శోభనా నరసింహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభనా నరసింహన్
పౌరసత్వంభారతీయురాలు
జాతీయత Indian
రంగములుభౌతిక శాస్త్రము
చదువుకున్న సంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
హార్వర్డ్ విశ్వవిద్యాలయం

శోభనా నరసింహన్‌ కు చిన్నవయసులో గణితం, ఆంగ్లం అంటే ఆసక్తి ఉండేది. ఆమె చిన్నవయసు నుండి తాను గణితవేత్త, రచయిత ఔతానని చెప్పడం వినేవారిని ఆశ్చర్యచకితులను చేసేది. ఆమె తండ్రి గణితవేత్త తల్లి రచయిత కావడం వలన ఆమెకు ఇలాంటి లక్ష్యం కలిగిఉంటుంది. ఐ.సి.ఎస్.ఇ తరువాత సన్నిహితులామెను విజ్ఞాన శాస్త్రము, హ్యూమనటీ సంబంధిత అంశాన్ని ఎంచుకొమ్మని సలహా ఇచ్చారు. సాధారణంగా టాపర్‌గా విజయం సాధించిన వారు విజ్ఞాన శాస్త్రము‌ను ఎంచుకుంటారు కనుక వారలా సలహా ఇచ్చి ఉండచ్చని ఆమె అభిప్రాయపడింది. ఆమె విజ్ఞాన శాస్త్రము ప్రధానాంశంగా విద్యను కొనసాగించింది. శాస్త్రఙరాలిగా రచనకు అవకాశం ఉంటుందని భావించింది.

స్కూల్ , జూనియర్ కాలేజి విద్య[మార్చు]

స్కూల్ చదువులో ఆమె అన్ని విజ్ఞాన శాస్త్రము సబ్జెక్ట్ బాగా చదివినా ఫిజిక్స్ అంటే కొంత భయం ఉండేది. అంకు ఆమెకు ఫిజిక్ నేర్పించిన టీచర్ బోధనావిధానం కారణమని ఆమె అభిప్రాయ పడింది. ఉన్నత పాఠశాల ఫిజిక్స్ పరీక్షలకు ముందు తరువాత కూడా ఆమె మనోవ్యధకు గురైంది. తరువాత ఆమె ముంబయి లోని క్సేవియర్ జూనియర్ కళాశాలలో విద్యను కొనసాగిచింది. విజ్ఞాన శాస్త్రము గ్రూప్ లో ఫిజిక్స్ ప్రధానాంశం కావడం ఆమెను కొంత నిరాశకు గురిచేసింది. ఆమెకు రేడియోలో పిల్లల కొరకు తయారుచేస్తున్న కార్యక్రమానికి వచనం వ్రాసే అవకాశం రావడంతో ఆమె " రాబర్ట్ ఐన్‌స్టీన్ " గురించిన పుస్తకం చదివింది. ఈ సంఘటనతో ఆమె విద్యాభ్యాసం ఊహించని మలుపు తిరిగింది. ఆమెకు భౌతికశాస్త్రం, " క్వాంటం మెకానిజం " సంబంధిత విషయాల మీద ఆరాధన ఏర్పడింది. తరువాత కాలేజిలో ఆసక్తిగా వీటి గురించి అధికంగా తెలుసుకున్నది. ఇందుకు సుధీర్ పరంతపే, ఆర్.వి కామత్, మెల్కీ ఆలర్స్, జహంగీర్ మిస్త్రీ, రాజకుమార్ రావు వంటి ఉపాధ్యాయులు లభించడం అదృష్టమని ఆమె అభిప్రాయపడింది. ఆమెకు భౌతికశాస్త్రం మీద ఆరాధన రోజురోజుకు వృద్ధిచెందుతూ వచ్చింది. బాలికల పాఠశాలలో చదివిన ఆమె క్సేవియర్ జూనియర్ కలేజిలో 4 ఆడపిల్లలు 75 మంది మగపిల్ల మద్య కొనసాగడానికి ఇబ్బందిని ఎదుర్కొన్నది. కొత్త వాతావరణం కారణంగా ఏర్పడిన ఒంటరితనం ఆమెను గ్రంథాలయానికి దగ్గరచేయడం ఆమె భౌతికశాస్త్ర అధ్యయనానికి మెరుగులు పెట్టింది. గ్రంథాలయంలో ఆమె అధికంగా భౌతికశస్త్రఙల గురించి చదువుకున్నది. ఆమె 16వ ఏట ఆమెకు విజ్ఞాన శాస్త్రము పుస్తకాలను బహూకరించడం విశేషం.

కాలేజి విద్య[మార్చు]

ఆమె ఇంజనీరింగ్ బదులుగా భౌతికశాస్త్రం పట్ల ఆసక్తి చూపుతుందని సన్నిహితులు ముందే అనుకున్నట్లుగా అమే క్సేవియర్ కాలేజిలో బి.ఎస్.సీ ఫిజిక్స్ లో చేరింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి అమే ఎప్పుడూ విచారించలేదు. ఆమె తల్లితండ్రులు ఆమెకు ఎలాంటి నిర్బంధాలు విధించకుండా స్వయం నిర్ణయం తీసుకోవడానికి తగినంత స్వాతంత్ర్యం ఇచ్చారని ఆమె కథనాలు వివరిస్తున్నాయి. తరువాత ఆమె ముంబయి ఐ.ఐ.టిలో ఎం.ఎస్.సీ ఫిజిక్స్ చేసింది. అక్కడ ఆమెకు ఎస్.హెచ్ పాటిల్ ప్రేరణ కలిగించి ప్రోత్సహించాడు. తరువాత హార్వర్డ్ యూనివర్శిటీలో పి.హెచ్.డి చేయడానికి అవకాశం వచ్చింది.

హార్వర్డ్ యూనివర్శిటీ[మార్చు]

హార్వర్డ్ యూనివర్సిటీ ఫిజిక్స్‌లో మొదటిశ్రేణిలో ఉంది. ఆమె అక్కడ ఆస్ట్రో ఫిజిక్స్ కాని హై ఎనర్జీ కాని చేయాలనుకున్నది. అయినప్పటికీ ఒక సంవత్సరం తరువాత ఆమె " కండెంస్డ్ మేటర్ థియరీ "కి మారింది. తరువాత ఆమె అందులో కొనసాగింది. పి.హెచ్.డి తరువాత ఆమె యు.ఎస్ లోని " నేషనల్ లేబరేటరీ " , జర్మనీ దేశంలో ఉన్న బెర్లిన్ లోని ఫ్రిట్జ్- హాబర్ ఇన్సిట్యూట్‌లో పనిచేసింది. ఆమె పనిచేస్తూ అధ్యయనం కొనసాగిస్తూ స్నేహితులను చేర్చుకుని విదేశీవాసం ఆనందంగా గడిపినట్లు ఆమె వివరించింది. అయినప్పటికీ ఆమె భారతదేశమే తన ఇల్లని భావించి బెంగుళూరులోని " జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాంస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ " ఇచ్చిన అవకాశాన్ని ఆనందంగా అందుకుని పనిచేయడానికి భారతదేశం తిరిగి వచ్చింది. అక్కడ ఆమె సేవలు కొనసాగుతున్నాయి. తరువాత ఆమె " ఇంషియో డెంసిటీ ఫంక్షనల్ థియరీ " పనిచేస్తూ ఉంది. అదనంగా ఆమె " నానో సిస్టంస్ " అధ్యయనం చేయాలని ఆసక్తికలిగింది. సైజులో మార్పులు కలిగినప్పుడు స్ట్రక్చరల్, ఎలెక్ట్రానిక్, కెమికల్, మెకానికల్, థర్మల్ మార్పులను అధ్యయనం చేయాలన్న ఆసక్తి కలిగింది.

సంతృప్తి[మార్చు]

చిక్కుప్రశ్నలను విడదీసిన అనుభూతిని ఇచ్చే పరిశోధనల పట్ల ఆమెకు అత్యంత ఆసక్తి కలిగింది. ఆమె తనవృత్తిని అభిమానించింది. ఆమె ఆనందంగా చేస్తున్నపనికి పారితోషికం అందుకోవడం ఆమెను ఆశ్చర్యానికి గిరిచేస్తుంది. మేధాపరమైన స్వాతంత్ర్యాన్నిచ్చే పరిశోధనలు ఆమెకు సంతోషాన్నిచ్చాయి. విఙానాన్ని ఇతరులకు అందించడాన్ని ఆనందించింది. వింరంతరమైన విఙానతృష్ణ దానివెంట పయనించడం ఆమెకు తృప్తిని కలిగించింది. ఒకప్పుడు భౌతికసాస్త్రానికి తగదని భావించబడిన ఆమె భౌతికశాస్త్రంలో ఉన్నతస్థితికి రావడం ఆమెను విస్మయపరచింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.