Jump to content

సుపర్ణా సిన్హా

వికీపీడియా నుండి
(సుపర్ణా సింహా నుండి దారిమార్పు చెందింది)
సుపర్ణా సిన్హా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

సుపర్ణా సిన్హా తండ్రి ఆంథ్రోపాలజిస్ట్- కళాకారుడు. ఆమె తల్లి కళాకారిణి అలాగే ఫిజిస్ట్. ఆమె సోదరి సుకన్యా బెంగుళూరు ఐ.ఐ.టిలో ఫిజిస్ట్. ఆమె తల్లి ఉద్యోగబాధతల నడుమ కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించింది. ఆమె పిల్లల సృజనాత్మక శక్తిని, నేర్చుకునే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని పెంపొందించడానికి తనవంతు సహాయం అందించింది. వారింటికి కవులు, నాటకరంగ కళాకారులు, సత్యజిత్ రే వంటి చనచిత్ర కళాకారులు, విషయుయల్ కళాకారులు, సంగీఅకళాకారులు, తండ్రి శ్రేయోభిలాషి నిర్మల్ బోస్, తల్లి శ్రేయోభిలాషి వంటి శాస్త్రవేత్తలు తరచూ అథిధులుగా వస్తుండేవారు. వారి ఇంట్లో ఆమె తల్లి అధ్యనంచేయడానికి సేకరించిన పలు ఫిజిక్స్ ఉండేవి.

ప్రేరణ

[మార్చు]

సుపర్ణా సిన్హా యూనివర్శిటీ అధ్యయనానికి ముందు కొలకత్తా లోని " సౌత్ పాయింట్ ఉన్నత పాఠశాల "లో ఫిజిక్స్ టీచర్ అంజన్ దాస్‌గుప్తా ఫిజిక్స్ అధ్యయనంలో ఉన్న సౌనదర్యం గురించి తెలియజేసాడు. ఇండియాలో బి.ఎస్.సి ఫిజిక్స్ పూర్తిచేసిన తరువాత " సిరాకస్ యూనివర్శిటీ" ఫిజిక్స్ డిపార్ట్ మెంటులో ఎం.ఎస్. - పి.హెచ్.డి పూరిచేసింది. సిరాకస్‌లో అధ్యయనం ముగింపుకు వచ్చే తరుణంలో థియొరాటికల్ కండెంస్డ్ సంబంధిత ఫిజిక్స్ అంటే ఆమెకు ఆసక్తి ఏర్పడింది. హైఎనర్జీ ఫిజిక్స్ లేక గ్రావిటీ కంటే థియొరాటికల్ కండెంస్డ్ సంబంధిత ఫిజిక్స్‌కు అత్యధికంగా ప్రయోగాలతో సంబంధం ఉండడం ఒక కారణమని ఆమె భావన. థియొరాటికల్ కండెంస్డ్ సంబంధిత ఫిజిక్స్ ఎంచుకోవడానికి ఆమె టీచర్ రాజన్ భట్టాచార్య ప్రేరణ కారణమని ఆమె అభిప్రాయం. థియొరాటికల్ కండెంస్డ్ సంబంధిత ఫిజిస్ట్ మరియా క్రిస్టినా మర్చెట్టి సిరాకస్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంటులో చేరిన తరువాత సుపర్ణా సిన్హా ఆమెను తన పి.హెచ్.డి పరిశోధనా కాలం పూర్తి అయ్యే వరకు మార్గదర్శిగా ఎంచుకున్నది. ఆమె ఫిజిక్స్ పరిశోధనలు అనుకూలంగానే సాగాయి. స్త్రీపురుష భేదాలకు అతీతంగా సహాధ్యాయులు ఆమెకు బాసటగా నిలిచారు. స్నేహితులు ఆమె ఫిజిక్స్ పరిశోధనా శైలి, సమస్యలను పరిస్కరించే విధాన్ని ప్రశంసింస్తూ ఉండేవారు.

వివాహం

[మార్చు]

సుపర్ణా సిన్హా పి.హెచ్.డి చేసే సమయంలో క్వాంటం డిఫ్యూషన్ థిసీస్ పేపర్ కొరకు రఫయేల్ సొర్కిన్‌తో పనిచేసే సమయంలో ఆయన దూసుకుపోయే తత్వం, విశాలమనస్తత్వం, ఫిజిక్స్ సంబధిత ఆలోచనా సరళి సుపర్ణాకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. సిరాకస్‌లో పైశోధన చేస్తున్న తరుణంలో కలుసుకున్న థియొరాటికల్ ఫిజిస్ట్ జోసెజ్ శామ్యుయేల్‌ను తరువాతి కాలంలో పూర్ణిమా వివాహం చేసుకుంది.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

సుపర్ణా సిన్హా పి.హెచ్.డి పూర్తిచేసిన తరువాత పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్ కొరకు ఐరోపా, యునైటెడ్ స్టేట్స్, ముంబయి లోని టి.ఐ.ఎఫ్.ఆర్, బెంగుళూరు లోని ఐ.ఐ.ఎస్ నుండి అవకాశాలు వచ్చాయి. రీసెర్చ్ మీద ఆసక్తి కారణంగా ఫిజిక్స్‌కు దగ్గర సంబంధం ఉన్న బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సిని ఎంచుకున్నది. సుపర్ణా సిన్హా భర్తతో భారతదేశానికి వచ్చి ఐ.ఐ.ఎస్.సిలో ఉద్యోగబాధ్యతలు స్వీకరించారు. ఫిజిక్స్ పూర్ణిమా, ఆమె భర్తను అనుసంధానం చేసిందన్నది ఆమె భావన. 1996లో ఆమెకు కుమార్తె (రోషిణి) జన్మించింది. ఆమెకు కేరీర్‌లో తల్లితండ్రులు, అత్తమామల సహకారం లభించడం కుమార్తె కూడా తల్లితండ్రుల ఉత్సాహం పుణికిపుచ్చుకోవడం అదృష్టమన్నది అమే భావన.

నిరుత్సాహం

[మార్చు]

సుపర్ణా సిన్హాకు ప్రోత్సాహం ఎంత లభించిందో అంటే నిష్పత్తి నిరుత్సాహం కూడా ఎదురైంది. ఆమె ఫిజిక్స్ సంబంధిత పరిశోధనలు చేపట్టాలని అనుకున్నప్పుడే స్త్రీపురుషులు ఇరువురి నుండి స్త్రీలు పరిశోధనకు తరగరన్న అభిప్రాయం వెలువడి ఆమె ఉత్సాహాన్ని తగ్గించింది. ఒక్కోసారి పురుషులకంటే అధికంగా మహిళాశాస్త్రవేత్తలు ఆమెను అధికంగా నిరుత్సాహపరిచారు. ఒక్కోసారి పురుషులు కూడా ఆధిక్యానికి గురౌతున్నారన్న విషయం ఆమెకు అవగతం అయింది. ఒక్కోసారి జాతిబేధాలు కూడా ఆధిక్యానికి గురిచేయడం భరతదేశంలో సహజం అన్నది ఆమె భావన. టాఆణూ వ్యతిరిక్త పరిస్థితులను ఎదుర్కొని పరిశీధనలు సాగించి ఉద్యోగం చేసి వవైవాహిక జీవితం సాగించినా తనలా ఇతరులు నిరుత్సాహ పరచబడితే భారతదేశానికి ప్రధాన వనరు అయిన మానవ శక్తి సగం వ్యర్ధమైపోగలలదని ఆమె ఆవేదన కనబరిచింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.