సుమతీ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమతీ రావు
వృత్తిమహిళా శాస్త్రవేత్త

సుమతీ రావు వడోదరాలో పెరిగింది. ఆమె తల్లితండ్రులకు చదువుపట్ల మక్కువ ఎక్కువ. తండ్రి ఆమెకు లక్ష్యం వైపు పయనించాలని నేర్పించాడు. ఆమె మససులో అది ప్రేరణగా మారి శాస్త్రవేత్త కావాలన్నది ఆమె లక్ష్యం అయింది. ఆమె తల్లి మాత్రం వాస్తవాం గ్రహించి జీవితం సాహించాలని ఆమెకు బోధించింది. అయినప్పటికీ ఆమె కుమార్తె చదువుకు పూర్తిమద్దతు ఇచ్చింది. అలాగే ఆమె శాస్త్రవేత్త కావడానికి జీవితకాల విద్యార్థిని కావడానికి కుటుంబం నుండి పరిపూర్ణ సాకారం లభించిది.

విద్యార్ధినిగా[మార్చు]

సుమతీ రావు స్కూలు, కాలేజిలో తెలివైన విద్యార్థినిగా గుర్తించబడింది. ఆమెకు పదసంబంధిత లేక నంబర్ల సంబధిత ఫజిల్స్ పరిష్కరినడం అంటే ఆసక్తి అధికం. అలాగే డిటెక్టివ్ కతలను చదవడం కూడా ఆమెకు ఆసక్తికరమైన విషయం. ఆమెకు పాఠ్యాంశాలలో విజ్ఞాన శాస్త్రము, గణితం మక్కువ అధికం. ఆమె వడోదరలో పెరిగేసమయంలో పాపులర్ విజ్ఞాన శాస్త్రము, శాస్త్రవేత్తలను గురించిన పుస్తకాలను అధికంగా చదువుతూ తాను కూడా ఒకనాటికి శాస్త్రవేత్త కావాలని కలలు కంటూ ఉండేది.

ఆలోచనాధోరణి[మార్చు]

ఆమెకు విజ్ఞాన శాస్త్రము పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు అది మంచిదా కాదా అనే సందిగ్ధం ఉండేది. ఇజనీరింగ్ చేయడం మంచిదేమో అన్న భావం కూడా ఉండేది. ఏదిఏఐనప్పటికీ ఆఎకు మెడిసన్ అంటే అనాసక్తి అధికం. అంతే కాక టాపర్‌గా ఉత్తీర్ణత సాధినిన విద్యార్థికి విజ్ఞాన శాస్త్రము కేరీర్‌గా ఎంకోవడం తక్కువ గౌరనమని మెడిసన్, ఇంజనీరింగ్, ఐ.ఐ.టిలో చదవడం వంటివి గౌరవప్రధమైనవని కూడా భావిస్తూ ఉండేది. అయినప్పటికీ " నేషనల్ విజ్ఞాన శాస్త్రము టాలెంట్ స్కాలర్‌షిప్పులు " (ఎన్.ఎస్.టి.ఎస్) పరీక్షలు ఆమె ఆలోచనా ధోరిణిని మార్చివేసింది. అప్పుడామే సాధారణ వృత్తులకు అతీతంగా ఫిజిక్స్‌ను తమ ధ్యేయంగా చేసుకున్న విద్యార్థుల మనోభావం తెలుసుకున్న తరువాత వారు సాధారణ విద్యార్థులకంటే వ్యత్యాసమైనవారని గ్రహించిది.

సమ్మర్ స్కూల్స్[మార్చు]

సుమతీ రావు ఎన్.ఎస్.టి.ఎస్ సమ్మర్‌స్కూల్స్‌లో పాల్గొన్న సమయంలో ఆమెలా విజ్ఞాన శాస్త్రము‌ అంటే ఆసక్తి కలిగిన విద్యార్థులను కలుసుకునే ఆకాశం లభించింది. వారు ఆమెకు అలవాటు అయిన సహవిద్యార్థులు కానప్పటికీ సరికొత్త విద్యార్థులతో ఫిజిక్స్ గురించి చర్చలు జరపడం ఆమెలో ఉత్సాహం నిపింది. అదే ఉత్సాహం తరువాత ఆమె ముంబయి " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ " చదివే సమయంలో కూడా కొనసాగింది. .

రీసెర్చ్[మార్చు]

సుమతీ రావు పి.హెచ్.డి స్టోనీబ్రూక్‌లో చేసింది. అక్కడ ఆమెకు లభించిన సహవిద్యార్థుల నుండి ఫిక్స్ గురించి జీవితం గురించి కూడా తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం లభించింది. ఆమె రీసెర్చ్ కొరకు హైఎనర్జీ ఫిజిక్స్‌ను ప్రధానాంశంగా తీసుకున్నది. ఆమెకు పి.హెచ్.డి మార్గదర్శి మంచి సహకారం అందించాడు. ఆయన యువకుడు మహిళా విద్యార్థులకు, యువ విద్యార్థులకు మద్య భేదం చూపించేవాడు కాదు. ఆమె దీర్ఘకాల శలవులో ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో ఆమె కొరకు ఆందోళన పడ్డాడు. ఆమె ఇండియాలో వివాహం చేసుకుని చదువును మద్యలో నిలిపివేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ ఆమెకు సహవిద్యార్థులు మాసికబలం అందించి సహకరించారు.

వివాహం , ఉద్యోగం[మార్చు]

సుమతీ రావు స్టోనీ బ్రోక్‌లో రీసెర్చ్ చేసే సమయలో సహవిద్యార్థిని వివాహం చేసుకున్నది. వివాహం చేసుకున్న తతువాత వారు ఫిజిక్స్ గురించి అధికంగా చర్చలు జరిపేవారు. వారిద్దరూ మొదటిసారిగా పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్లను ఒకటిగా చేసారు. అయినా తరువాత వారిద్దరికీ ఒకే చోట ఉద్యోగాలు లభించడం ప్రధానాంశంగా మారింది. తరువాత సుమతీ రావు ఆమె ఆమె భర్త విడివిడిగా ఉద్యోగం చెయ్యాలని నిశ్చయించుకున్నది. అప్పుడే స్వతంత్రంగా వ్యవహిరించడానికి వీఔతుందని ఆమె భావించింది. తరువాత ఆమె భర్తతో భారతదేశానికి తిరిగి వచ్చింది.

భాతదేశానికి తిరిగి రాక[మార్చు]

సుమతీ రావు భర్తతో భారతదేశం తిరిగి వచ్చిన తరువాత తరువాత ఇద్దరూ ఉద్యోగాల కొరకు ప్రయత్నించసాగారు. అయినప్పటికీ ఆసమయంలో భారతదేశంలో ఇంస్టిట్యూట్లు అధికంగా లేని కారణంగా పోస్ట్‌డాక్టొరల్ ఉద్యోగావకాశాలు కూడా అధికంగా లేవు. చివరకు సుమతీ రావుకు భువనేశ్వర్‌లో ఉన్న " ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ " విభాగంలో ఉద్యోగావకాశం అభించింది. ఆమె భర్తకు ముంబయి " టాటా ఇంస్టిట్యూట్ "లో అవకాశం లభించింది. అయినప్పటికీ వారిద్దరూ ఒకే చోట నివసించే దానికన్నా దూరమైనా సరే ఉద్యోగాలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

కుటుంబ సహకారం[మార్చు]

సుమతీ రావు వృత్తిజీవితంలో అభివృద్ధి సాధించడానికి ఆమె కుటుంబం ఎంతగానో సహకరించింది. ఆమె అత్తమామలు కూడా ఆమెకు సంపూర్ణ సహకారం అందించారు. ఆరోజులలో ఇప్పటిలా ఫోన్లు , సమాచారసౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా భార్యాభర్తలు ఒకరి భావాలు మరికరితో పంచుకోవడం కష్టంగా ఉండేది. రెండు ఊర్లమద్య ప్రయాణం చెయ్యడానికి దాదాపు 40 గంటల సాయం అయ్యేది. అయినప్పటికీ విమానఖర్చులు తక్కువగా ఉన్నందున భార్యాభర్తలు అటూ ఇటూ తిరగడానికి కొంత సాధ్యమౌతూ ఉండేది. భర్తకు దూరంగా చిన్నపట్టణంలో ఒంటరిగ ఉండడం కష్టమే అయినా 10 సంవత్సరాల శ్రమ తరువాత ఆమె పిహెచ్.డి ముగించింది. సుమతీ రావు ఒంటరిగా పరిశోధనలు సాగించడం కష్టమని భావించి అంతవరకూ ఫిజిక్స్‌లో సాధించిన ప్రగతిని పక్కన పెట్టి సరికొత్త పరిశోధనలను చేపట్టింది. అయినప్పటికీ కండెంస్డ్ ఫిజిక్స్‌కు కూడా ఆమె అధ్యయనం ఉపకరిస్తుందని నిదానంగా తెలిసి వచ్చింది.

ఉద్యోగం[మార్చు]

సుమతీ రావుకు లభించిన అద్భుతమైన విద్యార్థులు ఆమెను నిరతరంగా ఉత్సాహభరితం చేసారని ఆమె అభిప్రాయపడింది. 8 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆమె భారతదేశం తిరిగి వచ్చింది. అప్పటికి ఆమెకు వివాహం జరిగి 12సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1995 లోభార్యాభర్తలిద్దరికి అలహాబాదు " హరీష్ - చందా రీసెర్చ్ ఇంస్టిట్యూటులో ఉద్యోగం లభించింది. అక్కడ వారు సీనియర్ ఫ్యాకల్టీ ఉద్యోగాలలో చక్కగా స్థిరపడ్డారు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.