హెచ్ ఇళా
హిరియక్కనవార్ ఇళా | |
---|---|
జననం | ఇళా భట్నాగర్ |
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
హిరియక్కనవార్ ఇళా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మథురలో మధ్యతరగతి కాయస్థ కుటుంబంలో జన్మించింది. వారి కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నత విద్యాభ్యాసం చేయడంతో పాటు గృహనిర్వహణా నైపుణ్యం ఉండాలని కోరుకునేవారు. ఆమె తండ్రి రమేష్ చంద్ర భట్నాగర్ 1936లో అలహాబాదులో భాతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి చేశాడు. అమే తండ్రి ఆమె మనసులో చిన్నవయసులోనే పట్టుదల, పరిపూర్ణత్వపు బీజాలు నాటాడు. ఐదుగురు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో ఆమె మూడవ కుమార్తెగా జన్మించింది. ఆడపిల్లలలు వృత్తివిద్య అభ్యసించడం అసాధారణమైన రోజులలో ఆమె కుటుంబం ఆమెను వైద్యురాలిని చేయాలని ఆశించింది.
విద్య
[మార్చు]1958లో ఇళా మొరాదాబాదు మెథడిస్ట్ బాలికల ఉన్నత పాఠశాల నుండి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణురాలైంది. తరువాత ఆమె తండ్రి ఉద్యోగరీత్యా గోరఖ్‌పూర్‌కు బదిలీ కాగా, గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆమె 1960లో ఇంటర్మీడియట్, అలాగే 1962లో బ్యాచిలర్ డిగ్రీతో ఉత్తీర్ణురాలైంది. నిరాడంబరంగా జీవించడం అత్యుత్తమంగా యోచించడం వారి కుటుంబ లక్ష్యం. ఆమె తండ్రి వారిని సదా అన్నింటా ప్రథమస్థానంలో ఉండాలని కోరుకునేవాడు. అది వారు సులువుగానే సాధించినప్పటికీ కొంత వత్తిడిని కలిగించింది. మొదటి స్థానం తప్పిపోయి రెండవ స్థానం వస్తే ప్రపంచం తలక్రిందులైన భావన కలిగేదని ఆమె చెప్పుకున్నది.
ఉన్నత విద్య
[మార్చు]1961లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రి- మెడికల్ టెస్ట్‌కు హాజరైంది. ఆమె ప్రథమస్థానంలో ఉత్తీర్ణురాలైంది. మెడికల్ టెస్టులో మహిళా విద్యార్థిప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించడం అదే మొదటిసారి. అయినప్పటికీ ఆమెకు వైద్య విద్య అభ్యసించడంలో ఆసక్తి లేదు. జార్జ్ మెడికల్ కాలేజిలో చేరిన మొదటి వారంలోనే తిరిగి వచ్చి, గోరఖ్ పూర్ యూనివర్శిటీలో బి.ఎస్.సీలో చేరింది. మెడికల్ కాలేజ్ నుండి ఎందుకు వెనుదిరిగి వచ్చిందో ఆమెకు స్పష్టమైన అభిప్రాయం లేదు.
ఎం.ఎస్.సి
[మార్చు]1962 ఆమె తండ్రికి కాన్పూరు బదిలీ అయింది. కాన్పూరు, డి.ఎ.వి కళాశాలలో ఇళా ఎం.ఎస్.సి చదువు పూర్తిచేసింది. ఆమె తండ్రి కలలలుగన్న అలహాబాదు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేయడానికి సి.ఎస్.ఐ.ఆర్ ఫెలోషిప్ ఆరంభించిన వెంటనే, ఆమెకు కాన్పూరు ఐ.ఐ.టి రసాయానశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి చేయడానికి పిలుపు అందింది. అక్కడ సి.ఎన్.ఆర్. రావు, పి.టి. నరసింహన్, ఎం.వి. జార్జ్, ఎం.ఎస్. ముతానా వంటి ప్రొఫెసర్లు ఇళాకు బ్యాచిలర్ స్థాయిలో గణితశాస్త్రాన్ని అధ్యయనం చేయని కారణంగా ఐ.ఐ.టి ప్రవేశానికి అభ్యంతరం వెలిబుచ్చారు. ఆమె ముందుగా ఆందోళనకు గురైనా, ప్రొఫెసర్ రావు సలహాతో అదనంగా గణితశాస్త్రపు కోర్సును ఎంచుకుని అధ్యయనం కొనసాగించింది. తరువాత ఆమె జీవితంలో వెనుతిరిగి చూడవలసిన అవసరం లేకుండా అభివృద్ధి పథంలో కొనసాగింది.
రీసెర్చ్
[మార్చు]ఐ.ఐ.టిలో అత్యుత్సాహవంతులైన ప్రొఫెసర్ రావు, నరసింహన్, జార్జ్, రంగనాథన్, చక్రవర్తి విద్యార్థుల యొక్క కేరీర్ నిర్మాణానికి సహకరించడమే కాక వారిలో ఉత్తమ నడవడి, రసాయనశాస్త్రం పట్ల ఆరాధన కలగడానికి కృషిచేసారు. కాన్పూరు ఐ.ఐ.టిలో నుండి పి.హెచ్.డి పట్టం పుచ్చుకున్న మొదటి మహిళ అన్న గుర్తింపు ఇళాకు దక్కింది. పి.హెచ్.డి చేస్తున్న కాలం ఆమె జీవితంలో మరపురానిదని ఆమె పేర్కొన్నది. 1968లో పి.హెచ్.డి పట్టం అందుకున్నది. 1970లో పరిశోధనా శాస్త్రవేత్తగా పోస్ట్ డాక్టరల్ పొజిషన్ కొరకు ఆమె లక్నోలోని " సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్"లో చేరింది. 1971లో ఆమె వివాహం చేసుకున్నది.
వివాహం
[మార్చు]ఆరోజులలో దక్షిణాది-ఉత్తరాది వివాహాలు అసాధారణం. ఇద్దరు ప్రొఫెషనల్స్ మధ్య జరిగిన ఈ వివాహం నిర్ణయించడానికి ముందుగా ఆమె తగు జాగ్రత్తలు తీసుకుంది. వివాహజీవితంలో దంపతులిరువురిని ఆర్గానిక్ కెమిస్ట్రీ బంధించడం ఒక వింత. వారు దంపతులుగా కేరీర్ ప్రారంభించారు. రసాయనశాస్త్ర రంగంలో ఇళా కంటే ఆమె భర్త జంజప్పకు అధిక గుర్తింపు ఉంది. వారిరువురు పరిశోధనలు చేయడం, శాస్త్రీయ పత్రాలు ప్రచురించడంలో మునిగి ఉండగా తిరిగి చూసే సమయానికి కాలం చాలా వేగంగా ముందుకు సాగింది.
నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీ
[మార్చు]1976-77 సంవత్సరం వారి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. వారిరువురు షిల్లాంగ్లోని, నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. విభాగపు స్థాపకుడిగా జంజప్ప ముందుగా షిల్లాంగ్ వెళ్ళారు. ఆ ప్రదేశం సైన్స్, కెమెస్ట్రీ రహిత అరణ్యంగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా 3-4 సంవత్సరాల తీవ్ర కృషి తరువాత వారు దేశంలోనే ఉన్నతమైన రసాయనిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయగలిగారు. లాబొరేటరీ, లైబ్రరీ, ఇంస్ట్రుమెంటేషన్ హంగులతో రసాయన శాస్త్ర పరిశోధనా కేంద్రం రూపుదిద్దుకుంది. 1980-1990 నాటికి రసాయన శాస్త్ర పరిశోధనా కేంద్రం నుండి రసాయన శాస్త్ర రంగంలో చరిత్ర సృష్టించిన పేపర్లు ప్రచురించబడ్డాయి.
కాన్పూరు
[మార్చు]షిల్లాంగ్‌లో 18 సంవత్సరాలు పనిచేసిన తరువాత తిరిగి కాన్పూరు ఐ.ఐ.టిలో ప్రొఫెసర్‌గా ఉద్యోగబాధ్యతలు చేపట్టింది. అక్కడ ఆమె 11 సంవత్సరాలు పనిచేసింది. ఆ సమయంలో కొన్ని అవార్డులు, గుర్తింపులు లభించాయి.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.