మైథిలీ రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైథిలీ రామస్వామి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మైథిలీ రామస్వామి బాల్యంలో తిరునెల్వేలి జిల్లాలోని కడయంలో గడిచింది. స్కూలులో ఆమెకు ప్రేరణకలిగించే గణిత ఉపాధ్యాయులు లభించారు. ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం వలన ఆమెకు గణితం అంటే ఆరాధన ఏర్పడింది. ఆమె దాయాది సోదరుడు పి.ఎస్. సుబ్రహ్మణ్యం ద్వారా టి.ఐ.ఎఫ్.ఆర్ గురించి తెలుసుకుని కాలేజ్ చదువు కొరకు ముంబై పోవడం ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.

విద్య[మార్చు]

ముంబైలో బి.ఎస్.సిను ఎస్.ఐ.ఇ.ఎస్ కాలేజ్ లోపూర్తి చేసారు. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన మైథిలీ రామస్వామి బి.ఎస్.సి తరువాత ఎం.ఎస్.సి చదవాలని నిర్ణయించుకున్నది. " బాంబే యూనివర్శిటీ "లో ఎం.ఎస్.సి చేసేప్పుడు మైథిలీ రామస్వామికి ప్రేరణ కలిగించే ఉపాధ్యాయులు లభించారు. టి.ఐ.ఎఫ్.ఆర్‌లో ఎం.ఎస్.సిలో కాంప్లెక్స్ అనాలసిస్ బోధించిన ప్రొఫెసర్ రంగాచారి అందించిన ప్రోత్సాహం చెప్పదగినది. కాంప్లెక్స్ అనాలసిస్‌ సబ్జెక్టుకు ప్రొఫెసర్ రంగాచారి సౌందర్యం తీసుకువచ్చాడు. అయినా ప్రభుత్వ విధానాల కారణంగా " అప్లికేషన్స్ ఆఫ్ మాథమెటిక్స్ " గణితం సబ్జెక్టుగా పరిగణించబడలేదు. అందువలన మైథిలీ రామస్వామికి కాంప్లెక్స్ అనాలసిస్‌లో పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నది. ఎంఎస్సీ చదువు బ్యాంకు ఉద్యోగం చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఆమెకు మహారాష్ట్రాలో నివసిస్తున్నట్లు ఎలాంటి ఆధారం లేదు కనుక ఆమెకు మహారాష్ట్రా బ్యాంకులలో ఉద్యోగం చెయ్యడానికి అవకాశం లేదు. అందు వలన ఆమె తరువాత ఆవకాశం కొరకు శోధించి టి.ఐ.ఎఫ్.ఆర్‌లో రీసెర్చ్ చేయడానికి నిర్ణయించుకున్నది. ఆమెకు బెంగుళూరులోని టి.ఐ.ఎఫ్.ఆర్‌కు చెందిన ఐ.ఐ.ఎస్.సిలో " అప్లికేషన్ మాథమెటిక్స్ " రీసెర్చ్ చేయడానికి అవకాశం లభించింది. మైథిలీ రామస్వామి రీసెర్చ్ చేయడానికి ఆమె తల్లితండ్రులు పరిపూర్ణ ప్రోత్సాహం అందించారు.

పరిశోధన[మార్చు]

మైథిలీ రామస్వామికి " ఐ.ఎన్.ఆర్.ఐ.ఎ " నుండి పారిస్‌లో థిసీస్ చెయ్యడానికి అవకాశం లభించింది. బంధువుల తరఫున వచ్చిన వత్తిడి కారణంగా మైథిలీ రామస్వామి తల్లితండ్రులు ఆమెను పారిస్ పంపడానికి అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమెను వారు పారిస్ వెళ్ళడానికి అనుమతించారు. ఆమె దాదాపు 3 సంవత్సరాల కాలం పారిస్‌లో విజయవంతంగా థిసీస్ కొనసాగించింది. థిసీస్ పూర్తిచేసిన తరువాత ఆమె తిరిగి బెంగుళూరు టి.ఐ.ఎఫ్.ఆర్ వచ్చింది. తరువాత ఆమె ఒక సంవత్సర కాలం " కాలిఫోర్నియా ఇంస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ "లో పోస్ట్ డాక్టొరల్ ఉద్యోగబాధ్యత పూర్తిచేసి తిరిగి బెంగుళూరు " టి.ఐ.ఎఫ్.ఆర్ "కు తిరిగివచ్చి అక్కడ ఆమె ఉపాధ్యాయురాలిగా, పరిశోధకురాలిగా కొనసాగుతోంది.

వివాహం[మార్చు]

మైథిలీ రామస్వామి భారతదేశం తిరిగి రాగనే అమిల్ కుమారుతో వివాహం జరిగింది. ఐ.ఐ.ఎస్.సి నుండి అనిల్ మైథిలీకి ప్రోత్సాహం, సహకారం అందిస్తూ వచ్చాడు. ఆ తరువాత వారిద్దరూ ఒకటిగా పనిచేసారు. తరువాత వారిద్దరూ భారతదేశం, విదేశాలలో పరస్పర సహకారంతో పనిచేసారు. మైథిలీ రామస్వామికి వసుధ అనే కుమార్తె ఉంది. ఆమె ఉద్యోగబాధ్యతలు వియవంతంగా నెరవేర్చడానికి కుటుంబం పూర్తి సహకారం అందించింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.