Jump to content

ఆరతీ వైద్య

వికీపీడియా నుండి
ఆరతీ వైద్య
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆరతీ వైద్య
పుట్టిన తేదీ (1970-07-02) 1970 జూలై 2 (వయసు 54)
Pune, India
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుఎడమ చేతి బౌలింగ్ మీడియం
పాత్రబాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 45)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1999 15 జులై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 47)1995 ఫిబ్రవరి 12 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే1995 11 నవంబర్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–1992/93మహారాష్ట్ర
1993/94రైల్వేస్
2000/01ముంబై
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 6 6 56
చేసిన పరుగులు 139 162 192 1,530
బ్యాటింగు సగటు 27.80 27.00 27.42 34.77
100లు/50లు 0/0 0/1 0/0 0/8
అత్యుత్తమ స్కోరు 39 77 39 96*
వేసిన బంతులు 30 24 102 45
వికెట్లు 0 1 1 11
బౌలింగు సగటు 22.00 31.00 7.60
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/11 1/8 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 1/– 2/–
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 17

ఆరతీ వైద్య (జననం 1970 జూలై 2) ఒక భారత మాజీ క్రికెటర్. ఆమె ఎడమచేతి వాటం బ్యాటర్. ఆమె 1995 నుంచి 1999 మధ్య భారతదేశం తరపున మూడు టెస్ట్ మ్యాచ్ లు, ఆరు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. ఆమె మహారాష్ట్ర రైల్వేస్, ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

దేశవాళీ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ నిర్ణేత (రిఫరీ)గా వ్యవహరించి, భారత్‌లో మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె T20 ముంబై లీగ్ మొదటి ఎడిషన్‌లో ఒక మ్యాచ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. వాంఖడే స్టేడియంలో నమో బాంద్రా బ్లాస్టర్స్, సోబో సూపర్‌సోనిక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ రిఫరీగా వ్యవహరించింది. ఆమె ఇదివరలో మాజీ ముంబై అండర్-19కి జట్టు ఎంపికలో అధికారిగా పనిచేసింది. ఆమె BCCI నిర్వహించే మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు, సమూహ ఆటలలో కూడా అధికారికంగా పనిచేసింది.[3]

జాతీయ స్థాయిలో ఎంపిక చేసే అధికారి (సెలెక్టర్) పదవికి ఐదుగురు సభ్యుల ప్యానెల్‌లో ఒకరిగా 3 సంవత్సరాల పాటు ఆరతీ నియమింపబడింది. ఈ ప్యానెల్‌కు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ నేతృత్వం వహించారు. ఇతర సెలెక్టర్లుగా రేణు మార్గ్రేట్, మిథు ముఖర్జీ, వి.కల్పన పనిచేసారు.[4]

సూచనలు

[మార్చు]
  1. "Player Profile:". ESPNcricinfo. Retrieved 17 August 2022.
  2. "Player Profile: Arati Vaidya". CricketArchive. Retrieved 17 August 2022.
  3. "Meet Arati Vaidya - The first woman match referee in India". CrickTracker. 16 March 2018. Retrieved 3 August 2023.
  4. "Life comes full circle for women's cricket selector Renu Margrate". HindustanTimes. 9 October 2020. Retrieved 24 August 2023.

బాహ్య లింకులు

[మార్చు]