వి కల్పగమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి కల్పగమ్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

వి కల్పగమ్ తండ్రి రీసెర్చ్ స్కాలర్. ఆయన మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎస్.సి పూర్తిచేసాడు. ఒకప్పుడు హైదరాబాదు లోని నిజాం కాలేజి మద్రాసు యూనివర్శిటీకి అనుబంధంగా ఉండేది. వి కల్పగం తండ్రి రీసెర్చ్ పూర్తిచేసిన తరువాత నిజాం కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఆయనకు ఒక లాబరేటరీ ఉండేది. వి కల్పగం తండ్రి దైనందిక జీవితంలో జరిగే సంఘటనలకు సైన్స్‌కు ఉన్న సంబంధాన్ని పిల్లలకు వివరిస్తూ పిల్లలకు సైన్స్ పట్ల ప్రేరణకలిగించాడు. వారి ఇంట్లో ఎప్పుడూ విస్తారంగా పుస్తకాలు ఉంటూఉండేవి. అలాగే వారింటికి వి కల్పగం తండ్రి స్నేహితులు వస్తూ ఉండేవారు. అలాగే వారి పిల్లలు కూడా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. వారంతా కూడా సదా విద్యాసంబంధిత చర్చలు జరపడం ఆకు ఉన్నత విద్య అంటే ఆసక్తి కలగడానికి కారణం అయింది. ఆమె తాత (తల్లి తండ్రి ) ఇంజనీర్, మేనమామ ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి మొదటి జట్టులో ఇంజనీరుగా చేరాడు.

స్కూలు

[మార్చు]

వి కల్పగం మిషనరీ పాఠశాలలో చదువుకున్నది. స్కూలులో టీచర్లు ఎప్పుడూ చదువు ముఖ్యత్వం గురించి ఎవరికి వారు వారి స్వంతకాలు మీద నిలబడాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆమెకు విద్యనేర్పిన టీచర్లలో కొనమంది డిగ్రీ చదివే సమయంలో వి కల్పగం నానకు విద్యార్థులుగా ఉన్నవారు. వారు వి కల్పగంతో ఆమె తండ్రి గొప్పతనం గురించి చెప్తూ ఆయనస్థాయికి రావడానికి ప్రయత్నించమని సలహా ఇస్తూ ఉండేవారు. అప్పట్లో ఆమెకు తన తండ్రిని అనుసరించాలని లేకున్నా తరగతిలో ప్రథమస్థానంలో ఉండాలని మాత్రం పట్టుదల ఉండేది. ఆమె అప్పట్లో తీవ్రమైన పోటీ చేసిన విద్యార్థిని ప్రస్తుత ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్ లక్ష్మణన్ మేనత్త కావడం విశేషం. ఇంటర్ మీడియట్ పూర్తిచేసే వరకూ పోటీ కొనసాగింది.తరువాత వారివారి దారులు వేరయ్యాయి.

ప్రేరణ

[మార్చు]

స్కూలు ప్రింసిపాల్ మిస్ డీ లైమా విద్యార్థులందరినీ సమానంగా ప్రేమించేది. మిస్ డీ లైమా ఎథిక్స్ క్లాసులో విద్యార్థులకు హిందూ కావ్యాలు, ఖురాన్, బైబిల్ నుండి అంశాలను ఎంచుకుని విద్యార్ధూకు నీతి బోధ చేసేది. ఆమె స్కూలుకు కవికోకిల బిరుదాంకితురాలు సరోజినీ నాయుడు ప్రింసిపాలుకు స్నేహితురాలుగా తరచుగా విచ్చేస్తుండేది. సరోజినీ నాయుడు విద్యార్థినులకు రోల్ మాడల్‌గా ఉండేది. వి కల్పగం తండ్రి ఆసమయంలో నిజాం కాలేజీలో నిజాం కాలీజీలో లెక్చరర్‌గా ఉండేవాడు. సరోజినీ నాయుడు తరచుగా నిజాంకు వెళ్ళివస్తుండేది. అందువలన సరోజినీ నాయుడు వి కల్పగం అంటే ప్రత్యేక ఆసక్తి కనబరిచేది. వి కల్పగం చిన్నవయసులోనే ఆమె తండ్రి రీసెర్చ్ సహాధ్యాయుడైన ప్రొఫెసర్ భగవంతంతో పరిచయం ఉండేది. అలాగే ఆమెకు నిజాంకాలేజీలో సివి.రామన్ వంటి పలు ప్రఖ్యాత శాస్త్రవేత్తల ఉపన్యాసాలను వినే అవకాశం లభించింది. బహుశా ఇవన్నీ ఆమెకు ప్రోత్సాహం అందించి ఉండవచ్చన్నది ఆమె భావన.

కాలేజ్

[మార్చు]

వి కల్పగం హె.ఎస్.సి పూర్యి చేసిన తరువాత ఆమె కాలేజిలో చేరినప్పుడు ఇంటర్, బి.ర్స్.సిలలో ఫిజిక్స్, కెమెస్ట్రీ, మాథమెటిక్స్ ప్రధానాంశాలుగా తీసుకున్నది. తరువాత ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఎస్.సిలో ఫిజిక్స్ ప్రధానాంశంగా తీసుకుంది. ఆమె ఎం.ఎస్.సి పూర్తిచేయగానే చెన్నైలో బారిస్టర్‌గా పనిచేస్తున్న తండ్రి మేనమామ సివిల్-సర్వీసెస్ చెయ్యమని సలహా ఇచ్చాడు. వి కల్పగం తండ్రి కజిన్ ఐ.పి.ఎస్‌గా ఉండేవాడు. ఎవరేమి చెప్పినా ఆమెకు సివిల్ సర్వీసు మీద ఆసక్తి ఉండేది కాదు.

రీసెర్చ్

[మార్చు]

వి కల్పగం ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాంసలర్ ప్రొఫెసర్ ఎస్.భాగవతాన్ని కలుసుకుని తన రీసెర్చ్‌కి ఆర్గదర్శకుడిగా ఉండమని అభ్యర్హించింది. ఆమె రీసెర్చ్ ప్రారంభించిన ఒక సంవత్సరానికి ప్రొఫెసర్ ఎస్.భాగవతం ఐ.ఐ.ఎస్.సి డైరెక్టర్‌గా బెంగుళూరు వెళ్ళాడు. వి కల్పగం కూడా ఆయనతో బెంగుళూరు వెళ్ళింది. ఆమె ఉస్మానియాలో లైట్ స్కాటరింగ్ స్టడీస్ ఆఫ్ పాలిమర్ సొల్యూషన్ పని కొంత ప్రారంభించింది. ఐ.ఐ.ఎస్.సిలో ఫిజిక్స్ కెమెస్ట్రీ డిపార్ట్‌మెంటులో అప్పుడప్పుడే లైట్ స్కాటరింగ్ పరికరాల సేకరణ జరుగుతూ ఉంది.అందువలన ఐ.పి.సిలో చేరమని ప్రొఫెసర్ ఎస్.భాగవతం వి కల్పగానికి సలహా ఇచ్చాడు. ఐ.పి.సి డిపార్ట్‌మెటులో ఆమె ఫిజిక్స్, ఇనార్గానిక్ కెమెస్ట్రీ సంబంధిత పలు కోర్సులు అధ్యయనం చేసింది. అలాగే సబ్జెక్ట్, టెక్నిక్ సంబంధిత కొన్ని ప్రయోగాలు తనతాను చేసింది.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

వి కల్పగం రీసెర్చ్ థిసీస్ సమర్పించిన తరువాత ఐ.ఐ.ఎస్.సిలో ఉద్యోగబాధ్యతలను స్వీకరించి సైన్స్ రంగంలో తన అనుబంధాన్ని కొనసాగించిది. అంతేకాక ఆమె ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకునేవరకు ఆమె ఐ.ఐ.ఎస్.సిలో పనిచేయడం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం. ఉద్యోగంలో స్థిరపడిన తరువాత యు.ఎన్.డి.పి తరఫున యు.ఎస్.ఎ లోని ఎం.ఐ.టికి అప్పుడు కొత్తగా ప్రవేశపెట్టాలని అనుకున్న " మెటీరియల్ సైన్స్ " అధ్యయనం చెయ్యడానికి ఎన్నికచేయబడింది. ఐ.ఐ.ఎస్.సి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అనుభంధ కోర్సుగా ప్రవేశపెట్టింది.ఆమె ప్రొఫెసర్ స్మకులతో కలిసి ఎలెక్ట్రానిక్ డిపార్ట్‌మెంటులో పనిచేసింది. నూతన ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధించడమేకాక ప్రొఫెసర్ స్మకుల క్రిస్టల్ స్ట్రక్చర్ పరిశోధన చేసాడు. మెటీరియల్ సైన్స్ గురించి ఆమె పలు ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటులో లెక్చర్లు ఇచ్చింది.

సహోద్యోగులు

[మార్చు]

వి కల్పగం యు.ఎస్ నుండి మెటీరియల్ సైన్స్ గురించి అధ్యయనం చేసి తిరిగి వచ్చిన తరువాత ఆమె " లైట్ స్కాటరింగ్ ఆఫ్ పాలిమర్ సొల్యూషంస్ " రీసెర్చ్ కొనసాగించిది. క్రమంగా పి.హెచ్.డిలో విద్యార్థుల సంఖ్య అధికం అయింది. ఆమె రీసెర్చ్ పాలీమర్స్ నుండి కోపాలిమర్స్ వైపు సాగాయి.

విక్రం సారాభాయి

[మార్చు]

వి కల్పగానికి ప్రొఫెసర్ విక్రంసారాభాయితో సమావేశం అయ్యే అవకాశం లభించింది. ఆమె పనిచేసే ఫ్లోరులో ప్రొఫెసర్ విక్రం సారాభాయికి ఒక గది కేటాయించబడి ఉండేది. ప్రొఫెసర్ విక్రం సారాభాయి ఎం.ఐ.టికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వసుండేవాడు. ఒకసారి ఆయన తనకుతానే వి కల్పగాన్ని పిలిపించి ముచ్చటించాడు. వి కల్పగం ఐ.ఐ.ఎస్.సి నుండి వచ్చిన విషయం విని ఆయన ఉత్సాహభరితుడై ఐ.ఐ.ఎస్.సి గురించిన తన అనుభవాలను, అహమ్మదాబాదు ఫిజిక్స్ లాబ్స్ గురించి, ఇస్రో (ఐ.ర్స్.ఆర్.ఒ) ప్రారంభించడంగురించి ముచ్చటించాడు. అలాగే ఆర్ట్స్ సంబంధిత పలు విషయాలను స్పృజిస్తూ సాగిన ఆసమావేశం ఆమెకు మరపురాని అనుభూతిని ఇచ్చింది.

గుర్తింపులు

[మార్చు]

వి కల్పగానికి మైసూరు లోని " శ్రీ జయచమరాజేంద్రా ఇంస్టిట్యూట్ " యాజమాన్యం " పాలిమర్ ఇంజనీరింగ్ " డిపార్ట్‌మెంటు ఆరభించే సందర్భంలో పాలిమర్ సైన్స్ లాబరేటరీ ఏర్పాటు చేసే అవకాశం లభించింది. అంతేకాక ఆమె మైసూరు లోని " శ్రీ జయచమరాజేంద్రా ఇంస్టిట్యూట్"లో బోర్డ్ మెంబర్ , ఎగ్జామినర్‌గా బాధ్యతలు వహించింది. వి కల్పగం మద్రాసు సి.ఎల్.ఆర్.ఐ, మద్రాసు యుఇనివర్శిటీ, ఢిల్లీ, మద్రాసు, కాన్పూరు ఐ.ఐ.టిలలో పి.హెచ్.డి థిసీస్ ఎగ్జామినర్‌గా అనుభంధం ఉంది. ఆమె హెచ్.ఎ.ఎల్, ఐ.టి.ఐ, ఎన్.ఎ.ఎల్ , ఇతర ఇంజనీరింగ్ ఇంస్టిట్యూట్స్‌లో మెటీరియల్ సైన్స్ , పాలిమర్లు గురించిన సమావేశాలలో పలు లెక్చర్లు ఇచ్చింది. వి కల్పగానికి అమెరికన్ కెమికల్ సొసైటీ వంటి వైవిధ్యమైన సొసైటీలలో సభ్యత్వం ఉంది. ఆమె వృత్తిజీవితం ఆమె భర్త ప్రొఫెసర్ వి.ఎస్.రావుతో సంతృప్తికరంగా సాగింది. ఆమె భర్త ఒక శాస్త్రవేత్త , " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైస్స్ " ప్రొఫెసర్.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.