మంగళా నార్లీకర్

వికీపీడియా నుండి
(మంగళా నార్లింకర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మంగళా నార్లీకర్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మంగళా నార్లింకర్ చిన్నవయసు నుండి తెలివైన విద్యార్థులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్రయత్నంగానే ఆమె మిడిల్ స్కూల్, ఉన్నత పాఠశాల వరకు ప్రభుత్వం నుండి ద్కాలర్‌షిప్ అందుకున్నది. ఉన్నత పాఠశాల చదివే సమయంలో" కామత్ " ఆమెను అభిమానించే ఆమెకు మిగిలిన విద్యార్థులలా సరైన లక్ష్యం లేదని సాధించాలంటే లక్ష్యం వైపు పయనించేలని ప్రేరణ కలిగించాడు. ఆమెకు గణితం (మ్యాథ్స్) అంటే అత్యధికంగా ఆసక్తి ఉన్నకారణంగా ఆమె ఫిజిక్స్ , కెమెస్ట్రీలలో సమయం వృధాచేయకుండా కళాశాలలో మాథమేటిక్స్ ప్రధానాంశంగా వరల్డ్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ , సంస్కృతం ఉపాంశాలను ఎంచుకున్నది. ఆమె గణితశాస్త్రాన్ని అభిమానించింది. ఆమె అధ్యయనం చేయడానికి టీ.ఐ.ఎఫ్.ఆర్‌లో స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్‌లో చేరింది. ఆమె స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా అవకాశం లభించిన తరువాత ఆమె పెద్దల వత్తిడికారణంగా వివాహానికి అంగీకారం తెలిపింది. వివాహం తరువాత ఆమె భర్తతో ఇంగ్లండుకు వెళ్ళింది. తరువాత ఆమె భర్త ప్రముఖ ఆస్ట్రోఫిజిస్ట్ గా పనిచేసాడు. ఆమె భర్త సహకారంతో అధ్యయనంలో ముందుకు సాగినా కుటునబబాధ్యతల వలన రీసెర్చ్ మాత్రం కొనసాగించలేక పోయింది. ఆమె వైవాహిక జీవితం సంతోషంగా సాగింది. ఆమె ఇద్దరు కుమార్తెల జననం తరువాత కుటుంబం తిరిగి భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె భర్త టి.ఐ.ఐ.ఆర్‌లో ఫ్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టాడు. వారికి టి.ఐ.ఐ.ఆర్‌కు అతిసమీపంలో నివాసగృహం లభించిది. అది ఆమెకు అదృష్టంగా పరిణమించి నిలిపివేసిన మాథమెటిక్స్ రీసెర్చ్‌ని తిరిగి కొనసాగించింది. అలాగే ఆమె ప్రొఫెసర్ రామచంద్రన్‌ బృందంలో చేరి " అనలిస్టిక్ నంబర్ థియరీ " బాధ్యత చేపట్టింది. ఆమె అత్తమామలు, ఇద్దరు పిల్లల పాలనాపోషణల మద్య రీసెర్చ్ పూర్తిచేసి డాక్టరేట్ సంపాదించింది. డాక్టరేట్ అందుకునే సమయానికి ఆమె మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. టి.ఐ.ఐ.ఆర్‌లో " పూల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ థిసీస్ పేపర్లను కొన్ని ప్రచిరించింది. టి.ఐ.ఐ.ఆర్‌ చాలాదూరంగా నివాసం మారిన తరువాత " బాంబే యూనివర్శిటీలో " మాథమెటిక్స్ బోధించింది. అయినప్పటికీ టి.ఐ.ఐ.ఆర్‌లో గెస్ట్ లెక్చరర్‌గా ఎం.ఫిల్ విద్యార్థులకు బోధించింది. 1999లో పూనాకు బదిలీ అయిన తరువాత " పూనా యూనివర్శిటీ మాథమెటిక్స్ " డిపార్ట్మెంటులో పనిచేసింది. గృహబాధ్యతల భారంతో నా రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఆమెసాన్నిధ్యం అధికంగా కోరుకున్న కుమార్తె తరువాతి కాలంలో ఆమె ఎనుకు ఉద్యోగిని కాలేదని ప్రశ్నించడం స్త్రీవృత్తి జీవితంలో ఎదుర్కునే పరిస్థితుల వైరుధ్యానికి ఒక నిదర్శనం. ఆమె తన కుటుంబ నిర్వహణకు, పిల్లల పెనపకానికి, వారి అభివృద్ధికి పాటుపడానికి సంతోషంగా అధిక సమయం వెచ్చించి వృత్తిజీవితానికి పూర్తిగా అంకితం కావడంలో విఫలమైంది. అందరూ భయపడుతున్న గణితం బూధించడం ఆమెకు అధికంగా ఆనందం కలిగించింది. చిన్న పిల్లలు గణితం సులువుగా నేర్చుకోవడానికి సహకరిస్తే బాగుంటుందని యోచించి వారి కొరకు ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఆమె జీవితం ఆకాలంలో మేధావులైన స్త్రీలకు వేత్తిరీత్యా ఎదురౌతున్న సమస్యలకు అద్దంపడుతుంది. ప్రస్తుతం ఆమె ముగ్గురు కుమార్తెలు పెద్దవారై విద్యావంతులై కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో వృత్తిజీవితంలో ముందుకు సాగుతున్నారు. పెద్దకుమార్తె బయోకెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. తరువాత ఇద్దరు కుమార్తెలు కంప్యూటర్ సైన్సు రీసెర్చ్ చేస్తున్నారు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1][permanent dead link] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.