ఆకుల శ్రీధర్
ఆకుల శ్రీధర్ | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 17 డిసెంబర్ 1977 గోదావరిఖని, రామగుండం మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ | ||
తల్లిదండ్రులు | రాజేశ్వరి, సూరయ్య | ||
జీవిత భాగస్వామి | మౌనిక | ||
సంతానం | పూర్విజ్ఞ, పూర్ణ సాహితీ | ||
వృత్తి | డాన్స్ మాస్టర్ , కర్రసాము శిక్షకుడు |
డా. ఆకుల శ్రీధర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కర్రసాము కళాకారుడు. తెలుగు విశ్వవిద్యాయలం నుండి కర్రసాములో పీహెచ్‌డీ పూర్తిచేసిన శ్రీధర్ అపూర్వ కళా సాహితి అకాడమీ అనే సంస్థను స్థాపించి కర్ర, కత్తిసాములో శిక్షణ ఇస్తున్నాడు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఆకుల శ్రీధర్ 1977 డిసెంబరు 17న తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, గోదావరిఖనిలో ఆకుల సూరయ్య, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. 8ఇంక్లైన్ కాలనీ లో ఇంటర్ పూర్తిచేసి, భద్రాచలం జిల్లా, కొత్తగూడెంలో శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో డిగ్రీ, ఆ తరువాత హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ జానపద కళలు ఎం.ఫిల్డ్ చేసి పిహెచ్.డి కర్రసాము ప్రదర్శన పద్ధతులు – విశ్లేషణ అనే అంశంపై ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో 2015లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా డాక్టరేటు పట్టాను అందుకున్నాడు.[2]
కళారంగ జీవితం
[మార్చు]శ్రీధర్ తండ్రి ఆకుల సూరయ్య కూడా గాయకుడిగా, నటుడిగా, నృత్యకారుడిగా, వ్యాయామకారుడిగా, కుస్తీదారుడిగా గుర్తింపు పొందాడు. సింగరేణి గని కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సింగరేణి తరుపున వెళ్ళి రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో పాల్గొని సింగరేణికి మంచి గుర్తింపు తెచ్చాడు. 2010 జాతీయ స్థాయి బాడీ బిల్డింగులో మిస్టర్ తెలంగాణ టైటిలును కూడా కైవసం చేసుకున్నాడు. తండ్రి బాటలోనే శ్రీధర్ కళారంగంలో అడుగులు వేశాడు. కర్రసాము గురువు కంతి పోషం, మాజీ ఎమ్మెల్యే మాల మల్లేశం వద్ద 10వ ఏటనే కర్రసాములో శిక్షణ తీసుకున్నాడు.
ప్రదర్శనలు
- 2020, 2021, 2022 సంవత్సరాలలో శివరాత్రి సందర్భంగా వేములవాడలోని రాజరాజేశ్వరి దేవాలయం సన్నిధానంలో కర్రసాము ప్రదర్శన
- 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సమక్షంలో కర్రసాము ప్రదర్శన[3]
- సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ కమిటీ నిర్వహించిన భారత్ మాత మహా హారతి ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో కర్రసాము ప్రదర్శన
- 2021, 2022 సంవత్సరాలలో ఆగష్టు 15న గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా కర్రసాము ప్రదర్శన
శిక్షణ
[మార్చు]తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రవీంద్రభారతిలో యుద్ధ విద్యలైన కర్ర, కత్తి సాములో శిక్షణ అందించాడు.[4]
పురస్కారాలు
[మార్చు]- కర్రసాము కళారత్న అవార్డు (కడప, ఆంధ్రప్రదేశ్)
- సింగిడి అవార్డు (2021 డిసెంబరు, రవీంద్రభారతి, హైదరబాదు)
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu (22 December 2019). "కర్రసాములో ఇరగదీసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The New Indian Express (4 March 2020). "No carrot, all stick approach". Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ ABN (2020-03-09). "యువతుల కర్రసాము". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
- ↑ Namasthe Telangana (11 April 2021). "ప్రాచీన యుద్ధవిద్యలకు పునర్జీవం". Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.