వినోద్ కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ కృష్ణన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

వినోద్ కృష్ణన్ చిన్న వయసులో అమ్మమ్మ గారింట్లో గ్రామీణ వాతావరణంలో పెరిగింది. అందువలన భవిష్యత్తు గురించిన ఆలోచనలు లేకుండా పెరిగింది. 4వ తరగతి చదివే సమయానికి ఢిల్లీలో ఉన్న తల్లి తీవ్రప్రయత్నం తరువాత తల్లితండుల వద్దకు చేరుకుంది. ఒకరోజు ఆమె ప్రయోగశాలలో ఎలెక్ట్రిక్ బెల్ గురించి నేర్చుకున్నది. ఇంటికి రాగానే ఆమె స్టోరు రూములోకి ప్రవేశించి ఒక ఎలెక్ట్రిక్ బెల్లును తీసుకున్నది. తరువాత ఫిజిక్స్ బుక్కులో నేర్పినవిధంగా వైర్లను జాయింట్ చేసి స్విచ్ వేసింది. బెల్ మాత్రం మోగలేదు కానీ స్విచ్ బోర్డ్ మాత్రం చుట్టు తిరిగింది. అంతే కాదు ఇల్లంతా చీకట్లో మునిగింది. ఆమె తండ్రి అడిగినప్పుడు ఆమె నిజం అంగీకరించింది. అలాగే ఆశ్చర్యంగా ఆమె తండ్రి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షమైంది. అప్పటి నుండి ఆమె ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆమె సాధించిన చిన్నచిన్న విషయాలను సైతం తండ్రికి చెప్పి సంతోషపడుతూ ఉండేది. ఆమె " యూనివర్శిటీ ఆఫ్ డిల్లీ "లో ఎమ్, ఎస్.సి ఫిజిక్స్ పూర్తి చేసింది. తరువాత ఆమె వివాహజీవితంలో ఆడుగుపెట్టింది.

రీసెర్చ్ తరువాత[మార్చు]

వినోద్ కృష్ణన్ పి.హెచ్.డి పూర్తిచేసిన తరువాత మూడు సంచత్సారాలు ఫిజిక్స్ డిపార్ట్మెంటులో ఉద్యోగబాధ్యతలు నిర్వహించింది. తరువాత 1979లో " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ " నుండి ఆటమన్ కాలేజ్ ఇన్ ప్లాస్మా ఫిజిక్స్‌లో (ఐ.టిసి.పి) పనిచేయడానికి పిలుపు అందుకుంది. ఇది వినోద్ కృష్ణన్ వృత్తిజీవితంలో సరికొత్త మలుపైంది. (ఐ.టిసి.పి) బాధ్యతలు నిర్వహిస్తూ నేర్చుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో తెలియజేసాయి. తరువాత ఆమె వెనుకటి ఉత్సాహం, కుతూహలం, ఆమెకే సజమైన వెర్రిసాహసం తిరిగిపొందింది. పరిశోధనా రంగంలో సాధించడానికి ప్రేరణతో ఫిజిక్స్ సంబంధిత అన్ని విభాగానికి చెందిన శాత్రవేత్తలతో పసిచయాలు సమావేశాలు అవసరమని భావించింది. ఆమె సమష్టిగా కృషిచేయడానికి అనుకూలంగా వివిధదేశాల నుండి వచ్చిన ఫెలో సైంటిస్టులతో సామావేశాలు ఏర్పాటుచేసుకోవడం ఒక మార్గమని విశ్వసించింది. అలాచేస్తే సహకారంగా పనిచేసే అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడింది. (ఐ.టిసి.పి) కలిగించిన ప్రేరణతో బ్రెజిల్, జపాన్ వేళ్ళాలన్న కోరిక బలపడింది. ఆస్త్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్‌లో పనిచేయడం వలన అనంత విశ్వం గురించిన అవగాహన కలిగింది. బెంగుళూరు మేధాపరమైన సంస్కృతి ఆమెకు శాస్త్రవేత్తగా ఎదగడానికి సహకరించింది. స్త్రీలు తమకేరీర్ నిర్మించుకోవడానికి పురుషులకంటే అధికంగా జాగరూకత వహించడం అవసరమన్నది ఆమె భావన. ఎప్పుడు ఎలాంటి పనిజేసేవారిని వివాహం చేసుకోవాలి ! ఎప్పుడు పిల్లలను కనాలి ! కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలి! వంటి పలువిషయాలలో సరైన నిర్ణయం తీసుకోవాలి అని ఆమె అభిప్రాయపడింది. విద్యావంతుని వివాహం చేసుకోవడం మాతృత్వం కొరకు వృత్తిలో పోటీ తగ్గించుకుని కనీసం ఐదు సంవత్సారాలైన పని గంటలు తగ్గించుకోవడం వంటివి చేయాలి అలాగే మహిళా శాస్త్రవేత్తకు కుటుంబ సహకారం అత్యవసరమని ఆమె అభిప్రాయం.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.