ఆంధ్ర నాటక సమాఖ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర నాటక సమాఖ్య తెలుగు నాటకరంగం లోని వివిధ సమాజాలన్నింటిని ఒకచోట సమన్వయపరచాలన్న ఉద్దేశ్యంలో స్థాపితమైన సంస్థ.[1]

ప్రారంభం[మార్చు]

ఆంధ్ర నాటక సమాఖ్య 1954 ఆగస్టులో రాజమండ్రి లో బలరాజ్సహానీ చేతులమీదుగా ప్రారంభించబడింది. 1954, ఆగస్టు 7న జరిగిన మహాసభలో ఈ నాటక సమాఖ్య ఆధ్యక్షుడిగా కొప్పరపు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా గరికపాటి రాజారావు ఎన్నికయ్యారు.

కార్యకలాపాలు[మార్చు]

1956, జనవరి 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు స్థానం నరసింహారావు ప్రధానాచార్యుడిగా రామమోహన గ్రంథాలయ హాలులో నాటక తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు వివిధ నాటకసంస్థల నుంచి 115 మంది విద్యారులు హాజరవ్వగా, కూర్మా వేణు గోపాలస్వామి, ఆచార్య ఆత్రేయ, శ్రీనివాస చక్రవర్తి, భాగవతుల కుటుంబరావు, జమ్మలమడక మాధవరామశర్మ, కొప్పరపు సుబ్బారావు, గరికపాటి రాజారావు వంటివారు నాటకరంగానికి సంబంధించిన వివిధ విషయాలు బోధించారు. ఈ తరగతులకు ప్రతిరాత్రీ రూపశిల్పి కుమార్ ఆహార్యం మీద తరగతులు నిర్వహించాడు. కుమార్ బోధనకు శాశ్వత రూపమివ్వడానికి 'ఆహార్యం' అనే పేరుతో చిన్న పుస్తకం ప్రచురించింది.

1978, జనవరి 17 నుంచి 22 వరకు ఆరు రోజులపాటు రాజమండ్రిలోని వీరేశలింగం హైస్కూలులో మరోసారి నాటక శిక్షణ తరగతులు నిర్వహించింది. ఇందులో కె.వి. గోపాలస్వామి, శ్రీనివాస చక్రవర్తి, వి. కుమార్, వి. రోహిణి, నండూరి రామకృష్ణమాచార్యులు, దివాకర్ల వేంకటావధాని, పోణంగి శ్రీరామ అప్పారావు, కొర్రపాటి గంగాధరరావు, గరికపాటి రాజారావు, చాగంటి సన్యాసిరాజు, గిడుగు సీతాపతి లు ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. కొప్పరపు సుబ్బారావు, గరికపాటి రాజారావుai గతించడంతో ఈ సమాఖ్య అంతరించింది.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.208.