ఆంధ్ర యోగినులు
ఆంధ్ర యోగినులు | |
కృతికర్త: | బి. రుక్మిణి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్రలు |
ప్రచురణ: | శ్రీ సాయి ప్రచురణలు |
విడుదల: | 2004 |
ఆంధ్ర యోగినులు 2004 సంవత్సరంలో ప్రచురించబడిన ఒక తెలుగు పుస్తకం.
దీని రచయిత డా. బి. రుక్మిణి వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈ కృతిని రచయిత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి సమర్పించారు.
మహాభారతం, అరణ్యపర్వంలోని ధర్మవ్యాధోపాఖ్యానంలోని కౌశికునికి గుణపాఠం నేర్పిన పతివ్రత కథ ఈ రచనకు ప్రేరణ. ఈమె డా. బి. రామరాజు గారి పుత్రిక. వీరితో ఆంధ్రయోగుల గురించిన సమాచారం సేకరణ కొరకు ఎందరో మహనీయుల సమాధులను దర్శించారు. ఆంధ్ర యోగుల చరిత్రను రామరాజు గారు రచించగా, యోగినుల చరిత్రను రుక్మిణి గారు చేపట్టారు. ఈ పర్యటనలో దాదాపు 50 కి పైగా యోగినుల సమాచారం లభించగా అందు 27 మంది యోగినులను ఈ పుస్తకంలో పరిచయం చేశారు. ఈ యోగినులలో బ్రహ్మచారిణులై సాధన లేదా తపస్సుతో సిద్ధిపొందినవారు, వివాహమైన కొద్దికాలానికి వైధవ్యం ప్రాప్తించగా ఆధ్యాత్మిక మార్గాన లక్ష్యాన్ని సాధించినవారు, గృహస్థాశ్రమం స్వీకరించి విరాగిణులై భగవదన్వేషణలో కృతార్ధులైన వారు ఉన్నారు.
పుస్తక ముఖచిత్రం కోసం యోగినుల చిత్రాలను శ్రీ గోలి శివరాం గారు చిత్రించారు.
యోగినులు
[మార్చు]- కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ
- తరిగొండ వెంకమ్మ
- సూక్ష్మముర్తెమ్మ
- దొంతులమ్మ
- మాణిక్యనగరం వెంకమ్మ
- తిక్క లక్ష్మమ్మ
- గుత్తికొండబిలం పేరమ్మ
- సరస్వతి లక్ష్మమ్మ
- కోసలనగరం రామక్కమ్మ
- కురుముద్దాలి పిచ్చమ్మ
- సుందరమ్మ
- మంగమ్మ
- మూటలమ్మ
- పిరాట్ల రామలక్ష్మమ్మ
- రేపల్లె చిన్నమ్మ
- సూరి నాగమ్మ
- బెహరా కమలమ్మ
- గోవాడ శేషమ్మ
- చివటం అచ్చమ్మ
- దేవుడమ్మ
- గుట్టూరుకోన అంజనాదేవి
- పెనుమత్స సీతమ్మ
- జిల్లేళ్ళమూడి అనసూయమ్మ
- కృష్ణప్రియ
- గయాబాయి
- తాడ్వాయి శబరిమాత
- శృంగవృక్షం శివబాలయోగేశ్వరీదేవి
మూలాలు
[మార్చు]- ఆంధ్ర యోగినులు, డా. బి. రుక్మిణి, శ్రీ సాయి ప్రచురణలు, వరంగల్, 2004.