సులభా పాఠక్
సులభా పాఠక్ | |
---|---|
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
సులభా పాఠక్ మంద్యతరగతి కుటుంబంలో జన్మించింది. సులభా పాఠక్‌కు టీచింగ్, ప్రపంచం చుట్టిరావడం అంటే చాలా ఇష్టం. మద్యతరగతి మహిళగా స్వతంత్రభారతంలో టీచర్ కావడం సులభమైనా ప్రపంచన్ని చుట్టిరావడం మాత్రం ఖరీదైనదే అన్నది ఆమె భావన. వాస్తవానికి టీచర్ కావాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి ఆమెను శాస్త్రవేత్తను చేయాలని అనుకున్నాడు.
కాలేజ్
[మార్చు]భారతీయ విద్యార్థులు సైన్సు విడిచి ఆర్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె గ్రహించింది. ఆమె కాలేజి అడ్మిషన్ కొరకు ప్రయత్నించే సమయంలో అది నిజమని ౠజువైంది. కాలేజ్ స్థాయిలో ఫిజిక్స్, మాథమెటిక్స్ అధ్యయనం చేయడం ఆమెకు ఆనందం కలిగించింది. కుటుంబ మిత్రులందరూ అందరూ ఆమె డాక్టర్ కావాలని కోరుకున్నారు. అయినా ఆమెకు వైద్యవృత్తి అంటే ఆసక్తి కలగలేదు. ఆసమయంలో మైక్రోబయాలజీ కొత్త సబ్జెకక్ట్. మైక్రో బయాలజీలో పోస్ట్ గ్రాజ్యుయేషన్ చేస్తే టీచింగ్‌కు అవకాశాలెక్కువ కనుక ఆమె మైక్రోబయాలజీ చదవాలని నిర్ణయించుకున్నది.
రీసెర్చ్
[మార్చు]సులభా పాఠక్ తన 23వ ఏట మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. మద్యతరగతి కుటుంబాలలో సాధారణంగా ఆలోచించే విధంగా ఆమె తల్లి, అమ్మమ్మ ఆమెకు వివాహంచేయాలని అనుకున్నారు. ఆమె తండ్రి మాత్రం పి.హెచ్.డి చేయకుండా వివాహ చేయడం పొరపాటని భావించాడు. సులభా పాఠక్ మాత్రం సందిగ్ధానికి లోనైంది. చివరకు తండ్రిని నిరాశపరుస్తూ సంజీవ్‌ను వివాహం చేసుకున్నది. అయినా నిదానంగా ఆమె తండ్రి మాటలలో వాస్తవం తెలిసి వచ్చిది. ఆమె తండ్రి ఆమెను పురుషూలతో దీటుగా తయారుచేయాలని అభిలధించాడు.
రీసెర్చ్
[మార్చు]మాస్టర్స్ డిగ్రీ పూర్తికాగానే ఆమె టీచింగ్ చేయడం ఆరంభించుంది. ఆమెకు టీచింగ్ చేయడంలో సంతోషం కలిగిప్పటికీ ఆమెకు ఇంకా మరికొంత చేయాలని అనిపించింది. అందుకే ఆమె తన మొదటి మైక్రోబయాలజీ బుక్ వ్రాసింది. పుస్తక రచన కొంత ఊరట కలిగింవినప్పటికీ ఇంకా చేయాలన్న తపన మాత్రం మిగిలి పోయింది. ఆమె దృష్టిని రీసెర్చ్ వైపు మళ్ళించింది. ఆప్పుడామెకు తన తండ్రిచెప్పినది నిజమని తెలిసివచ్చింది. ఆమె రీసెర్చ్ చేయాలని నిశ్చయించుకున్నది. అయినా అప్పుడే ఆమె భర్త సంజీవ్‌కు నెదర్లాండ్ బదిలీ అయింది. స్థిరమైన ఉద్యోగం వదలడం కష్టమనిపించినా ప్రపంచం చూడాలన్న కూతూహలం కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో నెదర్లాండ్ వెళ్ళింది. అయినప్పటికీ ఏదోచేయాలన్న కోరిక మాత్రం ఆమెలో అలాగే ఉండిపోయింది. నెదర్లాండ్ చేరిన ఒక వారం లోపున ఆమె " ఎరాస్మస్ యూనివర్శిటీ " ప్రొఫెసర్ రాబ్‌ను కలిసి ఇమ్యూనాలజీ డిపార్ట్మెంటులో వాలెంటరీ ఉద్యోగంలో చేరింది. సులభా పాఠక్ మూడు సంవత్సరాల కుమార్తె స్కూలలో ఉన్నంత సమయం మాత్రమే పనిచేసింది. ఆమె ఆలోచనలు, రీసెర్చ్ ఆరాధనను రాబ్ మెచ్చుకున్నాడు. ఒక మాసైఆలంలో వాలంటరీ ఉద్యోగం జీతం అందుకునే ఉద్యోగంగా మారింది. ఇలా ఆమె రీసెర్చ్ ప్రయాణం మొదలైంది. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆమె మొదలైంది. అయినా అందులో కొన్ని సమస్యలు ఎదురైయ్యాయి. మొదటిది ఆమె భర్తకు తిరిగి ముంబయికి బదిలీ అయింది. రెండవది ఆమె రీసెర్చ్ గైడ్ రెండు సంవత్సరాల కాలం స్టాన్‌ఫోర్డ్ పొజిషన్ అంగీకరించాడు. ఆమె భర్తను మాత్రం ముంబయికి పంపి ఆమె అక్కడే ఉండాలని అనుకున్నది. అయినప్పటికీ ఆందుకు వారి ఆర్థిక స్థితి అంగీకరించలేదు. రాబ్ సులభా పాఠక్ పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు డేటాపేపర్ వ్రాసి పంపి గైడు స్టాన్‌ఫోర్డ్ నుండి తిరిగి తాగాగే రీసెర్చ్ కొనసాగించమని చెప్పాడు. రీసెర్చ్ కొరకు ఒకవైపు ఎదురుచూస్తూ " ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ రీసెర్చ్ కంసల్టెంటు "గా పనిచేసింది. తరువాత 10 సంవత్సరాల కాలం రీసెర్చ్ కొరకు తీవ్రంగా ప్రయత్నించిన తరువాత ఆమె తిరిగి ఎరాస్మస్ లో రీసెర్చ్ మొదలు పెట్టింది.
పుస్తక రచన
[మార్చు]తరువాత సులభా పాఠక్ కుటుంబం ముంబయి , గోవా ల మద్య ఉన్న " లోట్-పర్షురాం "లో నివసించుంది. అప్పుడామె కుమార్తె 10వ తరగతిలో ప్రవేశించింది. కుమార్తె భవిస్యత్తు కొరకు ఆమె రెండు సంవత్సరాలు అక్కడే నివసించాలని అనుకున్నది. తరువాత ఆమె ఒకస్నేహితునితో కలిసి తనచిరకాల స్వప్నం సాకారం చేసుకుంటూ ఇమ్యూనాలజీ పాఠ్యపుస్తకం పుస్తక రచనకు పూనుకున్నది. ఆమె పుస్తకం , కుమార్తె టెంత్ క్లాసు ఒకేసారి పూర్తయింది. ఆమె భర్తకు యు.ఎస్‌కు బదిలీ అయింది. యు.ఎస్ చేరిన తరువాత ఆమె మొదటిసారిగా పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ ఉద్యోగం చేయడానికి అవకాశం రావడం ఆమెకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఉద్యోగం తరువాత ఆమె భర్తకు తిరిగి ఇండియాకు బదిలీ అయింది. సులభా పాఠక్‌కు శ్రమఫలించి ప్రఖ్యాత యు.ఎస్ ఇంస్టిట్యూట్‌లో పనిచేసే అవకాశం లభించింది. తరువాత ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా బోస్టన్ ఉండి రీసెర్చ్ కొనసాగించింది. పుస్తకరచన, రీసెర్చ్ ప్రాజెక్ట్, పి.హెచ్.డి. పోస్ట్ డాక్టొరల్ బాధ్యతలతో కాలం పరుగెత్తింది. అయినా ఆమె కేరీర్‌కు మాత్రమే ముఖ్యమని భావించక భారతదేశానికి తిరిగి వచ్చింది. తరువాత ఆమె ఇమ్యూనాలజీ రెండవభాగం రచన మీద దృష్టి సారిస్తూనే పోస్ట్ డాక్టొరల్ ఉద్యోగం కొరకు ప్రయత్నించింది. తరువాత ఆమె " టి.ఐ.ఎఫ్.ఆర్ "లో పోస్ట్ డాక్టొరల్ ఉద్యోగబాధ్యతలు వహించింది. అలాగే వసతితక్కుగా ఉండే విద్యార్థులకు టీచింగ్ కూడా చేస్తుంది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.