చందా నింబ్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందా నింబ్కర్
చందా నింబ్కర్
పౌరసత్వంభారతీయురాలు
జాతీయత Indian
చదువుకున్న సంస్థలుఏడింబర్గ్ యూనివర్శిటీ

చందా నింబ్కర్ 1976లో ఎస్.ఎస్.సి పరీక్షలలో కామర్స్‌లో 3 వ స్థానం గెలుచుకుంది. కామర్స్‌లో విజయం సాధించిన చందా సైన్స్ పరిశోధన సాగించడం విచిత్రం. ఆమె జంతువుల సంతానోత్పత్తి గురించిన పరిశోధనలు చేసింది. పరిశోధనల కొరకు ఆమె ప్రశాంతమైన ఫాం ఏర్పరచుకుని కలుషరహిత వాతావరణంలో పూర్తిగా పరిశోధనలలో మునిగిపోయింది. పల్లెసీమలలో ఫాం నిర్మించుకుని అద్భుతమైన వృత్తిని చేస్తూ గొర్రెలు, మేకలలో సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడానికి కృషిచేసింది. ఆడిటర్‌గా పనిచేయవలసిన ఆమె సరికొత్త దారిలో ఫాం ఏర్పరచుకుని వృత్తిసాగించడానికి ఆమె విచారించలేదు.

బి.ఎస్.సి డిగ్రీ[మార్చు]

ఆమెకు సైన్సు పట్లకలిగిన మోహంచేత కామర్స్ డిగ్రీపుచ్చుకున్న తరువాత తిరిగి బి.ఎస్.సి డిగ్రీలో చేరింది. ఆర్ట్స్ డిగ్రీలో ఆమె అధ్యయనం చేసిన గణాంకాలు జంతువుల సంతానోత్పత్తికి సహకరించింది. ఇలా మొదటి అధ్యయనం తరువాత వృత్తిపరమైన పరిశోధనలకు ఉపకరించింది. కామర్స్ ఙానం ఆమె బాధ్యత వహించిన శాఖానిర్వహణా బాధ్యతలను సులువుచేసింది. సరిగ్గా కామర్స్ డిగ్రీ పూర్తిచేసిన 6 సంవత్సరాల తరువాత ఆమె జంతువుల సంతానోత్పత్తి గురించిన ఒక సంవత్సరం మాస్టర్ డిగ్రీ అధ్యయనం చేయడానికి ఏడింబర్గ్ యూనివర్శిటీలో స్థానం లభించింది. " క్వాంటిటేటివ్ " లేక " స్టాటిస్టికల్ జెనెటిక్స్ " అధ్యయనం ఆమెను ఆనందపరచింది.

పిహెచ్ డి[మార్చు]

ఎం.ఎస్.సి తరువాత పి.హెచ్.డి తరువాత ఎడింబర్ఘ్ యూనివర్శిటీ నుండి ఉపకారవేతనం లభించింది. సాధారణంగా ఎవరినైనా ఇది ఆకర్షిస్తుంది. అయినప్పటికీ ఆమె తిరిగి స్వదేశానికి వచ్చి ఒక ఫాంలో జంతువుల సంతానోత్పత్తి కొరకు కొన్ని సంవత్సరాలు కృషిచేయడం ఆరంభించింది. తరువాత తత్సంబంధిత అంశంలో పి.హెచ్.డి చేయాలని నిర్ణయించుకుంది. పరిశోధన వృత్తికి సహకరిస్తుందని భావించింది. 1990లో తిరిగి వచ్చి నింబార్క్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యూనిట్‌లోని అనిమల్ హస్బెండరీలో పనిచేయడానికి చేరింది. 1968లో ఆమె తండ్రి ఎన్.ఎ.ఆర్.ఐ పరిశోధనా సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పొద్దుతిరుగుడు (సంఫ్లవర్), సా ఫ్లవర్ (కుసుంభ), జొన్న ( స్వీట్ సొర్ఘం) వంటి వ్యవసాయ ఉత్పత్తులను అధికం చేయడానికి కృషిచేస్తుంది. ఇందులో పనిచేయడం చందా నింబర్క్‌కు ఆసక్తి కలిగించింది. సంస్థ కొంత నిధులను సమకూర్చుకుని ఉత్సాహంగా పనిచేస్తూ ఉంది. 2002లో మరొక రీసెర్చ్ స్కాలర్‌షిప్ అందుకోలేదు. తరువాత 2002లో " ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ " నుండి ఆల్‌బ్రైట్ ఫెలోషిప్ రావడం ఆమెను ఆనందపరచింది. తరువాత ఆమె ఆస్ట్రేలియా దేశంలోని ఆర్మిడేల్‌లో ఉన్న " యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్ "లో రీసెర్చ్ చేసింది. జంతువుల సంతానోత్పత్తి అంశలో " యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్ " ప్రథమస్థానంలో ఉంది.

వృత్తిజీవితం[మార్చు]

తరువాత ఆమె డెక్కని గొర్రెలకు రెండు పిల్లలను ఈనడానికి కావలసిన కృషిచేసి వాటిని అంధ్రప్రదేశ్ , జమ్ముకాశ్మీర్ లోని గొర్రెలకాపరులకు అందచేసే పనిలో నిమగ్నమైంది. మహారాష్ట్రలోని పాల్థన్ సమీపంలో దాదాపు 30 మంది చిన్నతరహా గొర్రెల కాపర్లు ఈ గొర్రెల పెంపకం, అదనపు గొర్రెపిల్లలను అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఆమె తన గొర్రెలపై పరిశోధనలకు గొర్రెలకాపరులు అందిస్తున్న సహకారాన్ని ఆనందిస్తూ తనవృత్తిలో ముందుకు సాగుతున్నది. గొర్రెల కాపర్లకు అదనంగా శిక్షణ అందించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. తన పరిశోధనా ఫలితాలను స్వయంగా ప్రజలకు చేర్చడం ఆనందదాయకమైనదని ఆమె భావిస్తుంది.

పరిశోధనలు సహకారం[మార్చు]

ఆమెకు తగినంత ప్రోత్సాహం అందించి, స్వంతంగా స్వతంత్రంగా నిర్ణయించే అధికారం అందించి అలాగే ఆర్థికంగా మానసికంగా అవసరమైన సహాయం అందించి సహకరించిన తల్లితండ్రుల పట్ల ఆమెకున్న కృతఙ్ఞత ఎనలేనిది. తన పరిశోధనకు అనువైన విధంగా సంస్థను స్థాపించి తనకు సహకరించడమే కాక దీర్ఘకాల పరిశోధనా ప్రణాళికకు అవసరమైన నిధులు పొందడానికి సహకరించిన తండ్రిప్రేమ ఆమె అభివృద్ధికి పునాదులు వేసింది. ఆమె భర్త గవన్ అందించిన అసాధారణమైన సహకారం కూడా ఎన్నటికీ మరువరానిదని ఆమె భావిస్తున్నది. ఆమె భర్త ఆమెకు వృత్తి , జీవితం సమతుల్యంగా నడిపించడమెలా అన్నది నేర్చుకున్నానని పేర్కొన్నది. ఆమె " సైన్సు అండ్ టెక్నాలజీ ఇన్నొవేషన్స్ ఫర్ రూరల్ డెవలెప్మెంట్ " కొరకు సి.ఎస్.ఐ.ఆర్ అవార్డును అందుకున్నది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.