చందా జోగ్
చందా జోగ్ | |
---|---|
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
చందా జోగ్ తండ్రి ఎలెక్ట్రికల్ ఇంజనీర్. ఆయన అహమ్మదాబాదు ఎలెక్ట్రికల్ కంపనీలో పనిచేస్తూ ఉండేవాడు. తండ్రిద్వారా విజ్ఞాన శాస్త్రము, ఇంజనీరింగ్ ఆమె జీవితంలో చిన్నవయసు నుండి ఒకభాగమై ఉండి ఆమెకవి ఆనందం కలిగించేవి. ఆమె తండ్రి నుండి వివిధ ప్రయత్నాలను చేస్తూ అపజయాల నుండి పాఠాలు నేర్చుకుంటూ విజయం సాధించడంలో ఉన్న ఆనందం ఏమిటో అర్ధమైంది. తరువాత ఆమెకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె అక్క " బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్" (బి.ఆర్.సి) ట్రైనింగ్ స్కూలులో సైంటిస్టుగా చేరింది. అక్కద్వారా ఆమె జార్జ్ గామో వ్రాసిన మిస్టర్ టంకింస్ ఇన్ వండర్‌లాండ్ వంటి పుస్తకాలను చదివే అవకాశం లభించింది. అప్పుడే ఆమెకు ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్ మీద అభిమానం ఏరడింది. కుటుంబ వాతావరణం ఆమెకు స్వయం నిర్ణయం చేసుకోవడం, చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పుడు అధిగమించడం నేర్చుకున్నది. స్కూలులో చదివే సమయంలో సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నది. ప్రత్యేకంగా ప్రకృతికి సంబంధించిన కవిత్వం అంటే మరింత ఆసక్తి ఉండేది. ఆమె దైనందిన జీవితంలో సంగీతం ఒక భాగమై పోయింది.
ప్రకృతి ఆరాధన
[మార్చు]చందా జోగ్ మహారాష్ట్రలో ఉన్న సహ్యాద్రి కొండల పాదభాగంలో ఉన్న కాల్వే అనే ఊరిలో నాలుగు సనత్సరాల (12 వయసు-16వయసు) కాలం నివసించింది. సహజంగా ప్రకృతి ఆరాధకురాలైన ఆమెకు ఆ వాతావరణం మరింత ప్రేరణ కలిగించింది. సహజ ప్రకృతి మద్య నివసించిన కారణంగా ఉదయం మంచుబిందువులతో ఆంకరించబడిన గడ్డి, కొండ కోనలనుండి జాలువారుతున్న జలపాతాలు, వర్షాలు, ఊసరవెల్లులు, కప్పల వంటి ఉభయచరాలు కొండకచో పాములు వంటి అనదమైన అద్భుతమైన జంతువులు వారి ఇంట ప్రవేశించేవి. ఆమెకు ఆ వాతావరణం ఆసక్తికరమైన దృశ్యంగామారింది. ఆమెకు వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆమె తల్లితండ్రులు ఆమెకు కలిగిన కుతూహలాన్ని మరింతగా ప్రోత్సహించారు. ఆమె తల్లితండ్రులు ఆమెకు స్వతంత్రంగా ఆలోనించడం చుట్టూ ప్రపంచాన్ని కుతూహలంతో గమనించడం వంటివి నేర్పారు. విఙానం కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన రాదని చుట్టూ ఉన్న వాతావరణం నుండి పరిశీలించి తెలుసుకోవాలన్నది వారి అభిప్రాయం. ఆమెకు ఆసమయంలో జామెంట్రీ, ఫిజిక్స్ అంటే మక్కువ అధికంగా ఉండేది. జామెంట్రీ పట్ల ఆసక్తి కలగడానికి ఆమె తల్లి కారణమైంది. నిర్మాణం, లాజిక్‌ను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ఆమెకు ఉద్వేగం కలిగించేది.
పి హెచ్.డి
[మార్చు]చందా జోగ్ యునైటెడ్ స్టేట్స్‌లో పి.హె.డి చేసేసమయంలో పారదర్శకత, స్థిరంగా ఉండడం, అంకితభావంతో పనిచేయడం, శాస్త్రవేత్తగా కఠినంగా శ్రమించడం వంటివి అలవడ్డాయి. అక్కడ ఆమె అలోక్ జైన్‌ను కలుసుకున్నది. తరువాత ఆమె అలోక్ జైన్‌ను వివాహం చేసుకున్నది. అలోక్ జైన్ ఆసమయంలో స్టోనీ బ్రోక్ విద్యార్థిగా ఉండేవాడు. చందాజోగ్ భర్త ఆమె పరిశోధన చేసేలా ప్రోత్సాహం అందిస్తూ ఆమె అభివృద్ధికి మూలస్తంభంలా సహకారం అందించాడు. ఆమె ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తగా పనిచేయడలో ఆనందం అనుభవించింది. ఆమెకు ఆరాధిస్తూ పనిచేయడం అనే విషయం ఎనలేని సంతృప్తి కలిగించింది.
భారతదేశానికి తిరిగి రాక
[మార్చు]భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె ఎదుర్కొన్న ప్రధాన సమస్య వయసు. ఆమె చిన్నవయస్కురాలిగా ఉన్నందున ఆమెకు తగినగుర్తింపు కానీ ప్రోత్సాహం అందించడం కానీ కలిసి పనిచేయడానికి అవకాశం కానీ లభించలేదు. ఆరంభకాల ఈ నిరక్ష్యం దీర్ఘకాల పరిశోధనలకు అవరోధంగా మారింది. అభివృద్ధి చెందుతున్న శాస్త్రవేత్తకు ప్రత్యేకంగా మహిళాశాస్త్రవేత్తలకు ఇది ప్రధాన సమస్యగా మారిందని ఈ విధానం పరిశోధనా పరంగా సమాజానికి కూడా నష్టం కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఆస్చర్యకరంగా యు.ఎస్, అరియు ఐరోపాలో కూడా మహిళలకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. " వుమన్ ఇన్ ఫిజిక్స్ " వంటి చర్చలలో కూడా ఇది ప్రధానాంశంగా మారింది. భారతదేశంలో ప్రత్యేకంగా ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇది ఒంటరి పోరాటమని ఆమె భావించింది. అయినప్పటికి తనతాను ఆమె యువతకు పూర్తి సహకారం అందుంచాలని నిశ్చయించుకున్నది. ఆమెకు ఐరోపా, భారతదేశంలో ఉన్న విద్యార్థులు, పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ పూర్తి సహకారం అందించి వారి అభివృద్ధికి సహకరించాలన్నది ఆమె దృఢసంకల్పం. వ్యక్తిగతంగా ఇలాంటి సహకారం అందించడం పరిశోధనా నైపుణ్యాల వ్యర్ధం కాకుండా కాపుడుతుందని ఇది పరిశోధనా రంగానికి ఎంతో సహకరిస్తుందని ఆమె విశ్వసించింది.
ఆసక్తి
[మార్చు]ఆమె అత్యుత్సాహం, కుతూహలంతో పనిచేస్తూ గ్యాలెక్సీలలో జరుగుతున్నదేమిటి ? గ్యాలక్సీ పయనం ఏమిటి? నక్షత్రం రూపుదిద్దుకోవడం ఎలా ? వంటి విషయాలను పరిశోధించడానికి ఉద్వేగభరితంగా పనిచేస్తున్నది. మర్మమైన విషయాలను శోధించి తెలుసుకోవడం తెలుసుకున్నది ప్రపంచానికి తెలియజేయడం వంటి లోతైన శాస్త్రీయమైన విషయాలు అఫ్హ్యయనం ఆమెకు ఆనందం కలిగించాయి. అలాగే ఇతర విజ్ఞాన శాస్త్రము పరిశోధనలు కూడా ఇలాంటి ఉద్వేగభరితమైనవేనని ఆమె భావించింది. ఆమె విజ్ఞాన శాస్త్రము సంబంధిత పరిశీధనలను అధ్యయనాలను ఆరాధించిది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.