స్రుబబతి గోస్వామీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్రుబబతి గోస్వామీ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

స్రుబబతి గోస్వామీకి గణితం, సైన్న్‌లందు ఆసక్తి అధికం. అలాగే ఉన్నత విద్యాధ్యనానికి ఆమె సైన్స్‌ను ఎంచుకున్నది. ఆమె పి.హెచ్.డి కొరకు న్యూట్తినో ఫిజిక్స్‌ను ప్రధానాంశంగా ఎంచుకుని " యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా "లో ప్రొఫెసర్ అమితవ చౌదరితో కలిసి పనిచేసింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ రంగంలో పనిచేయడం ఆమెకు ఆనందం కలిగించింది. ఆమె రీసెర్చ్ అధ్యయనం చేసేసమయంలోనే సహ పరిశోధకుడిని వివాహంచేయాలనిర్ణయంతీసుకున్నది.

డాక్టరేట్[మార్చు]

వివాహం అయిన రెండుసంవత్సారాల తరువాత ఆమెభర్త పనిచేస్తున్న చోట పోస్ట్ డాక్టరల్ పొజిషన్ కొరకు అభ్యర్థించింది. ఎన్నిక నిర్ణయం జరగడానికి ముందు ఆమెకు అక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేయబడింది. అయినప్పటికీ తరువాత అనధికాతరికంగా జరిగిన ఏర్పాటుతో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. అందువలన ఆమె ఇతర ఇంస్టిట్యూట్‌కు అభ్యర్ధనలు పపించింది. తరువాత ఆమె " టి.ఐ.ఎఫ్.ఆర్" ఒక అవకాశాన్ని అందుకున్నది. అయినప్పటికీ ఆమె ప్రసవం సమయం దగ్గరపడినందున ఆవకాశాన్ని వదులుకుని తిరిగి పుట్టింటికి చేరుకుంది. ఆమె వెళ్ళిన తరువాత ఆమె ఏడుమాసాలుగా ఎదురుచూసిన ఇంటర్వ్యూ జరుగింది. ఆమె ఎలాగో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగానికి ఎన్నిక చెయ్యబడింది.ఆమె 1997 జూలై 27న కుమార్తెకు జన్మనిచ్చింది.

వృత్తి జీవితం[మార్చు]

తరువాత 1998లోఆమె భర్త పనిచేస్తున్న ఇంస్టిట్యూట్‌లో పోస్ట్ డాక్టరేట్‌ పనిలో బాధ్యతలు చేపట్టింది. పసిబిడ్డను పెంచుతూ ఫిజిక్స్ సంబంధిత ఉద్యోగబాధ్యతాను నిర్వహించడం అంత సులువైనది కాదని స్రుబబతి అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఒక సంవత్సరం ఉద్యోగబాధ్యతలు నిర్వహించిన తతువాత ఆమె పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను అందుకున్నది. అయినప్పటికీ అందులో క్రమములేదని, సమయపాలన తక్కువగా ఉన్నదని లోపాలు ఎత్తి చూపడం వలన ఫెలో షిప్ పొడిగించబడలేదు. ఇది వృత్తి జీవితానికి తగిలిన గట్టిదెబ్బ.

నూతనోత్సాహం[మార్చు]

అయినప్పటికీ ఒకసంవత్సరం అనంతరం తిరిగి తీవ్రంగా శ్రమించి తన ఫెలో షిపును తిరిగి ప్రారంభించింది. చివరకు శలవుదినాలలో కూడా ఇంస్టిట్యూట్లుకు హజరైంది. ఆమె ఆత్మవిశ్వాసంతో పనిచేసిన కారణంగా చివరికి ఫెలోషిప్ కొనసాగించబడింది. 2000 నాటికి ఆమె సహా ఇంస్టిట్యూట్‌లో విజిటింగ్ ఫెలోగా చేరింది. అప్పటినుండి ఆమె పని నిరాఘాటంగా సాగింది. అందుకు ఆమె కుటుంబం ఆమెకు సహకరించింది. తరువాత కుమార్తెను స్కూలులో చేర్చడానికి సహా ఇంస్టిట్యూట్‌ నుండి శలవు తీసుకుని తిరిగి భర్త ఉన్న ప్రదేశానికి చేరుకుంది. అయినప్పటికీ తాను చేస్తున్న పనిని ఇంటివాద్ద్ద ఉంటూ కొనసాగించింది. ఆమె వ్రాసిన పరిశోధనా పేపర్ గొప్పగా గుర్తించబడింది. అందుకు సహకరించిన సహాద్యాయులైన సంధ్యాచౌదరి, అభిజిత్ బందోపాద్యాయాలపట్ల ఆమె కృతఙ తెలిపింది

పోస్ట్ డాక్టరేట్[మార్చు]

తరువాత ఆమె పోస్ట్ డాక్టరేట్ పొజిషన్‌కు అవ్హ్యర్ధించగా పోర్చుగల్, స్పైన్, జపాన్ నుండి అవకాశాలు వచ్చాయి. అదే సమయం ఆమె " హెచ్.ఆర్.ఐ"గా వచ్చిన అవకాశాన్ని అందుకుని బాధ్యతను చేపట్టింది.తరువాత ఆమె వృత్తిజీవితంలో వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు. న్యూట్రినో ఫిజిక్స్‌లో అప్పుడే సరికొత్త పరిశోధనలు చేపట్టబడ్డాయి. ఈ రంగలో జరుగుతున్న అభివృద్ధి పనులు అంతర్జాతీయ గుర్తింపు పొందుతూ ఉన్నాయి. 1996-2002 ల మద్య ఎదుర్కొన్న సమస్యల నుండి విడిపడి ఆతరువాత జీవితం అభివృద్ధిపధంలో సాగింది. ఆమె ఉద్యోగరీత్యా భర్తకు దూరంగా గడపవలసిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఒకరి కొరకు త్యాగంచేస్తూ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేచోట అసంతృప్తితో గడిపేకంటే దూరంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా అభ్యున్నతి సాధించడం మేలన్నది ఆమె భావన. ఆమె భావాలను ఆమె భర్తకూడా గౌరవించాడు.

భర్త సహకారం[మార్చు]

స్రుబబతి భర్త భార్యకు పూర్తి సహకారం అందించాడు. భర్త సహకారంతో ఆమె వృత్తిజీవితంలో తనకంటూ ఒక స్థానం ఏరరచుకున్నది. వారు సంతృప్తికరమైన జీవితం ఏర్పరచుకోవడంలో ఆనందం అనుభవించారు. 2007లో సుబ్రబతి తన భర్త పనిచేస్తున్న ఇంస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగావకాశం అందుకున్నది. ఆతరువాత ఆమె భర్తతో కుమార్తెతో ఒకే ప్రదేశంలోనే గడుపుతూ ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.