ఎస్ అన్నపూర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. అన్నపూర్ణి
ఎస్. అన్నపూర్ణి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఎస్ అన్నపూర్ణి జన్మస్థానం తమిళనాడు రాష్ట్రంలోని పాలకాడు. ఆమె తల్లితండ్రులు సంగీత కళాకారులు. ఆమె పాలకాడులోని " మోయన్ మోడెల్ గరల్స్ ఉన్నత పాఠశాల "లో ప్రాథమిక విద్య పూర్తిచేసింది. వారిది సంప్రదాయక కుటుంబం. ఆమె తల్లితండ్రులకు ఆమె ఏకైక సంతానం. వారి వివాహం అయిన 8 సంవత్సరాల తరువాత జన్మించిన కారణంగా ఆమెను తల్లితండ్రులు చాలా అపురూపంగా పెంచారు.

ప్రేరణ

[మార్చు]

ఎస్ అన్నపూర్ణి పొరుగున ఉన్న " మూర్తి సార్ " అనే విశ్రాంత ఉపాధ్యాయుడు ఆమెకు విద్య అంటే ప్రేరణ కలిగించాడు. వాస్తవానికి ఆమెకు ఆరంభంలో ఆయనపట్ల భయం ఉండేది. అయినప్పటికీ ఆమె ఇంటివెలుపలికి వచ్చే సమయాలలో ఆయన తరచుగా మాట్లాడడం వలన ఆమెకు ఆయనపట్ల భయం తొలగిపోయి ఆయనతో సహజంగా మాట్లాడసాగింది. ఆయన అన్నపూర్ణికి చిన్నచిన్న లెక్కలు ఇచ్చి ఆమెను స్వల్పంగా రెచ్చగొట్టి సమాధానం రాబట్టేవాడు. ప్రారంభంలో ఆమెకు అది కొంత అసౌకర్యం కలిగించినా తరువాత అది ఆసక్తికరంగా మారింది. ఆరంభకాల విద్యకు అది చాలా ఉపకరించింది. వాస్తవానికి అన్నపూర్ణి 9వ తరగతి వరకు చదువుకు ముఖత్వం ఇవ్వలేదు. తరువాత మంచి కాలేజిలో స్థానం లభించాలంటే అధికంగా మార్కులు తీయడం అవసరమని తెలిసిన తరువాత చదువంటే శ్రద్ధ అధికమైంది. అంతేకాక వివాహం, గృహనిర్వహణ కాక జీవితంలో చాలా ఉన్నది అని కూడా అవగతం అయింది. అప్పుడే ఆమె ఆడపిల్లకు వివాహజీవితం మాత్రమే లక్ష్యం కాదని వ్యత్యాసంగా జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నది. తరువాత ఆమె చదువు మీద దృష్టి సారించించింది.

లక్ష్యం

[మార్చు]

ఎస్ అన్నపూర్ణికి సంగీతంలో ప్రవేశం ఉంది. చక్కగా పాడగలిగిన నైపుణ్యం కూడా ఉండేది. అప్పటి వరకూ నిశ్చయంగా ఏమి చేయాలో నిర్ణయించుకోనప్పటికీ తరువాత యోచించి సైన్స్, గణితం పట్ల ఆసక్తి ఉన్న విషయం గ్రహించింది. సాహిత్యం, భాషలపట్ల ఆసక్తి ఉండేది కాదు. మూర్తి మాస్టర్ ఇచ్చిన ప్రేరణ అన్నపూర్ణకు లక్ష్యం నిర్ణయించుకోవడానికి ఉపకరించింది. ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నప్పటికీ సంగీతం పోటీలలో పాల్గొనడం ఆపలేదు. స్కూలు తరఫున పోటీ చేసి రాష్ట్రీయంగా రెండవ స్థానం లభించిన తరువాత సంగీతకారిణిగా కావాలని అనుకున్నది. అప్పుడు మూర్తి మాస్టర్ మందలించి అది ఆమె లక్ష్యం కాదని ఉన్నతచదువు చదివే సామర్థ్యం ఆమెకున్నదని మందలించి పబ్లిక్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో బోధించాడు. అది అక్షరాల పాటించి ఆమె స్కూలలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించింది. అప్పటి నుండి ఆమె ఉన్నత చదువే తనలక్ష్యమని గట్టిగా నిర్ణయించుకున్నది.

కాలేజి

[మార్చు]

ఎస్ అన్నపూర్ణి కాలేజి చదువు కొరకు పాలకాడు " గవర్నమెంట్ విక్టోరియా కాలేజి "లో చేరింది. ట్వెల్త్ ఎగ్జామ్స్‌ కొరకు చక్కగా సిద్ధం అయినప్పటికీ పరీక్షల సమయంలో ఆమెకు " పెద్ద అమ్మవారు " పోసింది. అయినప్పటికీ ఆమె పట్టువదలక సైన్స్, గణితం మీద దృష్టి కేంద్రీకరించి పరీక్షలకు హాజరైంది. ఫలితంగా ఆమె సైన్స్, గణితంలో అత్యధిక మార్కుకు సాధించింది. అలాగే ఆమె మొత్తంలో రెండవ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది.

డిగ్రీ

[మార్చు]

ఎస్ అన్నపూర్ణి సహవిద్యార్థులు అందరూ ఇంజనీరింగ్ కాలేజిలో స్థానం సంపాదించినప్పటికీ ఆమె ఫిజిక్స్ ప్రధానాంశంగా డిగ్రీకోర్సులో చేరింది. కాలేజిలో ఆమె టీచర్ సుదర్శన్ విద్యార్థులను ప్రయోగశాలలో అధిక సమయం గడపడానికి ఎక్పెరిమెట్లు చేయడానికి అనుమతించాడు. కాలేజిలో ఆమెకు ఇద్దరు టీచర్లు ఆమెకు ప్రోత్సాహం ఇచ్చి ఆక్ర్హణీయమైన సైన్స్ ప్రపంచానికి ఆమెను పరిచయం చేసారు. తరువాత ఆమె అదే కాలేజిలో ఫిజిక్స్ ప్రధానాంశంగా పోస్ట్‌గ్రాజ్యుయేషన్ చేసింది. అదే సమయం ఆమె కర్నాటక గాత్రం, వైలిన్ వాద్యసంగీతంలో శిక్షణ తీసుకుంది. పోస్ట్‌గ్రాజ్యుయేషన్ చేస్తూనే వైలిన్ కచేరీలు చేయసాగింది. తరువాత ఆమె తల్లితండ్రుల అభీష్టానికి అనుగుణంగా వివాహం చేసుకున్నది. తరువాత గృహబాధ్యతల నడుమ చదువును సాగించవలసిన పరిస్థితి ఎదురైంది.

పి.హెచ్.డి

[మార్చు]

పోస్ట్‌గ్రాజ్యుయేషన్ తరువాత ఎస్ అన్నపూర్ణి " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫినిక్స్ " (ఐ.ఐ.ఎ) లో చేరింది. ఆమె ఉన్నతవిద్యాభ్యాసానికి ఆమె భర్త నుండి సంపూర్ణ సహకారం లభించింది. అయినప్పటికీ ఆమెకు కుటుంబ నిర్వహణ, థిసీస్ సమర్పణ బధ్యతలు కొంత భారం అనిపించాయి. అయినప్పటికీ ఆమె సకాలంలో థిసీస్ సమర్పించింది. చదువులో కొంత వెనుకబడడం గ్రహించి తిరిగి నూతనోత్సాహంతో అధ్యయనం కొనసాగించాలని నిశ్చయించుకున్నది. డాక్టొరల్‌ స్టడీస్ మద్యలో ఆమె భర్తకు బొంబాయి బదిలీ అయింది.

ముంబయి

[మార్చు]

ముంబయి వెళ్ళిన తరువాత ఎస్ అన్నపూర్ణి ఇన్స్టిట్యూటు హాస్టల్‌లో చేరి రీసెర్చ్ కొనసాగించింది. తరువాత ఆమె అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించింది. ఆమె థిసీస్ మార్గదర్శి ప్రొఫెసర్ రాం సాగర్ ఆమెకు ఎంతో సహకారం అందించాడు. పి.హెచ్.డి పూర్తిచేసిన తరువాత ఆమెకు కుమార్తె జన్మించింది. తరువాత ఆమె ఇంట్లో ఉంటూనే సైంటిఫిక్ అభివృద్ధిని పెంపొందించుకుంటూ ఒక సంవత్సరకాలం అధ్యయనం నిలిపింది. తరువాత ఆమెకు విదేశాల నుండి పోస్ట్‌డాక్టొరల్ అవకాశాలు లభించినా ఐ.ఐ.ఎలో ఫ్యాకల్టీలో చేరింది. ఆమె సమ్మర్ ప్రాజెక్టులలో పాల్గొంటూ పలు పోస్ట్‌గ్రాజ్యుయేషన్ విద్యార్థులను కులుకుని వారికి ప్రోత్సాహం అందించింది. అలాగే పలు రీసెర్చ్ విద్యార్థులకు వారి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించింది. అలాగే ఇద్దరు పిల్లల పాలనా పోషణా చూసుకుంటూ వైలిన్ కచేరీలు చేస్తూ ఉండేది. అలాగే ఆమె సంతానానికి సంగీతంలో శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతురాలైంది. ఆమె సంగీతం, రీసెర్చ్, కుటుంబపోషణ అనే బాధ్యతలతో సంతృప్తికరమైన జీవితం సాగించింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.