అలజంగి జోగారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ. జోగారావు
అలజంగి జోగారావు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1979
చిలకలపల్లి గ్రామం, బలిజిపేట మండలం, విజయనగరం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు సత్యం
జీవిత భాగస్వామి లావణ్య కుమారి
నివాసం వుడా కాలనీ, విజయనగరం

అలజంగి జోగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

అలజంగి జోగారావు 1979లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లా , బలిజిపేట మండలం , చిలకలపల్లి గ్రామం లో జన్మించాడు. ఆయన ఎం.టెక్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

అలజంగి జోగారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో పార్వతీపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. అలజంగి జోగారావు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు పై 24199 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Business Standard (2019). "Parvathipuram (SC) Election Result 2019: Parvathipuram (SC) Assembly Election 2019 Results | Parvathipuram (SC) Vidhan Sabha MLA Result". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
  2. Sakshi (2019). "Parvathipuram Constituency Winner List in AP Elections 2019 | Parvathipuram Constituency MLA Election Results 2019". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.