Jump to content

బి.కె థెల్మా

వికీపీడియా నుండి
(బి.కె తెల్మ నుండి దారిమార్పు చెందింది)
బి.కె థెల్మా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

బి.కె థెల్మా తల్లితండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఆమె తాతగారు బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె తాతగారు చాలా క్రమశిక్షణ, దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆమె తాత బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేసాడు. బి.కె థెల్మా జన్మస్థలం మైసూర్ సమీపంలోని కూర్గుకు సమీపంలో ఉన్న మడికేరి. ఆమె పుట్టిన ఊరు కొండలు లోయలతో నిండిన స్వర్గం వంటిదని ఆమె భావన.ఆమె ప్రేమపూరితమైన ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పుట్టిపెరిగింది. ఆమె కుటునంబం విద్యా పరంగా అభివృద్ధి చెందిన కుటుంబం. కుటుంబంలో వారితో తాతనాయనమ్మ, అత్తలు కూడా ఉండేవారు. ఆమె అత్తలలో ఒకామె కూర్గులోని మొదటి ప్రభుత్వఉద్యోగినిగా సేవ చేసింది. అలాగే ఆమె ఇంట్లో పిల్లలకు పాఠాలు నేర్పించే బాధ్యతకూడా తానే వహించేది. వారి కుటుంబంలో ఆడపిల్లలు, మగపిల్లల మద్య వ్యత్యాసం లేకుండా ఉండేది.

స్కూలు

[మార్చు]

బి.కె థెల్మా ప్రాథమిక విద్య 3 సంచత్సరాల ప్రాయంలోనే మొదలైంది.ఆమె తల్లి తండ్రులు చదువు అవసరం, గొప్పతనం, ఉపయోగం గురించి విఛాఆరిస్తూ వారికి చదువుకోవడానికి అవసరమైన ప్రేరణ కలిగించారు. ఆమె టీచర్ ఆమెకు ప్రత్యేకంగా ఏమీ చెప్పనప్పటికీ ఏ శాస్త్రవేత్తల పుస్తకాలను చదవనప్పటికీ ఆమెకు కెమెస్ట్రీ, బయాలజీ అంటే అభిమానం ఆసక్తీ ఏర్పడింది. ఆ సమయంలో చదువులో చక్కగా నైపుణ్యం చూపి అభివృద్ధి సాధించడమే ఆమె లక్ష్యంగా ఉండేది. ఆమె తొమ్మిదవ తరగతి చదివేసమయంలో స్కూలులో కళలు, సైన్స్ లలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన అవసరం ఏర్పడింది. మేధావంతులైన విద్యార్థులకు గొప్పగా అర్ధంచేసుకొనవలసినది విచక్షణతో కూడుకున్నది అయిన సైన్స్ సరైనది కళలు మాత్రం కళాత్మక దృష్టి కలిగిన వారు ఎంచుకొనవలసినది అన్నది బి.కె థెల్మా భావన. అందువలన ఆమె తాను అభిమానించే సైన్స్‌ను ఎంచుకోలని అనుకున్నది. ఆమె అది అత్తకు చెప్పినప్పుడు ఆమె సైన్స్‌కు బదులు ఆర్ట్స్ తీసుకొమ్మని సలహా ఇచ్చింది. అత్త సలహాను అనుసరించి ఆమె ఆర్ట్స్ తీసుకోవాలని అనుకున్న సమయంలో వారి ఆర్ట్స్ టీచర్ ఆమెను సైన్స్ గ్రూపులో చేరమని ఆఙాపించింది. బి.కె థెల్మా టీచర్ మాటను పాటించి ఆ విషయం అత్తకు చెప్పింది. 10వ తరగతిలో బి.కె థెల్మా స్కూలు ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించింది. తరువాత కాలేజీలో ఏది ప్రధానాంశంగా తీసుకోవాలో అన్న ప్రశ్న ఉదయించింది. ఆమె తండ్రి ఆమెను ఐ.ఎ.ఎస్ కానీ మాథ్స్ మాస్టర్ డిగ్రీ కాని చేయమని చెప్పాడు. ఆరోజులలో డాక్టర్లు తమ పేషంట్లకు ట్రీట్‌మెంట్ చేసే విధానం ఆమెను ఆకర్షించడం వలన ఆమె డాక్టర్ కావాలని కోరుకున్నది. ఆమె కుటుంబం అందుకు సహకరించింది.

మెడిసిన్

[మార్చు]

డాక్టర్ చదవడానికిం బి.కె థెల్మా మెడికల్ కాలేజిలో చేరడానికి బెంగుళూరు వెళ్ళింది. అయినప్పటికీ ఇంటర్ మీడియట్‌లో ఆమె ఏకాగ్రత తక్కువైన కారణంగా చదువులో వెనుక బడినప్పటికీ ఫస్ట్‌క్లాసులో ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నంచి సఫలీకృతురాలైంది. అంతే కాక ఆమెకు మెడిసిన్‌లో చేరడానికి అవసరమైనంత వయసుకూడా తక్కువగా ఉన్నందున ఆమె అనుకున్నట్లు మెడికల్ కాలేజిలో చేరే అవకాశం లభించలేదు. ఆమె కుటుంబం మూడు సంవత్సరాల సమయం మెడిసన్ కొరకు వ్యర్ధంచేయడానికి అంగీకరించలేదు. అందువలన ఆమె బి.ఎస్.సి డిగ్రీ పూర్తిచేసింది. ఆమెకు ఆమె తండ్రి జువాలజీ మాస్టర్స్ చేయమని సలహా ఇచ్చాడు.

మాస్టర్ డిగ్రీ

[మార్చు]

బి.కె థెల్మా మాస్టర్ డిగ్రీ చేస్తున్న తరుణంలో హెడ్ ఆఫ్ దిడిపార్ట్‌మెంటు ఆనెకు ప్రత్యేక పేపరుగా ఆమెడిగిన ఫిజియాలజీకి బదులుగా సైటాలజీని ఇచ్చింది. బి.కె థెల్మా తనకు మార్గదర్శిగా అనిమల్ ఫిజియాలజీ పి.హెచ్.డి స్కాలరును ఆమె విద్యార్థులను ఎంచుకున్నది. ఆమె లాబరేటరీలో జరిగిన చర్చల తరువాత సైన్స్‌ను తన వృత్తిపరమైన లక్ష్యంగా ఎంచుకున్నది. ఆమె బయోమెడికల్ రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నది. అయినప్పటికీ ముందుగా ప్రవేశపరీక్షా ఫలితాలు ఆశాజనకంగా లేనికారణంగా పి.హె.డి చేయడానికి ప్రథమశ్రేణి ఇంస్టిట్యూటులో అవకాశాలు రాఏదు. అయిననప్పటికీ ఢిల్లీ యూనివర్శిటీ నుండి వచ్చిన అవకాశాన్ని అందుకుని ఆమె పి.హెచ్.డి చేయడానికి ఢిల్లీ వెళ్ళింది. ఇలా ఆమె ఇంటికి మరింత దూరం అయింది. మొదట ఆమె సరికొత్త ప్రాంతం సరికొత్త భాషకు కొంత అయోమయంలో పడినా క్రమంగా పరిస్థితికి అలవాటు పడింది.

పి.హెచ్.డి

[మార్చు]

బి.కె థెల్మా బయోమెడికల్ రీసెర్చ్ చేయడానికి మార్గదర్శిగా ఎస్.ఆర్.వి రావును ఎంచుకున్నది. రిలాక్సేషన్, ఆసక్తికరమైన వాతావరణం ఆత్మార్ధంగా పరిశోధనలను నిర్వహించడం వంటి అనుకూల వాతావరణంలో ఆమె రీసెర్చ్ కొనసాగింది. ప్రొఫెసర్ ఎస్.ఆర్.వి రావు అధిక సమయం లాబరేటరీలో పనిచేయడం చర్చించడం చేస్తూ గడిపేవాడు. ఆయన ప్రాజెక్టు సంబంధిత విషయాలే కాక ఇతర సమకాలీన పరిశోధనల గురించి చర్చించే వాడు. బి.కె థెల్మా రీసెర్చ్ వాతావరణాన్ని సంతోషంగా తీసుకుని వీలైనంత అధికంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేది.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

బి.కె థెల్మా పోస్ట్‌డాక్టొరల్ ఫెలోషిప్ కొరకు స్విడ్జర్‌లాండ్ లోని బేసిల్ వద్ద ఉన్న చిల్డ్రెంస్ హాస్పిటల్‌లో చేరింది. ఆమె కోరుకున్న విధంగా హాస్పిటల్ వాతావరణంలో పనిచేయడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చింది. భారతదేశం వచ్చిన తరువాత ఆమె టీచరుగా - శాస్త్రవేత్తగా పనిచేయాలని డాక్టర్ రావులా విద్యార్థులకు ప్రేరణ కలిగించాలని నిర్ణయించుకున్నది. ఆమె జెనెటిక్ డిపార్ట్‌మెంటులో పనిచేయడానికి చేరింది. తరువాత ఆమె అక్కడే కొనసాగింది. సైన్స్ పయనం దీర్ఘమైనది, కఠిమైన శ్రమతో కూడుకున్నది అలాగే అది తనకు ఆనందం కలిగించిందని తన కుటుంబం తనమీద ఉంచిన నమ్మకాన్ని కాపాడడానికి సదా కృషిచేసానని బి.కె థెల్మా ఆత్మార్ధంగా భావిచింది.

మాస్టర్ డిగ్రీ

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.