అరటికాయ పులుసు కూర (నిమ్మకాయ)
అరటికాయ పులుసు కూర అరటికాయ, నిమ్మకాయ రసంతో చేయబడిన శాకాహారం వంటకం.
అరటికాయ నిమ్మకాయ ముద్దకూర
[మార్చు]అరటికాయ చెక్కు తీసి ఒక మాదిరి పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ముక్కలకు సరిపడ ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. ముక్కలు మరీ మెత్తగా ఉడకబెట్ట కూడదు, కూర సుద్ద అయిపోతుంది. ఈ ముక్కలను విడిగా తీసుకుని తాలింపు (తిరగమూత) వేసుకోవాలి.[1]
తాలింపు సామాను
[మార్చు]- చాయమినపప్పు
- ఎండు మిర్చి (2-3)
- ఆవాలు
- మెంతులు
- నూనె (2-3 స్పూన్లు)
- శనగపప్పు
- జీలకర్ర
- ఇంగువ (కొద్దిగా)
- పచ్చిమిర్చి
- కరివేపాకు
- నిమ్మరసం (కొద్దిగా)
- ఎండు కారం తీసుకోవాలి.
తయారీ విధానం
[మార్చు]బేసిన్ వేడి చేసి, నూనె వేడి ఎక్కాక, తాలింఫు సామాను వరుసగా చాయమినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి, దీనిలో నిలుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, తరువాత కరివేపాకు వేసి కాసేపు వేయించాలి, ఇవి వేగాక ఉడకబెట్టిన కూర ముక్కలు అందులో వేసి కలియబెట్టాలి. చివరగా ఎండు కారం, నిమ్మరసం (కొద్దిగా) వేసి స్టవ్ కట్టేసి బాగా కలియబెట్టుకుని దింపేసుకోవాలి. (ఇష్టమైన వారు ఈ కూరలో కాసిని ఆవాలు నీళ్ళలో నాబట్టినవి నూరుకుని వేసుకోవచ్చు, కూర మరో రుచిగా ఉంటుంది.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
అరటికాయ (నిమ్మకాయ) కూర
-
అరటికాయలు
g