Jump to content

ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం జాతీయ స్థాయిలోని 'భారతీయ నాట్యసంఘానికి అనుబంధ సంస్థ. 1954, అక్టోబరు 1న ఎ.ఆర్.కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంఘానికి మొదటి అధ్యక్షులుగా డా.మర్రి చెన్నారెడ్డి, రెండవ అధ్యక్షులుగా పి.వి.నరసింహారావు కొనసాగారు.[1]

నాట్య సంఘం ఏర్పాటు

[మార్చు]

ఈ నాట్య సంఘం మొదట్లో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధన సంఘం, నాట్య కళానికేతన్, నవ కళా కేంద్రం అనే 5 సమాజాల సమాఖ్యగా రూపుదిద్దుకుంది. సంస్థ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే వందకుపైగా నాటక సమాజాలు దీనికి అనుసంధింపబడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, నిజామాబాద్, వరంగల్లు మొదలైన నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పడ్డాయి. నటన, దర్శకత్వం, సాంకేతిక అంశాలలో శిక్షణ ఇవ్వడంతోపాటు వివిధ ప్రాంతాలో జరిగే రంగస్థల కార్యక్రమాలను సమన్వయ పరచడం వంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషించింది.[2]

నాట్య సంఘం తలపెట్టిన కార్యక్రమాలు

[మార్చు]
  1. రంగస్థల కళలలో శిక్షణ ఇచ్చే నిమిత్తం నాట్య విద్యాలయాలను నిర్వహించడం
  2. రాష్ట్రస్థాయిలో ప్రతి ఏటా నాటకోత్సవాలు జరపడం
  3. రంగస్థల సేవా కేంద్రం ద్వారా సహాయ సహకారాలందించడం
  4. జిల్లా కేంద్రాలలో నాటకశాలలు నిర్మాణానికి కృషి చేయడం

నాట్య సంఘం సాధించిన ఫలితాలు

[మార్చు]
  1. 1954లో హైదరాబాద్లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు నిర్వహించడం
  2. 1955లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటక పోటీలకు సహకారం అందించడం
  3. 1959లో 40 రోజులపాటు నిర్వహించిన సంగీత, నృత్య, నాటకోత్సవాలు నిర్వహించడం
  4. సేవా స్టేజీ, పృథ్వీ థియేటర్స్, లిటిల్ బాలే థియేటర్ వంటి ప్రసిద్ధ రాష్ట్రేతర సమాజాలు ప్రదర్శనలివ్వడం
  5. అమెరికా నుంచి వచ్చిన వెన్ విశ్వవిద్యాలయం థియేటర్ గ్రూప్, మెయిన్ మాస్క్ థియేటర్ కంపెనీ, జాఫ్రీబాల కంపెనీ, ఇంగ్లాండ్కు చెందిన ఆక్స్ ఫర్డ్ ప్లే హౌస్ కంపెనీ, బ్రిస్టల్ ఓల్దలిక్ వంటి నాటక సంస్థలచే నాటక ప్రదర్శనలు ఇప్పించడం.

మూలాలు

[మార్చు]
  1. నవ తెలంగాణ. "ఆయన తెలుగు నాటక ప్రయోగశాల". Retrieved 2 August 2017.[permanent dead link]
  2. కరీంనగర్ జిల్లా నాటకరంగం. ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం (ప్రథమ ed.). జయవీర్ కోటగిరి. p. 65.