సుమతీ సూర్య
సుమతీ సూర్య | |
---|---|
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
సుమతీ సూర్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. 9 సంవత్సరాల వయసువరకు ఆమె చదువుకు సహకారం అందించిన వారు ఆమె తల్లితండ్రులే. మద్యాహ్నం వేళలో ఆమె తల్లి ఆమెతో కూర్చుని వ్రాయడం, చదవడం, పాఠాలలో సహకరించడం వంటివి చేసేది. ఆమె తండ్రి తరచుగా ఉద్యోగరీత్యా ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఆయన సుమతీకి అంకగణిత సమస్యలు ఇచ్చి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చిట్కాలను అందించేవాడు. ఈ విధంగా సుమతీ సూర్యకు ప్రాథమిక సంఖ్యలతో పరిచయం ఏర్పడింది. ఇలా ఆమెకు పాఠశాల రోజులలో గణితం మీద ఆసక్తి ఏర్పడింది. ఇలా ఆటలో భాగంగా గణితం నేర్చుకోవడంలో ఆనందం కూడా అనుభవించింది. తరువాత ఆమె అన్న కొరకు తీసుకువచ్చే సైన్స్ సంబంధిత పుస్తకాలు చదివేది. వీటితో ఆమెకు సైన్స్ మీద అభిమానం ఏర్పడింది.
మాధ్యమిక పాఠశాల
[మార్చు]సుమతీ సూర్య 9 సంవత్సరాల వయసులో దేవుడంటే విశ్వాసం పోయింది. హేతుబద్ధంగా ఆలోచించడం ఆమెను ప్రకృతిలోని ప్రతిది ప్రశ్నించి తెలుసుకునే అలవాటు కలిగింది. ఆమె మిడిల్ క్లాసుకు చేరుకునే సమయానికి ఆమె తల్లి చురుకైన జర్నలిస్టుగా, రచయితగా రూపొందింది. ఆమె తల్లి ఆమె ప్రాథమిక సైన్స్ విద్యలో చక్కని సహకారం అందించింది. ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు ఒక ఉత్సాహవంతుడైన ఉపాధ్యాయుడు ఏకలవ్య రచించిన "బేసిక్ సైన్స్" అనే అద్భుతమైన హిందీ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ పుస్తకం ఆమెను ప్రభావితం చేయడమేగాక సైన్స్ మీద ఆసక్తిని ఏర్పరచింది. ఎలెక్ట్రికల్ ఇంజనీరయిన తండ్రి ఇంట్లో ఉండే వస్తువులు ఎలా పనిచేస్తున్నాయో వివరించేవాడు. ఆమెకు భౌతిక శాస్త్రము అంటే ఆసక్తి ఏర్పడాడానికి ఆమె అన్న కూడా ఒక కారణం. సుమతి అన్న కాలేజీలో భౌతిక శాస్త్రము ప్రధానాంశంగా ఎంచుకున్నాడు. అన్న తన చదువును గురించి ఇంట్లో చేసే చర్చలు కూడా ఆమెను విద్యాపరంగా ప్రభావితం చేసాయి. అలాగే విద్యార్థుల ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు ఇచ్చే టీచర్లు లభించడం ఆమె అదృష్టమని భావించింది. అయినా ఉన్నత పాఠశాల ముగించే సమయంలో పాఠశాలలోను, ఇంట్లోనూ స్త్రీలకు సైన్సు, గణితమూ సరిపోవు అని ఆమె లక్ష్యాన్ని నిరుత్సాహపరిచడం మొదలైంది. అయినప్పటికీ ఆమె అన్న ఆమె శక్తిని, ఆసక్తినీ ప్రోత్సహించి ఇంకా ఆసక్తిని పట్టుదలను పెంచుకొమ్మని ప్రోత్సహించాడు. ఎలాగైతేనేం ఆమె స్థానిక కాలేజీలో భౌతిక శాస్త్రం ప్రధానాంశంగా బి.ఎస్.సిలో చేరింది. అక్కడ ఆమెకు ప్రోత్సాహకరమైన విద్య లభించలేదు.
రీసెర్చ్
[మార్చు]సుమతీ సూర్య సైరక్యూస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. రఫీల్ సార్కిన్ మార్గదర్శకత్వంలో పరిశోధన చేసింది. ఆయన సుమతీ సూర్యకు శ్రేయోభిలాషిగా మారాడు. ఆమె టోపాలజీ సిద్ధాంత వ్యాసాన్ని (థీసిసు) సమర్పించింది. దీని కొరకు ఆమె గ్రాడ్యుయేట్ స్థాయి గణితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఆమె దానిని తనకు తానే నేర్చుకుంది. అది ఆమె గణిత ఆసక్తిని తిరిగి ప్రదీప్తం చేయడంతో ఆమె తన పరిశోధనను గణితం వైపు మళ్ళించింది. ఫలితంగా ఆమె పోస్ట్ డాక్టొరల్ పని కొరకు " మాథమెటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అండ్ క్వాంటం గ్రావిటీ అండ్ కొలాబరేటెడ్ ఇంక్లూడెడ్ మాథమెటిక్స్"ను ఎంచుకుంది.
తదనంతర కాలంలో ఆమె బెంగళూరులోని రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లో పని చెయ్యడం మొదలుపెట్టింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "A freedom to question..." (PDF). Archived from the original (PDF) on 26 August 2018.