (జననం 1953). [3]

సజ్జాద్ చదువు బీహార్‌లోని మదరసాలో మొదలైంది. ఆపై అలహాబాద్‌లోని మదరసా సుభానియాలో దాదాపు ఆరు సంవత్సరాలు చదువుకున్నాడు. అతని ఉపాధ్యాయులలో ముఖ్యుల్లో అబ్దుల్ కాఫీ ఒకరు. సజ్జాద్, హిజిరీ శకం 1323 లో పట్టభద్రుడయ్యాడు.[8] సజ్జాద్ బీహార్ షరీఫ్, దేవబండ్, అలహాబాద్‌లో తన చదువును పూర్తి చేశాడు. [3]

కెరీర్[మార్చు]

చదువైన తరువాత సజ్జాద్ బీహార్ షరీఫ్, అలహాబాద్‌, గయల్లో ఆధ్యాత్మశాస్త్రాన్ని బోధించాడు. [3] 1917 లో అతను అంజుమన్-ఉలామా-ఐ-బీహార్‌ను స్థాపించాడు. జమియత్ అల్-ఉలామా-ఇ-హింద్ వ్యవస్థాపకులలో అతనొకడు. [3] అతను ఇమారత్-ఇ-షరియా కార్యదర్శిగా కూడా పనిచేశాడు. దాన్ని స్థాపించడం లోనూ అతడి పాత్ర ఉంది. [3]

అతను భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో అతను చురుగ్గా పాల్గొన్నాడు. [3] హిందూ-ముస్లిం ఐక్యత కోసం కృషిచేసాడు. సైమన్ కమిషన్‌ను బహిష్కరించిన హర్తాళ్లకు నాయకత్వం వహించాడు. [3] భారతదేశ విభజననూ మహమ్మద్ అలీ జిన్నా వేర్పాటువాద ప్రచారాన్నీ అతను వ్యతిరేకించాడు. [4] గయలో అన్వరుల్ ఉలూమ్ మదరసాను స్థాపించాడు. [3]

సజ్జాద్ 1920 సెప్టెంబరు 8 న విదేశీ వస్తువులను బహిష్కరించమని ఉద్బోధించే ఫత్వా (మతపరమైన శాసనం), టర్క్-ఇ-మవలాత్ ను తయారు చేసాడు. 500 మంది ముస్లిం పండితులు దీనిపై సంతకం చేసి జమియత్ ఉలామా-ఇ-హింద్ నుండి జారీ చేసారు. [9] 1940 జూలై 13 న సజ్జాద్, జమియత్ ఉలామా-ఇ-హింద్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. [1] దానికి ముందు, అహ్మద్ సయీద్ దెహ్లవీ లేనప్పుడు అతను వర్కింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేసేవాడు. [1]

సజ్జాద్, 1940 నవంబరు 23 న మరణించాడు. [10]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 

  1. 1.0 1.1 1.2 Salman Mansoorpuri (2014). Tehreek Azadi-e-Hind Mai Muslim Ulama aur Awaam ka Kirdar (in ఉర్దూ). Deoband: Deeni Kitab Ghar. pp. 194–196.
  2. Mohammad, Muzaffar Imam (1987). Role of Muslims in the National Movement, 1912-1930: A Study of Bihar (in ఇంగ్లీష్). Mittal Publications. p. 250. ISBN 978-81-7099-033-8. MAULANA MUHAMMAD SAJJAD ( 1880 - 1940 ) Maulana Mohammad Sajjad was one of the most reverend and revolutionary leaders of Bihar, who served religion and politics equally. He was born in the year 1880 at Pansaha village in...
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Alam, Jawaid (1 January 2004). Government and Politics in Colonial Bihar, 1921-1937 (in ఇంగ్లీష్). Mittal Publications. p. 225. ISBN 978-81-7099-979-9. Sajad, Maulana Muhammad (1884-1940); pan-Islamist alim from Panasha, a village in Nalanda district: educated at Bihar Sharif, Deoband, and Allahabad; started career as a teacher of theology and taught at Bihar Sharif, Gaya and Allahabad; founded Anjuman-Ulama-i-Bihar, 1917; one of the founders of Jamiyat al-Ulama-i-Hind and became its Secretary; founder-Secretary, Imarat-i-Sharia Bihar and Orissa; took prominent part in the Khilafat and Non-cooperation movements, 1920-22; worked for Hindu-Muslim unity; actively participated in the hartals to boycott the Simon Commission; took active part in the Civil Disobedience movement, 1930 and was imprisoned; established Anwarul Ulum Madrass at Gaya.
  4. 4.0 4.1 Sajjad, Mohammad (24 May 2018). "The real culprits behind India's Partition" (in ఇంగ్లీష్). Rediff. Retrieved 30 October 2020.
  5. Ashraf, Ajaz (6 September 2016). "The forgotten story of two Maulanas who mocked Jinnah's idea of Pakistan" (in ఇంగ్లీష్). Scroll.in. Retrieved 3 November 2020.
  6. Asir Adrawi. Tazkirah Mashāhīr-e-Hind: Karwān-e-Rafta (in ఉర్దూ) (2 April 2016 ed.). Deoband: Darul Muallifeen. p. 13.
  7. Akhtar Imām Aadil Qāsimi. Hayāt-e-Abul Muhāsin (in ఉర్దూ) (2019 ed.). Samastipur District, Bihar: Jāmia Rabbāni Manorwa Sharīf. p. 108,109.
  8. Asir Adrawi. Tazkirah Mashāhīr-e-Hind: Karwān-e-Rafta (in ఉర్దూ) (2 April 2016 ed.). Deoband: Darul Muallifeen. p. 13.
  9. Wasif Dehlavi, Hafizur Rahman. Jamī'at-i Ulamā par ek tārīk̲h̲ī tabṣirah (in ఉర్దూ). p. 58. OCLC 16907808.
  10. Asir Adrawi. Tazkirah Mashāhīr-e-Hind: Karwān-e-Rafta (in ఉర్దూ) (2 April 2016 ed.). Deoband: Darul Muallifeen. p. 13.