ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లేదా ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ కూడా. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే. భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధికంగా లాభం ఆర్జించే సంస్థ ఇది. భారత ప్రభుత్వం ఇందులో 74 శాతం వాటా కలిగి ఉంది.

ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. చమురు కోసం క్రియాశీలకంగా అన్వేషణలు కొనసాగిస్తుంది. 30 శాతం భారతీయ ముడి చమురు అవసరాలను దీనివల్లే తీరుతున్నాయి. భారతదేశంలో సుమారు 11 వేల కిలోమీటర్ల పైప్‌లైన్లను నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

దీన్ని ఆగస్టు, 1960 న స్థాపించారు.