సుస్మితా మిత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుస్మితా మిత్రా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

సుష్మితా మిత్రా తల్లి డాక్టర్ మాయ తండ్రి డాక్టర్ గిరీంద్రనాథ్. ఆమె తండ్రి " ఇండియన్ కౌంసిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ "లో శాస్త్రఙనుడు. ఆమె తల్లి కొలకత్తాలోని ప్రముఖ స్త్రీలకళాశాల అయిన " బెతున్ కాలేజి "లో బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుష్మితా మిత్రా అభివృద్ధికి ఆమె తల్లి విసుగుచెందని ప్రయత్నమే కారణమని సుష్మితా మిత్రా నొక్కిచెప్పింది. సుష్మితా మిత్రా తల్లి మగపిల్లలలు కుటుంబంలో అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వ్యతిరేకిస్తుంది. ఆమె కాలేజ్ విద్యను అభ్యసించాలని అభిలషించి పట్టుదలతో పూర్తిచేయడమేకాక 1960లో పి.హెచ్.డి సాధించింది. అంతేకాక అమె జనరల్ నేచుర్ పేపర్ సమర్పించి 1962లో కొలకత్తా విశ్వవిద్యాలయం నుండి బంగారుపతకాన్ని పొందింది.

సుష్మితా మిత్రా తల్లి ఉద్యోగబాధ్యతల మద్య సుష్మితాతో గడపడానికి తగిన సమయం కేటాయించి సుష్మితా పురోభివృద్ధికి తోడ్పడింది. ఆమె పోషణలో తోడ్పాటుతో ఆరోగ్యకరమైన వాతావరణంలో సుష్మితా చదువుముందుకు సాగింది. ఆమె తండ్రి ఉద్యోగబాధ్యతల కారణంగా ఎక్కువ సమయం కొలకత్తాకు వెలుపల కటక్, షిల్లాంగ్ , హైదరాబాదు లో గాదిచిపోయింది. అందువలన సుష్మితా తల్లిపెంపకంలోనే ఎక్కువగా పెరిగింది. ఆమె తల్లి ఉద్యోగరీత్యా తల్లితో భారతదేశపు నలుచెరగులా ప్రయాణించింది.

ఆమె తండ్రి 53వ సంవత్సరంలో మరణించడం వలన కుటుంబబాధ్యత మొత్తం ఆమెతల్లి నిర్వహణలో సాగింది. తల్లి ప్రోత్సాహంతో" నేషనల్ కౌంసిల్ ఫర్ ఎజ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రనిగ్ " నిర్వహించిన " నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ " పరీక్షలకు హాజరై ఎన్.ట్.ఎస్ నుండి స్కాలర్‌షిప్ (ఉపకారవేతనం) పొందింది. తరువాత మాస్టర్ డిగ్రీ పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ అందుకున్నది. 1995లో ప్రొఫెసర్ శంకర్ కె పాల్ గైడెంస్‌లో " ఇండియన్ స్టాటిస్టికల్ ఇష్టిట్యూట్ " నుండి కంప్యూటర్ సైంస్‌లో పి.హెచ్.డి పూర్తిచేసింది. ప్రొఫెసర్ శంకర్ కె పాల్ ఆమె వృత్తిజీవితాభివృద్ధికి ప్రోత్సహించి సహకరించాడు. 1991 వరకు ఆమె ఐ.ఎస్.ఐ లో పనిచేసింది. పి.హెచ్.డి తరువాత ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకుంది. తరువాత తల్లి అభిలషించిన విధంగా బాటనీని ఇంఫర్మేషన్ టెక్నాలజితో అనుసంధానించే " బయోఇంఫర్మేటింగ్స్ " ప్రధానాంశంగా పరిశోధన కొనసాగిస్తుంది. ఆమెకు పలువిధాలుగా సాకరించిన తల్లి 2006లో మరణించింది. ఆమె తల్లి అభిలాషను పూర్తిచేయడానికి కృషిచేస్తూ ఉంది. ఆమె " న్యూరో - ఫజీ " లో సాధించిన ప్రగతి అంతర్జాతీయంగా గుర్తించబడడంతో పలు ఫెల్లో షిప్పులు ఆమెను వరించాయి.ఆమె " న్యూరో - ఫజీ " సంబంధిత మెథడ్స్ ఆఫ్ సాఫ్ట్ కంప్యూటింగ్, డేటా మైనింగ్, మల్టీ మీడియా, సాఫ్ట్ కంప్యూటింగ్, బయోఇంఫర్మేటింగ్స్, ఇంన్‌ట్రడక్షన్ టు మెషిన్ లాణింగ్ మొదలైన అంశాలతో పలు పుస్తకాలను వ్రాసింది. పలు అంతర్జాతీయ పత్రికలకు సహాయ సంపాదకురాలుగా పనిచేసింది. పలు అంతర్జాతీయ సమావేశాలకు కార్యనిర్వాహకురాలిగా పనిచేసింది. ఆమె తన విద్యా, ఉద్యోగజీవితంలో స్త్రీపురుష విభేధ సమస్యలను ఎదుర్కోలేదని అంగీకరించడం భారతీయసమాజంలో శ్లాఘించతగిన మార్పులు వచ్చాయనడానికి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా