ఆంధ్రకవి తరంగిణి
Appearance
ఆంధ్ర కవి తరంగిణి చాగంటి శేషయ్య రచించిన పుస్తకం. దీని ఆరవ సంపుటము 1949 సంవత్సరం కపిలేశ్వరపురంలోని హిందూధర్మశాస్త్ర గ్రంథ నిలయము వారిచే ముద్రించబడినది.
తెలుగు కవుల సాహిత్యకృషి, జీవితం వంటి అంశాలతో ఆంధ్రకవుల తరంగిణిని రచించారు. ఆ క్రమంలో వివిధ కవుల జీవితాలు, సాహిత్యాంశాల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల గురించి సవిస్తరమైన పరిశోధన వ్యాసాలు కూడా రచించారు. ఈ సంపుటంలో శ్రీధరుడు మొదలుకొని వేమన, రేవకొండ తిరుమల సూర్యుడు వంటి కవుల వివరాలు ఇచ్చారు. రచయిత స్వయంగా సాహిత్య పరిశోధనాంశాలపై కృషిచేసిన వారు కావడంతో వివిధ సాహిత్య ప్రథల గురించి నిష్పాక్షికంగా నిర్ధారణ చేయబూనారు.
ఆరవ సంపుటములోని కవులు
[మార్చు]- శ్రీధరుడు
- కృష్ణమాచార్యుడు
- అయ్యలరాజు త్రిపురాంతకుడు
- తాళ్లపాక అన్నయాచార్యులు
- పిడుపర్తి నిమ్మయార్యుడు
- పిడుపర్తి (మొదటి) బసవకవి
- పిల్లలమర్రి పినవీరన్న
- ప్రోలుగంటి చెన్నశౌరి
- పిడుపర్తి సోమనాథకవి
- దగ్గుబల్లి దుగ్గనకవి
- మనుమంచిభట్టు
- నంది మల్లయ్య, ఘంట సింగయ్య
- కొరవి గోపరాజు
- బమ్మెర పోతనామాత్యుడు
- వెలిగందల నారయ
- గంగనార్యుడు
- ఏర్చూరి సింగన
- ఈశ్వర ఫణిభట్టు
- సదానంద యోగి
- పెనుమత్స వెంకటాద్రి
- పెనుమత్స గోపరాజుకవి
- ఆడిదము నీలాద్రికవి
- మాడయ కవి
- పిడుపర్తి (రెండవ) బసవకవి
- వేమన
- రేవణూరి తిరుమల కొండయార్యుడు