దీప్తి దేవ్‌బాగ్‌కర్
దీప్తి దేవ్‌బాగ్‌కర్ | |
---|---|
![]() దీప్తి దేవ్‌బాగ్‌కర్ | |
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
దీప్తి దేవ్‌బాగ్‌కర్ తల్లి మానిక్ తండ్రి పండిట్ అచ్వాల్. దీప్తి దీప్తి దేవ్‌బాగ్‌కర్ తల్లితండ్రులు స్వతంత్ర భావాలు ఉన్నవారు. అందువలన దీప్తిని చిన్నవయసు నుండి స్వతంత్రభావాలతో పెంచారు. ఆమె అభివృద్ధికి సాయపడుతూ మద్దతుగా నిలిచారు.
కాలేజి విద్య
[మార్చు]దీప్తి తండ్రి శాస్త్రవేత్త, ప్రొఫెసర్, టెక్‌స్టైల్ కెమిస్ట్. విద్యాభిమాని విద్యావేత్త అయిన తండ్రిప్రభావం దీప్తిమీద అధికంగా ఉండం కారణంగా బ్యాచిలర్ డిగ్రీలో ఆర్ట్స్ ఎంచుకున్నది. ఆమెకు విద్యాభ్యాసం అంతటా అంకితభావంతో పనిచేసే అధ్యాపకులు లభించారు. ఆమెతల్లి కూడా ఆమెకు విఙానపట్ల అత్యధికంగా అరాధనపెరగడానికి దోహదపడింది. ఆమె ఆంటి ( అత్త/పినతల్లి) కూడా స్వయంగా శాస్త్రవేత్త కావడం ఆమె కేన్సర్ పరిశోధన కొరకు ఒంటరిగా చాలాకాలం గడపడం ఆమె ప్రేరణకు మరింత కారణం అయింది. అందువలన ఆమె అధ్యయనానికి వృత్తికి సైన్స్‌ను ఎంచుకున్నది. ఆమెకు సూక్ష్మజీవుల అధ్యయనం పట్ల ఆసక్తి అధికం. ఆమె కేంబ్రిడ్జ్‌లో ఆ తరువాత బెర్లిన్‌లో జీవశాస్త్రం గురించి పరిశోధన చేపట్టింది.
వివాహం
[మార్చు]ఆమె బెంగుళూరు లోని " ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ " విభాగంలో పి.హె.డి చేస్తున్న సమయంలో ఆమె కాబోయే భర్త దిలీప్ దియోబాగ్‌కర్‌ను కలుసుకున్నది. దియోబాగ్‌కర్ అమెరికాలోని న్యూయార్క్, యేల్‌లలో విద్యను పరిశోధనలను ముగించి భారతదేశంలో ఉద్యోగబాధ్యతలు చేపట్టి అలాగే పరిశోధనలు కూడా కొనసాగించాడు. ఆయన విద్యాదాహం, అంకితభావానికి దీప్తి ప్రభావితురాలైంది. వివాహానంతరం కూడా ఆమె పరిశోధనలు కొనసాగించడానికి ఆమె భర్త దిలీప్ ఆమెకు ఎంతగానో సహకరించాడు.
వృత్తి
[మార్చు]దీప్తి దాదాపు 28 సంచత్సరాల కాలం సైన్సు మీద ఉన్న ఆరాధనతో అనికితభావంతో పరిశోధనలు చేపడుతూ వృత్తిలో కొనసాగింది. ఆమె ఎం.ఎస్.సి విద్యార్థులకు అధ్యాపకురాలుగా పనిచేసింది. తరువాత " సెరం ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండియా " తరఫున కంసల్టెంట్‌గా పనిచేసింది. ఆమెకు అరుదైన విద్యార్థులు లభించారని ఆమె కథనాలు వివరిస్తున్నాయి. దీప్తి దేవ్‌బాగ్‌కర్ సంతృప్తికరంగా వృత్తిలో కొనసాగుతూ మహిళాశాస్త్రవేత్తగా గుర్తింపును పొందింది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.