అబ్బినేనిగుంటపాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
అబ్బినేనిగుంటపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°08′24″N 80°19′40″E / 16.139950°N 80.327686°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పెదనందిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522015 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
అబ్బీనేనిగుంటపాలెం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం గుంటూరు నుండి పెదనందిపాడు వెళ్ళేదారిలో, గుంటూరు నుండి 20 కీమీల దూరంలో ఉంది. స్థానికంగా ఈ గ్రామాన్ని ఏబిపాలెం లేదా ఏజీపాలెం అని కూడా పిలుస్తారు.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]ఎం.ఆర్.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]- మాకినెని రామయ్య పాఠశాల నిర్మాణం చేశారు.
- ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న కె.రఘవేంద్ర అను విద్యార్థి, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ విద్యార్థి, 2014, ఏప్రిల్-23 నుండి 25 వరకూ, హరిద్వార్లో నిర్వహించే పోటీలలో 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటాడు.
- ఈ పాఠశాల విద్యార్థులు, ముగ్గురు స్కౌట్స్ & గైడ్స్ ఎస్.కె.అబ్దుల్ రజాక్, కె.సాయి రాకేష్, కె.సారథి, 2014, ఆగస్టు-15న హైదరాబాదులో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జరిగే పెరేడులో పాల్గొనేందుకు ఎంపికైనారు.
- ఈ పాఠశాలలో చదువుచున్న శ్రావణి, మానస, లక్ష్మీతిరుపతమ్మ, గోపీచంద్ అను విద్యార్థులు, ఇటీవల గుంటూరులో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో, తమ తొలి ప్రయత్నంలోనే, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2014, సెప్టెంబరు-13,14 తేదీలలో కడప జిల్లా ప్రొద్దుటూరులో జరుగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు.
- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న పాపిశెట్టి నాగబాబు, 2014, సెప్టెంబరు-14న, పశ్చిమగోదావరి జిల్లా, చాగల్లులో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో, తృతీయస్థానం సంపాదించాడు.
- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న శ్రవణం మేరీసుప్రియ అను విద్యార్థిని, ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాఫ్ట్ బాల్ పోటీలలో, బాలికల అండర్-17 విభాగంలో పాల్గొని, ద్వితీయస్థానం సంపాదించింది.
- ఈ పాఠశాలలో చదువుచున్న జమ్ముల రాజశేఖర్, అండర్-17 విభాగంలో జాతీయస్థాయి బాల్ బ్యాడ్ మింటన్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. 2016, జనవరి-5 నుండి తెలంగాణా రాష్ట్రంలోని నల్లగొండలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో రాజశేఖర్, జట్టు కెప్టెనుగా వ్యవహరించెదడు.
- ఈ పాఠశాలలో చదువుచున్న ఎస్.హేమంత్ వెంకటచౌదరి, జాతీయస్థాయి కత్తిసాము పోటీలకు ఎంపికైనాడు. 2016, జనవరి-17న మహారాష్ట్ర లోని నాందేడ్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఇతడు పాల్గొంటాడు.
- ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తి యుద్ధం) పోటీలలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఐదు రజత పతకాలనూ, ఐదు కాంస్య పతకాలనూ సాధించారు.
సెయింట్ ఇగ్నీషియస్ ఉన్నత పాఠశాల
[మార్చు]గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ఊరికి ఆనుకునే పెద్దచెరువు అని పిలిచే ఒక చెరువు ఉంది.
గ్రామములో రాజకీయాలు
[మార్చు]ఒరెయ్ అవ్వ యోగిని గారిని కూడా మర్చి పోయారా? మ
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ అన్నపూర్ణాసమేత శ్రీ కాశీవిశ్వేశరస్వామివారి ఆలయo
[మార్చు]ఈ గ్రామంలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయనిర్మాణానికి, 2014, మార్చి-17, సోమవారం నాడు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, వేదపండితులు, గణపతి, వాస్తుహోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ దేవాలయ నిర్మాణానికి మాకినేని పెదరత్తయ్య గారు, 25 సెంట్ల స్థలాన్ని వితరణ చేశారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి కావలసిన విగ్రహాలను మహాబలిపురంలో తయారుచేయించుచున్నారు.
ఈ గ్రామములో దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-4వతేదీ ఆదివారంనుండి ప్రారంభించారు. 5వతేదీ సోమవారంనాడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర, చండీ హోమాలు, 6వతేదీ మంగళవారంనాడు, 7వతేదీ బుధవారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 8వతేదీ గురువారం ఉదయం శ్రీ విద్యారణ్యభారతీస్వామి పర్యవేక్షణలో శివలింగం, శ్రీ గణపతి, శ్రీ అన్నపూర్ణాకాశీవిశ్వేశ్వరస్వామి, ఆదిత్యాది నవగ్రహాల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠలువైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో, స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం, అసంఖ్యాకంగా విచ్చేసిన భక్తులతో కిటకిటలాడినది. మద్యాహ్నం 12 గంటలనుండి, ఈ కార్యక్రమాలకు విచ్చేసిన వేలాదిమంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. [11]
ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2017,జూన్-23వతేదీ శుక్రవారంనాడు, స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
[మార్చు]స్థానిక అవ్వగారి మఠం ఆవరణలో 60 లక్షల రూపాయల దాతల వితరణతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, నాగమ్మ మాతాజీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, 2016, ఏప్రిల్-9వతేదీ శనివారం నుండి 11వ తెదీ సోమవారం వరకు వైభవంగా నిర్వహించెదరు.
స్థానిక అవ్వగారి మఠం 73వ వార్షికోత్సవం సందర్భంగా, 2017,జూన్-23వతేదీ శుక్రవారంనాడు, మఠావరణలో, భక్తులు, స్వామివారికి భక్తిశ్రద్ధలతో, మఠాధిపతి కారుమూరి నాగమ్మ ఆధ్వర్యంలో, భజనలు, పూజలు చేసారు. పలు ప్రాంతాలనుండి వచ్చిన 15 మంది గురువులతోపాటు, చిదానందగిరిస్వామి ప్రవచనం చేసారు. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]ఈ ఊరిలో నల్లరేగడి భూమి ఉంటుంది. ఇక్కడ పత్తి, మిరప ప్రధాన పంటలు, ఇవేకాక సొయాచిక్కుడు, మినుము, శెనగ జొన్న, మొక్కజొన్న, కంది మొదలగు పంటలను కూడా వేస్తారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు