అశ్విని శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్విని శర్మ
Ashwini Sharma.jpg
జననం
వృత్తినటి, టెలివిజన్ వాఖ్యాత, సంగీతకారిణి
తల్లిదండ్రులుదూరి సూర్యప్రకాష్ శర్మ, లక్ష్మి

అశ్విని శర్మ తెలుగు సినిమా నటి, టెలివిజన్ వాఖ్యాత, సంగీతకారిణి.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అశ్విని శర్మ, దూరి సూర్యప్రకాష్ శర్మ లక్ష్మి దంపతులకు అండమాన్ లో జన్మించింది. ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయంలో చదివింది. నిఫ్ట్, హామ్స్‌టెక్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ పూర్తిచేసింది. సూర్యప్రకాష్ శర్మ మిలటరీలో పనిచేసారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

సినిమారంగం[మార్చు]

అశ్విని ఒకసారి హైదరాబాద్‌ వచ్చినపుడు దర్శకుడు సానా యాదిరెడ్డి హీరో సినిమాలో అవకాశం ఇచ్చాడు. కొడుకు సినిమాలో ఉత్తమ బాలనటిగా బహుమతి అందుకుంది. ఆ తర్వాత అభిమాని, పల్లకిలో పెళ్ళికూతురు, ధైర్యం, గొడవ, ఛత్రపతి వంటి పదిహేను సినిమాలలో నటించింది.[1]

టివీరంగం[మార్చు]

మొదటిసారిగా జెమినీ టీవీలో వచ్చిన నీ కోసం ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.[2] ఖుషి అన్‌లిమిటెడ్‌,,ఆనందం, వారెవ్వా, మా-టాకీస్‌, దూకుడు, ఫ్యామిలీ సర్కస్‌ వంటి టివీ కార్యక్రమాలు చేసింది.

గిన్నిస్‌ బుక్‌ రికార్డు[మార్చు]

2015లో 108 నిమిషాల్లో 9 నవగ్రహ కీర్తనలు పాడి, గిన్నిస్ బుక్ రికార్డు, ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డులను సాధించింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి. "ఆరేళ్లకే యాంకర్ నయ్యా." Retrieved 4 June 2017.
  2. సాక్షి. "అల్లరి పిల్లని." Retrieved 4 June 2017.