Jump to content

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2009-10

వికీపీడియా నుండి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పటం (2009-10)

2008-09 సంవత్సరపు నివేదిక 2010 ఫిబ్రవరి 20 న శాసనసభలో ప్రవేశ పెట్టబడింది.

సామాజిక, ఆర్థిక సర్వే 2008-09 [1][2][3] ముఖ్యాంశాలు
  • గత ఐదేళ్లలో (2008-2009 ఆర్థిక సంవత్సరాంతానికి) రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 9.07 శాతం. ఇదే కాలంలో జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 8.49 శాతం. 2008-2009 లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి 2, 39, 372 కోట్లు. ఇది 2, 51, 631 కోట్లకి చేరుకోవచ్చు. అంటే 5.04 శాతం వృద్ధి. 9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 5.5 శాతంగా పెరిగిన మన రాష్ట్ర జిఎస్‌డిపి 10వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2002-03 నుండి 2006-07 వరకు) ఈ శాతం 8.33కు పెరిగినట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో 1.20, 0.22, 9.58 శాతం వృద్ధిఅంచనా.
  • ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రు.40, 902గా 2008-09 సంవత్సర ఉజ్జాయింపు లెక్కల్లో తేలిందని, ఈ మొత్తం 2007-08 నాటి తాత్కాలిక అంచనాల ప్రకారం రు.35, 600లుగా ఉందని సర్వే వెల్లడించింది.
  • గతేడాది ఖరీఫ్లో 42.73 లక్షల హెక్టార్లలో 105.62 లక్షల టన్నుల దిగుబడి సాధించింది. అకాల వర్షాలు. వైపరీత్యాలతో సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గుతుందని అంచనా.
  • గతేడాది 62.85 లక్షల హెక్టార్లకు సాగునీరు అందితే, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 67.41 లక్షల హెక్టార్లకి ( 7.3 శాతం వృద్ధి) చేరుతుందని అంచనా.
  • పంటల బీమాపథకం కింద ఖరీఫ్ లో గుంటూరు జిల్లాలో ఎండు మిరప కాయలకి, రబీలో కడప. అదిలాబాద్, కర్నూలు. ప్రకాశం జిల్లాలలో ధనియాల పంటకి బీమా కల్పించారు.
  • గతేడాది గనుల, భూ గర్భ వనరుల శాఖ1754.51 కోట్లు ఆదాయం పొందింది.
  • ఐటి రంగంలో 2008-09 కి 32, 509 కోట్లు టర్నోవర్ సాధించింది.
  • రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద, 26.81 లక్షల మంది లబ్ధి పొందారు. 147.56 కోట్లు వ్యయం అయింది.
  • గృహ నిర్మాణ పథకం కింద 44.37 లక్షల నిర్మించారు. ఇందులో 40.69 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.
  • జాతీయ ఉపాధి హామీ పథకం కింద 119.08 లక్షల జాబ్ కార్డులు జారీ అవగా, 15.64 లక్షల కుటుంబాలు 100 రోజుల పని దినాలను పూర్తి చేశాయి.
  • వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన మన రాష్ట్రంలో అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నది అందరి అభిప్రాయం. జాతీయ స్థాయిలో కూడా ఇదే పరిస్థితి. కాని, మన రాష్ట్రంలో ఈ పరిస్థితి తద్విరుద్ధంగా కొనసాగుతోంది. ప్రణాళికా సంఘం తాజాగా వెలువరించిన 2004-05 అధికార గణాంకాల ప్రకారంగా మన రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న వారు పట్టణ ప్రాంతాల్లో 28 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 11.2 శాతం మాత్రమే ఉన్నారు. ఇది రాష్ట్ర సరాసరి 15.8 శాతం. అఖిల భారత స్థాయి 27.5 శాతం కన్నా ఇది చాలా తక్కువ. ఇదే అఖిల భారత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 27.5 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు
  • ఆమోదం పొందిన రాష్ట్రంలోని 103 ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (ఎస్‌ఇజెడ్‌) లో 73 మండళ్ళను నోటిఫై చేశారు. నోటిఫై చేసిన వాటిలో 43 ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అమలులోకి వచ్చాయని, అందులో 35, 269 మందికి ప్రత్యక్షంగా, 19, 507 మందికి పరోక్షంగా ఉపాధి లభించినట్టు పేర్కొన్నారు.

వనరులు

[మార్చు]
  1. "సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 - సంకలనం రఘురామ్". Archived from the original on 2012-01-10. Retrieved 2012-02-18.
  2. "మద్యమే అదనపు ఆదాయ వనరు " విశాలాంధ్ర 21 ఫిబ్రవరి 2010
  3. "AP Socio Economic survey 2009-10". Archived from the original on 2012-03-05. Retrieved 2012-02-18.