అరుణా దత్తాత్రేయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణా దత్తాత్రేయన్
అరుణా దత్తాత్రేయన్
జననం1955, జూన్ 21
జాతీయతభారతీయులు
రంగములుజీవ భౌతిక శాస్త్రం,

అరుణా దత్తాత్రేయన్ భారత దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈమె సెంట్రల్ లెదర్ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా యున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె జీవ భౌతిక శాస్త్రవేత్త. మద్రాసు నగరంలో 1955, జూన్ 21 న జన్మించారు. ఎం.ఎస్.సి (ఫిజిక్స్) చదివిన తర్వాత బయోఫిజిక్స్ లో పి.హెచ్.డి. చేశారు. ఈమె ప్రత్యేకంగా ఇంటర్‌ఫేషియల్ సైన్సెస్ లో, సిబి ఫిల్మ్స్ లో పరిశోధనలు నిర్వహించారు. బాల్యంలో ఆమె అనేక జూల్స్ వెర్నే యొక్క అద్భుతమైన పుస్తకాలను చదివేది. ఆ పుస్తకాల ప్రభావంతో శాస్త్రవేత్త కావాలనే కలలు కనేవారు. ఆమె యొక్క తాతలు ఉపాధ్యాయులు. ఆమె తల్లిదండ్రులు ఆమె విద్యాభ్యాసానికి చక్కని సహకారం అందించారు. ఆమె బాల్యంలో ఉపాధ్యాయులు మంచి శాస్త్ర విజ్ఞానాన్ని అందించారు.ఆమె ప్రారంభంలో శాస్త్ర విజ్ఞానం చదవాలని, మంచి ఉపాధ్యాయులై భారత దేశంలో పేద ప్రజలను ప్రేమతో ఆదుకోవాలని కోరుకొనేవారు.[1] ఆమె తల్లిదండ్రులు ఆమెను సైన్స్ లో చేరుటకు ప్రోత్సహించారు.ఆమె సైన్సుకోర్సులో చదువుటను స్నేహితులు, బంధువులు ఎన్ని విమర్శలు చేసినా ఆమె మహిళలు అన్నిరంగాలలో రాణించి ఏమైనా సాధించగలరని చెబుతుండేవారు. ఆమె భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కోర్సులో చదువుతున్న 14 మందిలో నలుగురు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందారు. ఆతర్వాత ఆమె మాత్రమే పి.హె.డి. పూర్తిచేశారు. ఆమె భౌతిక శాస్త్రంలో మక్కువ చూపేది. ఆమె నిజజీవితంలో మన చుట్టూ గల వివిధ అంశాలు, వాస్తవాలు భౌతిక శాస్త్రంతో ముడిపడి ఉంటాయి కనుక ఆ శాస్త్రాన్ని యిష్టపడేవారు. అమూర్త భావనల కంటే మూర్త భావనలు గల ప్రయోగాత్మకంగా గల భౌతిక శాస్త్రమునే అభిమానించేవారు.

కెరీర్[మార్చు]

ఆమె భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె తర్వాత పి.హెచ్.డి కొరకు తన పేరు నమోదు చేసుకోవాలనుకున్నారు. ఆమె పి.హెచ్.డి ప్రోగ్రాంలో జీవ భౌతికశాస్త్రాన్ని తన పరిశోధనాంశంగా ఎంచుకున్నారు.ఆమె జీవభౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి పూర్తిచేసినతర్వాత పోస్ట్ డాక్టరల్ వర్క్ కొరకు గొట్టిగాన్ లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ వెళ్ళారు. ఆ సమయంలో ఆమె పరిశోధనలకు సహాయపడే రసాయన శాస్త్రవేత్తను వివాహమాడారు. ఆమె వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలు జర్మనీలోనే ఉన్నారు. ఆమె పరిశోధనలలో ముఖ్యమైనది ప్రోటీన్స్, క్రొవ్వులు ఇంటరేక్షన్స్, మాలిక్యులర్ ప్రాసెస్ పై విశేష పరిశోధనలు చేశారు. ఆమె జీవభౌతిక శాస్త్రవేత్త, ఆమె ఇంటర్‌ఫేషియల్ రంగంలో పరిశోధనలు చేశారు.. ఆమె బయోకెమిస్ట్రీ, జీవాణువుల వర్ణపట శాస్త్రం, ప్రోటీన్స్/లిపిడ్స్ ఇంటరేక్షన్, రంగంలో కృషిచేశారు.

అవార్డులు[మార్చు]

డాక్టర్ అరుణ గారిని యూనివర్శిటీ ఆఫ్ మద్రాసు వారు భౌతిక శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనా విజయాలకు మాన్య రామనాధయ్య అవార్డుతో (1975) సత్కరించారు. బెంగళూరులో అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసర్చ్ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ విజిటింగ్ ఫెలోషిప్ అందించారు (1975), 1998 లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోషియేషన్ సదస్సులో బి.సి.దేబ్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు.

రచనలు[మార్చు]

అరుణగారు 1991 లో వెలువరించిన "మోనోగ్రాఫ్ ఆఫ్ బయో సెన్సర్" దేశ ప్రఖ్యాతి చెందింది. ఈమె మొత్తం పరిశోధనా గ్రంథాలు 50 వరకు వెలువరించారు. మొత్తం 15 సంవత్సరాల పరిశోధనానుభవం గడించారు. ఈమె బయో ఫిజికల్ కెమిస్ట్రీ రంగంలో మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ (గొట్టింగన్, జర్మనీ) లో పరిశోధనలు చేసి (1983-89) అంతర్జాతీయ ప్రసిద్ధి పొందారు. డాక్టర్ అరుణ గారు చెన్నై లోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఎనిస్టిట్యూట్ లోప్రిన్సిపల్ సైంటిష్ట్ గా యున్నారు.

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.

యితర లింకులు[మార్చు]