అరసవిల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అరసవిల్లి is located in Andhra Pradesh
అరసవిల్లి
అరసవిల్లి

అరసవల్లి శ్రీకాకుళం పట్టణానికి 1 కి.మీ దూరములో ఉంది.[1] పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం, 2008లో శ్రీకాకుళం పట్టణానికి కలిసిపోయి మున్సిపాలిటీలో ఒక వార్డుగా పరిగణించడమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు. దీనికి జనవ్యవహారంలో 'అర్షవెల్లి, యరసవెల్లి, అరిసివల్లి, అరసివిల్లి' మొదలగు పదములుగా ఉచ్చరించబడుచున్నది.అరసవిల్లిని 'హర్షవల్లి' అని సంస్కృతీకరించే ప్రయత్నం జరిగిందని గుర్తించబడినప్పటికీ, జనసామాన్యం చివరికి అరసవిల్లిగానే గుర్తించారు.సూర్యుని ఆదేశానుసారం హర్షుడు హర్షవల్లి అనేగ్రామాన్ని నిర్మించి అందులో సూర్యాలయాన్ని నిర్మించాడు.హర్షవల్లి సంస్కృతనామం చివరికి అరసవిల్లి లేదా అరసవల్లి అయినది.ఇక్కడ హర్షుడు అనగా సకలోత్తర పదాధినాధుడు హర్షుడుగా గుర్తించబడుచున్నది.'ఆరోగ్యం భాస్కరాధీనం' అను నమ్మికను బట్టి సూర్యనారాయణ ఆలయం ఉన్న గ్రామం కావున ఇది హర్షదాయకమైన నామ సార్థక్యమును కలిగినదనే సమర్ధన లేకపోలేదు.దీనిని అర్నోహర క్షేత్రం అని కూడా పెద్దలు అంటారు. అర్మస్సు అనగా మూలవ్యాధి. ఇదొక మొండి తెగులు.అట్టి జబ్బులను కూడా తొలగించు దివ్యక్షేత్రం అగుటచే అర్సవల్లిఅని కూడా అయిందంటారు.

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం[మార్చు]

అరసవిల్లి ఆలయం పుష్కరిణి

ఇక్కడి సూర్యదేవాలయంలో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వారా తెలియుచున్నది. ఇక్కడ లభించిన శాసనాలు సా.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల యిది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. (ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు[ఆధారం చూపాలి]). ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఉంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి, అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ ఉంది.ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆదిత్య కుమార్ ఎన్

ఆలయ విశేషాలు[మార్చు]

ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు ఉంది. ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ లలో ఇది జరుగుతుంది. (3-10-10) న జరిగింది.

అరసవిల్లి - శ్రీకాకుళం _ సూర్యనారాయణ స్వామి ఆలయము,కొన్ని చిత్రములు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-05.

బయటి లింకులు[మార్చు]