Jump to content

జి.వి. సత్యవతి

వికీపీడియా నుండి
జి.వి. సత్యవతి
G V Satyavati
జి.వి. సత్యవతి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

జి.వి. సత్యవతి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కు 1994 నుండి 1997 వరకు డైరక్టరు జనరల్ గా పనిచేశారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

జి.వి. సత్యవతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఏడు మంది సహోదరులు ఉన్నారు. ఆమె ఉన్నత పాఠశాల అరియు ఇంటర్‌డియట్ పరీక్షలలో సైన్స్, గణితంలో ఉత్తరర్యాంకు సాధించినప్పటికీ ఆమెకది మైసూరు మెడికల్ కాలేజీలో స్థానం సంపాదించడానికి అది తక్కువే అయింది. తరువాత ఆమె తండ్రి ఆమెను మైసూరులోని " కాలేజ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ " ప్రింసిపల్ డాక్టరుగా ప్రాక్టిస్ చేస్తున్న ప్రొఫెసర్ సి. ద్వారకానాథ్ వద్దకు తీసుకువెళ్ళి మాట్లాడిన తరువాత ఆమెకు మెడికల్ కాలేజ్ ప్రవేశం సాధ్యపడింది. మెడికల్ కాలేజిలో ఆమె పాఠ్యాంశం " ఇంటిగ్రేటెడ్ విటల్ ఎలెమెంట్స్ ఆఫ్ ఆయుర్వేద అండ్ వెస్ట్రన్ మెడిసన్ ". అలాగే ప్రఖ్యాత ఫిజిస్ట్ ప్రొఫెసర్ సీబియా మార్గదర్శకంలో మోడ్రెన్ సైంసెస్ అడ్వాంస్ కోర్సులు ఉన్నాయి. రెండు సంవత్సరాల కాలేజి జీవితం ఆమెకు సైన్సు విచారణ, రీసెర్చ్ ఆసక్తి కలిగించింది. ఫైనల్ ఇయర్‌లో టాపర్‌గా వచ్చినందున ఆమెకు అనుకోకుండా మైసూరు మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్ ప్రవేశం లభించింది.

రీసెర్చ్‌కి నిరుత్సాహం

[మార్చు]

జి.వి. సత్యవతి రీసెర్చ్ ఆసక్తిని సహాధ్యాయులు పరిచయస్తులు కుటుంబ సభ్యులు నిరుత్సాహపరిచారు. 1960 స్త్రీపురుష భేదం స్పష్టంగా కనిపించేది. మైసూరు వంటి నగరాలలో సైతం సైకిల్ తొక్కుతూ కాలేజికి వెళ్ళే ఆడపిల్లలు హేళనకు గురైయ్యేవారు. ఒక ఎగ్జామినర్ ఆమెను " సైంస్‌లో ఆదర్శం ఎవరు ? " అని ప్రశ్నించినప్పుడు ఆమె " మెరీ క్యూరీ " అని జవాబు చెప్పినప్పుడు ఎగ్జామినర్ " మెరీ క్యూరీ భర్తకు సహకరించడం కంటే చేదింది ఏదీ లేదు. ఆమె నీకు ఆదర్శం ఎలా అయింది ? " అని అడగడం భారతీయ సమాజంలో పురుషాధిఖ్యతకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడింది. ఆమె వారి కుటుంబంలో పైచదువుకు వెళ్ళాలన్న కోరిక తెలపగానే కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. " డాక్టరుగా ప్రాక్టిస్ చేయకుండా టీచింగును ఎందుకు ఎంచుకుంటున్నావు ? . భారతదేశంలో ఆడపిల్లలు మెడికల్ రీసెర్చ్ చేసి చేసేదేముంది.? " అని ప్రశ్నించారు.

రీసెర్చ్

[మార్చు]

ఎలాగైతేనేం ప్రొఫెసర్ ద్వారకానాథ్ సలహాతో జి.వి. సత్యవతికి ఆమె తండ్రి మద్దతు తెలుపుతూ ఆమె వారణాశి లోని " బెనారస్ హిందూ యూనివర్శిటీ"కి 1964లో అడ్వాంస్డ్ స్టడీస్ కొరకు అభ్యర్థించడానికి అనుమతి ఇచ్చాడు. బి.హెచ్.యులో ఐదు సంవత్సరాల అధ్యయనం పూర్తిచేసిన తరువాత బి.హెచ్.యు ఆమెకు అద్భుతమైన సౌకర్యములతో ఉన్నతవిద్య అధ్యయనం కొరకు అవకాశం కల్పించింది. సహాధ్యయులకిది రవంత అసూయ కలిగించినా ఢిల్లీ నుండి ప్రొఫెసర్ ద్వారకానాథ్ మానసికంగా మద్దతు ఇచ్చాడు. అలాగే వారణాశి నుండి ప్రొఫెసర్ కె.ఎన్. ఉదుపా, కొంత మంది సహాధ్యాయులు కూడా సహకారం అందించారు. బి.హెహ్.యులో ఆమె కఠినశ్రమ ఫలితంగా మెడిసిన్ సంబంధిత రెండు విభిన్న అంశాలకు ఆమెకు రెండు డాక్టరేట్లు వచ్చాయి. ఆయుర్వేదంలో ఆమె మొదటి డాక్టొరేట్ ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. రెండవ డాక్టరేట్ ఫార్మసీకి లభించింది. ఫార్మసీలో ఆమెకు గైడుగా ఉన్న డాక్టర్ డి.ఎన్ ప్రసాదును ఆమె తరువాత వివాహం చేసుకున్నది.

జి.వి. సత్యవతి 1969లో ఆమె ఢిల్లీ ఐ.సి.ఎం.ఆర్‌లో ప్రొఫెసర్ ద్వారకానాథ్‌ వద్ద అసిస్టెంటుగా మూలికాఔషధాల రీసెర్చ్ విభాగంలో ఉద్యోగబాధ్యతలు స్వీకరించింది. 1969 నుండి 1986 వరకు ముగ్గురి గైడుల సహాయంతో ఐ.సి.ఎం.ఆర్‌లో రీసెర్చ్, నిర్వహణా బాధ్యతలు విజయవంతగా పూర్తిచేసింది. జి.వి. సత్యవతి యువ రీసెర్చరుగా ప్రారంభించి పరిపక్వ శాస్త్రవేత్తగా, రీసెర్చ్ కోర్డినేటరుగా అభివృద్ధి సాధించింది. అలాగే 1971-1987 మంద్య కాలంలో ఐ.సి.ఎం.ఆర్‌లో సెంట్రల్ ప్లానింగ్, పాలసీ మేకింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూటింగ్, రివ్యూయింగ్, మానిటరింగ్ మెడికల్ రీసెర్చ్ లకు బాధ్యత వహించిన కాలం ఆమె జీవితంలో స్వర్ణయుగమన్నది ఆమె భావన.

ప్రచురణలు

[మార్చు]

జి.వి. సత్యవతి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పత్రికకు 18 సంవత్సరాల కాలం సంపాదత్వం వహించింది. అలాగే ఆమె వ్రాసిన మెడికల్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా సంబంధిత 2 ఎంసైక్లోపీడియా వాల్యూంస్ 1976- 1987లో ప్రచురించబడ్డాయి. బయోమెడికల్ రీసెర్చ్ విభాగంలో హెచ్.ఆర్.డిగా బాధ్యతలు వహించింది. 1970 నుండి ఆమె ఆయుర్వేద ఔఅధదాల పరిశోధనలకు గుర్తింపు లభించగా 1985-1986 లలో పెద్ద ప్రణాళికతో ఆయుర్వేద ఔషధాల తయారీ ప్రారంభం అయింది. 1984-1997 వరకు జి.వి. సత్యవతి ఐ.సి.ఎం.ఆర్ డైరెక్టర్ జనరల్‌గా నియమించబడింది. మెడికల్ సైంటిస్టులకు ఇది శిఖరాగ్ర పదవి. అందులో ఆమె మొదటి డైరెక్టర్ జనరల్ అన్న ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమెకు వృత్తిరిఒత్యా శిఖరాగ్రానికి చేరడానికి ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ, సైంటిఫిక్ సమాజంలోని అత్యధికుల సహకారం లభించింది.

మూలాలు

[మార్చు]
  1. "జి.వి.సత్యవతి డైరక్టరు జనరల్ గా" (PDF). Archived from the original (PDF) on 2012-01-27. Retrieved 2014-01-15.

వెలుపలి లింకులు

[మార్చు]