Jump to content

పూర్ణిమా సిన్హా

వికీపీడియా నుండి
(పూర్ణిమా సింహా నుండి దారిమార్పు చెందింది)
పూర్ణిమా సిన్హా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

పూర్ణిమా సిన్హా తండ్రి డాక్టర్ నరేష్ చంద్ర సెన్‌గుప్తా కన్‌స్టిట్యుషనల్ లాయర్. అతను ప్రఖ్యాత రచయితకూడా. 65 కంటే అధికమైన పుస్తకాలను, బెంగాలీలోనూ, ఆంగ్లంలోనూ పలు వ్యాసాలను వ్రాసారు. వాటిలో కొన్ని స్త్రీవిద్యను కేంద్రీకృతం చేసి ఉన్నాయి. అతను వ్రాసిన వ్యాసాలు స్త్రీ విమోచనం మీద కేంద్రీకృతమై ఉన్నాయి. అతను పుస్తకాలు కూడా మహిళాసమస్యలను కేద్రీకరించిన అంశాలు కలిగి ఉన్నాయి. అతను ఆలోచనా ప్రభావం కుటుంబజీవితంలో కుటుంబవ్యక్తుల మీద కూడా ప్రభావం చూపాయి.

రీసెర్చ్

[మార్చు]

1951లో ప్రొఫెసర్ ఎస్.ఎస్ బోస్ మార్గదర్శకంలో కొలకత్తా లోని ఖజారియా లాబరేటరీలో పి.హెచ్.డి ఆరంభించింది. సుపర్ణా సిన్హాతో ఎస్.ఎస్ బోస్ ఇండియాలోని నిభిన్నమైన క్లే గురిచి పరిశోధన చేయమని సలహా ఇచ్చాడు. అతను ఈ పరిశోధనకు ధర్మల్, కెమికల్ టెక్నిక్స్‌ను ఉపయోగొంచమని సలహా ఇచ్చాడు. ఆసమయంలో " ఖజారియా యూనివర్శిటీ " లో ఎక్స్‌పెరిఎంటల్ రీసెర్చ్‌లో పనిచేసిన పదిమంది రీసెర్చ్ విద్యార్థులలో ఒకరుగా పనిచేసింది. ప్రతి ఒక్కరు వారివారి పరిశోధనకు అవసరమైన పరికరాలను వారే రూపొందించుకున్నారు. ఇది వారి లాబరేటరీలో వ్రాతపూర్వకంగా లేని చట్టంగా ఉండేది. అధిక అనుభవం గడిచిన రీసెర్చ్ విద్యార్థులు ఇలాంటి కొత్త ప్రాజెక్టూలో ప్రవేశపెట్టబడ్డారు. విద్యార్థులు ప్రాజెఖ్తులో ఎదుర్కొనే సమస్యలకు ప్రొఫెసర్ బోస్ విద్యార్థులకు సహకరించారు.

ఉద్యోగం

[మార్చు]

పూర్ణిమా సిన్హా ఒక ఫిజిస్ట్. కొలకత్తా మొదటి మహిళా పి.హెచ్.డి స్కాలర్. బోస్‌స్టాటిస్టిక్స్ స్థాపకుడు ఎస్.ఎన్. బోసుతో పనిచేసిన ఘనత పూర్ణిమా సిన్హాకు దక్కింది. పి.హెచ్.డి పూర్తిచేసిన 1963లో ఆమె యు.ఎస్. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో బయోఫిజిక్స్ విభాగంలో " ఒరిజిన్ ఆఫ్ లైఫ్ " పనిచేసింది. ఆమె " జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా , జె.సి బోస్ "లో 20 సంవత్సరాల కాలం పనిచేసింది. తరువాత ఆమె " సెంట్రల్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూటులో " ఫిజిక్స్ ఆఫ్ సెరామిక్ కలర్స్ గురించి పరిశోధనలో పనిచేసింది. ఆమె ఉద్యోగం నుండి విశ్రమించిన తరువాత సైన్స్ గురించిన ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా స్క్ర్డింగర్ వ్రాసిన " మైండ్ అండ్ మేటర్ " , కామనెట్‌స్కీ వ్రాసిన " ఉన్‌రావలింగ్ డి.ఎన్.ఎ " వంటి పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించింది.

లాబరేటరీ

[మార్చు]

ఎక్స్రే లాబరేటరీలో వారి ప్రయత్నాలు ఫలించి 50 క్లే శాంపుల్స్ లభించాయి. వాటిని కయోలినైట్, మోంటుమోరిలోనైట్, లిటిల్ వర్మిక్యులైట్, క్లోరైట్, ఇతరరకాలుగా వర్గీకరించారు. 1955లో పరిశోధనా ఫలితాలు సమగ్రపరచబడ్డాయి. 1956లో ప్రొఫెసర్ బోస్ కొలకత్తా యుఇనివర్శిటీ నుండి రిటైర్డ్ అయ్యాడు. తరువాత కమలాక్షా దాస్‌గుప్తా మార్గదర్శకత్వంలో పూర్ణిమా సిన్హా బృందం తదుపరి క్లే శాపుల్స్ గురించి స్ట్రక్చురల్ కేరెక్టరిస్టిక్స్ ఎక్స్-రే అధ్యయనం కొనగింది. అప్పటి నుండి క్లే శాంపులుస్ గురించిన ఎక్స్-రే అనాలసిస్ పలు ఇండియన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పలు ఇతర పత్రికలలో ప్రచురింబడ్డాయి. తరువాత కొంత మంది భారతీయ థియొరేటికల్ ఫిజిక్స్ పరిశోధకులలో మొదటిసారిగా ఎక్స్-రే ఆధారిత పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ఎస్.ఎన్ బోస్ ఒకరని విశ్వసించారు.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.