Jump to content

ఐ.వి.చలపతిరావు

వికీపీడియా నుండి
(అయ్యంకి వెంకట చలపతి రావు నుండి దారిమార్పు చెందింది)
ఐ.వి.చలపతిరావు
జననం
అయ్యంకి వెంకట చలపతి రావు

(1923-04-25)1923 ఏప్రిల్ 25
కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తివిద్యావేత్త, రచయిత, సంపాదకులు
పురస్కారాలుప్రతిభ రాజీవ్ అవార్డు – 2009 (విద్యారంగంలో విశేష కృషికిగానూ)
ప్రతిభా పురస్కారం - 2009, ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా అందుకుంటున్న

అయ్యంకి వెంకట చలపతి రావు; (ఐ.వి.చలపతిరావుగా సుప్రసిద్ధులు) భారతీయ విద్యావేత్త, వక్త, ఉపాధ్యాయులు, సంపాదకులు. ఆయన విద్య, సమాచార రంగం, మేనేజిమెంటు, జీవితచరిత్రల గురించి 25 పుస్తకాలను వ్రాసారు. ఆయన సుమారు వంద పుస్తకాలకు ముందుమాట, సమీక్షలను వ్రాసారు. ఆయన ఆంగ్లం, తెలుగు రచయితగా సుప్రసిద్ధులు.

ఆయన దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలకు, జాతీయ శిక్షణా సంస్థలకు, అకడమిక్ స్టాఫ్ కళాశాలలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన కమ్యూనికేషన్స్ స్కిల్స్, భారతీయ సంస్కృతి, జీవితావసరాల గురించి, పర్సనాలిటీ డెవలెప్ మెంటుకు సంబంధించిన అంశాలలో విశేష ప్రతిభావంతులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మేధావులు, విద్యావేత్తలు, రచయితలలో ఐ.వి.చలపతిరావ వారు సుప్రసిదులు. ఆయన 1923 ఏప్రిల్ 25వ తేదీన వెంకట కృష్ణారావు, దమయంతి దంపతులకు జన్మించారు. తన 15వ యేట తండ్రిని కోల్పోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పట్టణంలో గల పిఠాపురం రాజా కళాశాలలో పట్టభద్రులైనారు. తరువాత ఆయన మహారాష్ట్ర లోని నాగపూరుకు తన ఆంగ్ల సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేయాలనే తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి వెళ్లారు. ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏను నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదివి 1916లో చలపతిరావు డిస్టింక్షన్లో ఉత్తీరులయ్యారు. అనంతరం నాగపూర్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో ఆంగ్లోవన్యాసకుడుగా ప్రిన్సిపాల్ గా పనిచేశారు.

కరీంనగర్ శ్రీరాజరాజేశ్వరీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు సుప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ప్రిన్సిపాల్గా వచ్చి చలపతిరావు తన ముద్ర వేశారు. వారి ఆంగ్ల ప్రసంగం విన్నవారెవ్వరూ ఆయనను ఏనాటికీ మరచిపోలేరు. అది వారి ప్రతిభకు మచ్చుతునక. మహాత్మాగాంధీ అభిమాన పత్రిక మాత్రమే కాకుండా ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో చెప్పుకోదగిన ప్రసిద్ధ త్రైమాసిక పత్రిక "త్రివేణికి వారు చీఫ్ ఎడిటర్గా సుదీర్ఘకాలంగా కౌనసాగుతూనే ఉన్నారు.[2] వయోధి కుల కోసం ప్రచురిస్తున్న "ట్విలైట్ లైఫ్" మాసపత్రికను చలపతిరావు ఈ వయస్సులోనూ ఎడిట్ చేస్తూనే ఉన్నారు.

పిదప కొంతకాలం పబ్లిక్ ఇనస్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టరుగా కాలేజియేట్ సెల్ ప్రధానాధికారిగా, రాష్ట్ర విద్యా పరిశోధన - శిక్షణా మండలి ప్రొఫెసర్ డైరెక్టర్గా ఉన్నారు. భారతీయ విమానయాన శిక్షణా సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అకాడమీ, భారత డైనమిక్ లిమిటెడ్ సర్వే ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ ఎలక్రికల్స్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఎన్సీఈఆర్టీ (ఢిల్లీ), హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వారి ఎకాడెమిక్ సాఫ్ కాలేజీలు, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర ఆంధ్ర, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు, మరికొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, సంస్థల నిర్వహణ శిక్షణకు సంబంధించిన నిపణుడుగా, మేధావిగా, బోధకుడుగా వీరు అగణిత సేవలందించారు.

1918లో ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆచార్య ఐ.వి. చలపతిరావు ఇంగ్లీషు - పారిన్ లాంగ్వేజెస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ (సీవెల్) రిజిస్టారుగా, భార తీయ విశ్వవిద్యాలయాల సంఘం సమన్వయకర్తగా పనిచేశారు. అంతేకాకుండా నూపోర్ట్ విశ్వవిద్యాలయం డైరెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషనరేట్ కన్న లైంట్గా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సభ్యకార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలి దాకా ఉన్నత విద్యావేదిక అధ్యక్షులుగా కొనసాగారు.

మహాత్మాగాంధీని స్వయంగా కలుసుకుని స్ఫూర్తిపొందిన చలపతిరావు సాధారణ జీవితం గడుపుతూ, అసాధరణ చింతనాపరుడుగా, జీవిత చరిత్ర కారుడుగా రూపొందాడు. భారతీయ చింతనను, సంస్కృతిని ప్రస్పుటం చేసే మహనీయులు, దేశభక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఇతర రంగాల తేజోమూర్తుల జీవిత చరిత్రలు ఇంగ్లీషులో రాసి, బయటి ప్రపంచానికి భారతీయులు, తెలుగువారి ప్రతిభా విశేషాలను చాటారు.[3]

రచనలు

[మార్చు]

ముఖ్యంగా వీరు రచించిన మహాత్మాగాంధీ, శంకరాచార్య ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్, హర రాష్ట్రపతి- నీలం సంజీవరెడ్డి తదితర ప్రముఖుల జీవిత చరిత్రలు చెప్పుకోదగినవి. "కల్చర్ క్యాప్సూల్స్" శీర్షికన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాలేజీ టీచర్స్ అడ్మినిస్తేటర్స్ - హ్యాండ్బుక్ ఇండియన్ రినెజాన్స్ ఏన్షియంట్ విజ్డమ్- మోడ్రన్ ఇన్సైట్స్, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లివింగ్ త్రూ ఛేంజింగ్ టైమ్స్ సంస్కృతి సౌరభాలు, జీవన సౌందర్యం ఇత్యాది డజను ప్రామాణిక గ్రంధాలు రచించారు. స్వీయ జీవిత చరిత్ర 'వాట్ లైఫ్ టాట్ మి కూడా వీరు రాసుకుని ముందుతరాలకు అందించారు.

అవార్డులు

[మార్చు]
  • 2010 లో, విద్యారంగంలో విశేష సేవలందించినందుకు గాను ముఖ్యమంత్రి రోశయ్య చేతులమిదుగా "ప్రతిభా రాజీవ్ పురస్కారం"
  • 1992 లో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు గారి చేతులమీదుగా సత్కారం.
  • 1981 లో టి.అంజయ్య చేత, 1984, 1987 లలో ఎన్.టి. రామారావు చేతులమీదుగా సత్కారాలు.
  • 1989 లో కుముద్‌బిన్ జోషి, 1990లో కృష్ణకాంత్ చేతులమిదుగా,, 1998 లో రఘునాథరెడ్డి ద్వారా సత్కారాలు పొందారు.

మరణం

[మార్చు]

ఆయన ఏప్రిల్ 27 2016 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "I V Chalapati Rao : In Conversation with Atreya Sarma". Muse India. Archived from the original on 2016-04-01.
  2. "Triveni, India's Literary and Cultural Quarterly" (PDF). Sri Yabaluri Raghavaiah Memorial Trust. Archived from the original (PDF) on 2015-05-25.
  3. andhrajyothy/Andhra-Pradesh/29.04.2016/పేజీ 3]

ఇతర లింకులు

[మార్చు]