Jump to content

అరకట వేముల శాసనం

వికీపీడియా నుండి
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

చరిత్ర

[మార్చు]

శాసన పాఠ్యం

[మార్చు]
  1. స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య
  2. ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర
  3. విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు
  4. ఇన్నల్వురు సాక్షి
  1. దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్
  2. అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ
  1. తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా
  2. యాం జాయతే కృమి(ః)[1]

శాసన వివరణ

[మార్చు]

శాసనము చాలా స్పష్టముగ చదువుటకు వీలుగనున్నది. శాసనపాఠము పూర్తిగనే యున్నది. చెప్పదగిన లోపములు కానరావు. సంస్కృత శ్లోకములలో తప్పులు చెప్పదగినవి అంతగా లేవు. కనుక లేఖకుని దోషమని చెప్పి వదలివేయ వలసిన భాగమంతగా లేదు.

రామాపురం లోని చాళుక్య విక్రమాదిత్యుని శాసనము ఇదే కాలమునకు చెందిన దొకటి కలదు. అయినను 'శ్రీ'ని స్వస్తిశ్రీలో దానినిగ చెపితే వల్లభ మహారాజగును. శ్రీ వల్లభుడుగాని వల్లభుడుగాని ప్రసిద్ధ రాజెవడు ఆనాడున్నట్లు తెలియదు. దానము చేసిన దాతను తెలుపును. భూపాదిత్యుడనే సామంతుడను కొనవలెను. ఆయన మహాబాణ వంశమునకు చెందినవాడు. 'కదాన్' అనే పదనికి అర్థము తెలియదు. పెర్ అనగ కన్నడములో గొప్ప అని అర్థము. దానము చేసిన దాతను తెలుపును. భూపాదిత్యుడనే సామంతుడనుకొనవలెను. ఆయన మహాబాణ వంశమునకు చెందినవాడు. సాక్షులు నల్వురు. ఉన్నపదాలు నాలుగు.

  1. వేంగుళూదు
  2. పెన్డు(డ్=θ)కాలు
  3. నారకోళు
  4. కంచద్లు.

ఈ నాలుగు మనుష్యుల పేర్లగునా కాదా అని సందేహము. వేంగుళూద్లు అనునది ఊరి పేరగుచో పెన్డ్రుకాలు ఆ యూరివాడగు. ఇదియే ఉచితమని తోచును. కాని వేంగుళూదు అని షష్ఠ్యంతముగా లేదు. పైన 'వంగనూద్ల' షష్ఠ్యంతము కలదు. నారకోళు అనునది స్థలనామమో మనిషిపేరో తెలియదు. కాబట్టి నయిష్టం మీద ఆధార పడియున్నది. 'నమ్మిపోళు 'అని మనిషిపేరొకటి బాణ వంశపు ధవళెయ రాజు యొక్క బలపనూరు శాసనములోకలదు. అట్లే యిది యు మనిషి పేరగునేమో. కంచద్లు (కంచరివాండ్రు)అనియెందరో తెలియదు. ఈ నాల్గిటి లోను ఒక్కటికూడ మనిషి పేరుగా కనిపించదు. వేంగుళూద్లు, వేల్పుచెర్ల, శాసన మందున్న వ్ర్యేంగులవంటి వారి సంఘమునకు చెందిన నివాసమని తోచును. వారికి సంబంధించిన 'పెద్దకాలు' అనగ ఆసామి లేక ఉద్యోగియని అర్థమగును. [1]

లిపి, భాష

[మార్చు]

ప్రాధాన్యత, ప్రాచుర్యం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 జి, పరబ్రహ్మ శాస్త్రి (1978). "అరకట వేముల శాసనం". తెలుగు శాసనాలు.