శుభద చిప్లుంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభద చిప్లుంకర్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

శుభద చిప్లుంకర్ తల్లి తండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. శుభద చిప్లుంకర్ చిన్నతనం నుండి ఆమెకు సాహిత్యంపట్ల అంతులేని ప్రేమ ఉండేది. ఆమె విద్యాభ్యాసం ఆగ్లమాధ్యమంలో జరిగినప్పటికీ ఆమె తల్లి ఆమెకు మరాఠీ భాషను నేర్పించింది. అందువలన ఆమె ఆగ్లం, మరాఠీ భాషలలో పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నది. అలాగే పాఠశాలలో కూడా ఆమె ఆగ్లం, చరిత్ర, సైన్స్ లను ఆసక్తిగా అభ్యసించుంది. ఆమె తండ్రి ఆమెకు విజ్ఞాన శాస్త్రము అధ్యయనంలో ఉన్న ఆనందాన్ని పెంపొందించడానికి చక్కగా ప్రయత్నించాడు. ఆమె తల్లితండ్రులు ఆమెకు స్వంత అభిప్రాయాలు వెల్లడించడానికి అలాగే స్వయం నిర్ణయం చేయడానికి అధికారం ఇచ్చారు.

మైక్రోబయాలజీ డిగ్రీ

[మార్చు]

అందువలన ఆమె స్వయంగా మెడికల్ కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నది. అయినప్పటికీ ఆమె మైక్రోబయాలజీ చేయవలసిన పరిస్థితి ఎదురైంది. మైక్రో బయాలజీ చదువుతున్న తరుణంలో మెడికల్ విద్యేతర మరో అద్భుత ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్న అనుభూతి కలిగింది. కె.జె సోమైయా కాలేజి మొదటి బ్యాచిలో శుభద చింప్లుకర్ మైక్రోబైయాలజీ అధ్యయనం కొనసాగింది. ఆరోజులలో నాన్- ఫిక్షన్ పుస్తకాలలో " మైక్రో హంటర్స్ " పుస్తకం ప్రబలంగా ఉండేది. ఆపుస్తకంలో మైక్రో బయాలజీ చరిత్ర, అత్యున్నత ఉపాధ్యాయుల భాగస్వామ్యం గురించిన కథనాలు ఉన్నాయి. ఆపుస్తకం ఆమెకు విజ్ఞాన శాస్త్రము పట్ల ఆరాధన కలిగించింది. అలాగే ఆమె లక్ష్యం వైపు పయనించడానికి దోహదం చేసింది.

పోస్ట్ గ్రాజ్యుయేషన్

[మార్చు]

మైక్రో బయాలజీ బ్యాచులర్ డిగ్రీ తర్వాత ఆమె పోస్ట్ గ్రాజ్యుయేషన్ పూర్తిచేయడానికి ముంబయి లోని కేన్సర్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్‌లో (సి.ఆర్.ఐ) చేరాలని నిశ్చయించుకున్నది. ఎన్నిక ప్రక్రియ ఖఠినంగా ఉన్నందు వలన ఆమె పిజిలో ప్రవేశించడానికి ఆమె పోటీని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురైనా ఆమెకు పి.జీ చేయడానికి అవకాశం లభించింది. తరువాత ఆమె కేంసర్ విభాగంలో రీసెర్చ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నది. డాక్టర్ కుముద్ కరాండే ఆధ్వర్యంలో రీస్ర్చ్ కొనసాగింది. ఈ సమయంలో ఆమెకు వివాహం జరిగింది. తరువాత కూడా ఆమె వృత్తివిద్యలలో కొనసాగాలని నిశ్చయించుకున్నది. ఆమె నిర్ణయానికి ఆమె కుటుంబం బలపరచింది. ఆమె విద్యను కొనసాగించడానికి ఆమెకు భర్త నుండి కూడా మద్దతు లభించింది. ఆమె భర్త మెకానికల్ ఇంజనీర్. 1984లో ఆమెకు పోస్ట్ డాక్టరల్ ఆఫర్ లభించగానే సి.ఆర్.ఐలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి జర్మనీ దేశంలోని ఫ్రీబర్ఘ్‌లోని " మాక్స్ ప్లాంగ్ ఇంస్టిట్యూట్‌ ఫర్ హ్యూమనో బయాలజీలో " ప్రొఫెసర్ స్టీఫెన్ కౌఫ్‌మన్ లాబ్ చేరింది.

జర్మనీలో కొనసాగిన పరిశోధన

[మార్చు]

అద్భుతమైన శక్తికలిగిన స్టీఫెన్ మార్గనిర్డేశకంలో సాగిన పరిశోధన ఆమె జీవితం అనుకోని మలుపు తిరగడానికి కారణం అయింది. ఆమె స్టీఫెన్‌తో లెప్రసీలో " సైటో టాక్సిక్ ట్ సెల్ " పాత్రగురించిన పరిశోధన సాగించింది. 1984 లో సెల్ క్లోనింగ్ అత్యంత ఆసక్తికరమైన అంశం. పట్టుదల కృతనిశ్చయంతో ఈ రంగంలో ప్రవేశించిన తరువాత టి సెల్ క్లోనింగ్ తయారుచేడంలో ఎదురైన సమస్యలకు నిరాశకు లోనైంది. తరువాత ఆమె వేరొక పరిశోధనను చేపెట్టింది. ఒక సంవత్సరం తరువాత ఆమె పరిశోధనలో కొంత విజయం సాధించింది. ఈ విజయం ఇమ్యూనైజేషన్ పరిశోధన పట్ల ఆమెకు ఆసక్తిని అధికం చేసింది. 1986లో ఇమ్యూనిటీ అంశంలో పనికొనసాగించాలన్న నిశ్చయంతో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆసమయంలో సి.ఆర్.ఐ లెప్రసీ ఇమ్యూనిటీ మీద దృష్టి సారించి శుభద చిప్లుంకర్‌ను ఇమ్యూనిటీ విభాగంలో సైంటిఫిక్ అధికారిగా నియమించింది. తరువాత ఆమె లెప్రసీ ఇమ్యూనిటీ వాక్సిన్ తయారు చేయడానికి విశేషకృషి చేసింది. వాక్సిన్ తయారుచేయడానికి ఆమె డాక్టర్ ఎస్.జి గణపాల్, డాక్టర్ ఎం.జి డియోలతో కలిసి పనిచేసింది.

వృత్తిజీవితం

[మార్చు]

అదనంగా పరిశోధన నిమిత్తమై లెప్రసీ హాస్పిటల్స్‌కు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అలాగే వాక్సిన్ ప్రయోగించే ప్రదేశాలకు, ప్రాజెక్ట్ ఆద్మింస్ట్రేషన్‌ ప్రదేశానికి కూడా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.