ఎస్ కె ఖందుజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.కె.ఖందుజా
ఎస్.కె.ఖందుజా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఎస్ కె ఖందుజా అంబాలా సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆమె తల్లి విద్యావంతురాలు కానప్పటికీ శ్రమకోర్చి పనిచేసేది. అలాగే ఆమె పిల్లలను చదివించాలని గాఢంగా అభిలషించింది. ఎస్ కె ఖందుజా తల్లి 2001లో మరణించే వరకు కుమార్తె అభివృద్ధికి మూలస్తంభంలా ఉంది. వాస్తవానికి ఆమెకు స్వయంగా కేరీర్ పట్ల ఆసక్తి లేనప్పటికీ ఆమె తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఆమెకు ఒక లక్ష్యం ఏర్పడేలా చేసారు. ఆమె చదవడానికి నైపుణ్యం పెంచుకోవడానికి వత్తిడి చేయబడింది. అలాగే ఆదర్శప్రాయమైన భార్యలా, తల్లిలా ఉండడానికి ఆమెకు కుటుంబం సలహాలతోనే సాధ్యపడింది.

విద్య[మార్చు]

ఎస్ కె ఖందుజా " ఆర్య కన్యా మహా విద్యాలయా "లో స్కూలులో ఆరంభవిద్యాభ్యాసం పూర్తిచేసింది. 1947లో దేశవిభజన తీవ్రవాదుల చేతిలో హతులైన వారి భార్యలైన మిసెస్.మాయా, మిసెస్. మైనా ఆమెకు టీచర్లుగా ఉండేవారు. వారిద్దరూ ఇచ్చిన ఉత్తమశిక్షణ ఎస్ కె ఖందుజాకు ప్రేరణ కలిగించింది. వారు ఉపాద్యాయవృత్తిని సేవా భావంతో చేసేవారు. వారింటి ద్వారాలు ఎప్పుడూ విద్యార్థులకు తెరిచే ఉండేవి. ఆమె చఫువుకున్న స్కూల్ హెడ్‌మాస్టర్ కూడా విద్యార్థుల అభివృద్ధి గురించిన ఉన్నత లక్ష్యాలు ఉండేవి.

యూనివర్శిటీ[మార్చు]

ఎస్ కె ఖందుజా 1971లో చంఢీగడ్ పి.యు యూనివర్శిటీలో పోస్ట్‌గ్రాజ్యుయేషన్ చేసింది.ఎస్ కె ఖందుజా 1976లో అల్జీబ్రాక్ రీసెర్చ్ సమర్పించింది. తరువాత అదే డిపార్ట్మెంటులో టీచింగ్ బాధ్యతలు చేపట్టింది. తరువాత ఆమె 1979లో వివాహం చేసుకున్నది. 1980లో ఇద్దరు కుమారులకు జన్మ ఇచ్చింది. 1984లో పల్లలు స్కూలుకు పోవడం ఆరంభించగానే కుటుంబ సభ్యులు సహోద్యోగుల ప్రోత్సాహంతో తిరిగి కొన్ని సంచత్సరాల కాలం రీసెర్చ్ కొనసాగించింది. ఆమె వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో 50 కంటే అధికంగా ప్రచురింబడ్డాయి. ఆమె మాథమెటిక్స్ మీద ఉన్న ఆరాధనను అవకాశం ఉంటే మరొక జన్మ వరకు కొనసాగిస్తానని చెప్పడం ఆమె అంకితభావాన్ని తెలియజేస్తుంది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.