రాజేశ్వరీ ఛటర్జీ
రాజేశ్వరీ చటర్జీ Rajeswari Chatterjee | |
---|---|
దస్త్రం:Rajeshwari Chatterjee image.jpg | |
పౌరసత్వం | భారతీయురాలు |
జాతీయత | ![]() |
రంగములు | మైక్రోవేవ్ ఇంజినీరింగ్ |
వృత్తిసంస్థలు | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
చదువుకున్న సంస్థలు | మైసూర్ విశ్వవిద్యాలయం మిచిగన్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | విలియం జి. దోవ్ |
ముఖ్యమైన పురస్కారాలు | ముమ్మడి కృష్ణరాజాయ్యర్ అవార్డు |
ప్రొఫెసర్ రాజేశ్వరీ చటర్జీ M.Sc., Ph.D. (ఆంగ్లం: Rajeswari Chatterjee) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసిన ఒకేఒక్క మహిళా ప్రొఫెసర్.
బాల్యం, విద్య[మార్చు]
రాజేశ్వరి ప్రాథమిక విద్య బెంగుళూరు బసవన్న గుడిలోని ఆమె అమ్మమ్మ అయిన కమలమ్మ గారి ద్వారా ప్రారంభింపబడిన మహిళా సమాజ్ లోని స్పెషల్ ఇంగ్లిష్ స్కూల్‌లో జరిగింది. ఆమె అమ్మమ్మ అప్పట్లో మైసూర్ రాష్ట్రంలో డిగ్రీ చదవడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది. రాజేశ్వరిపై ఆమె ప్రభావం చాలా ఉండేది. ఆమె తన బి.ఎస్సి డిగ్రీని సెంట్రల్ కాలేజ్, బెంగళూర్ నుండి 1939లో పొందినది. ఎం.ఎస్సి మైసూర్ యూనివర్సిటీ ద్వారా పొందినది. ఈమె బి.ఎస్సిలో పస్ట్ ర్యాంకుకు గాను ముమ్మడి కృష్ణరాజాయ్యర్ అవార్డు పొందినది. ఎం.ఎస్సిలో పస్ట్ ర్యాంకుకు గాను నారాయణ అయ్యంగార్ అవార్డు పొందినది. 1945, 1947 మద్య కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ నుండి డిల్లీ గవర్నమెంట్ బాగా చదివే విద్యార్థుల కొరకు విదేశాలకు వెళ్ళి చదువుకొనేందుకు ఉద్దేశించిన స్కాలర్షిప్ హక్కులు పొందినది. దని ద్వారా ఆమె ఎలక్ట్రానిక్స్, దాని అనుభందకాలు అనే దానిపై ఆ స్కాలర్ షిప్ పొంది మిచిగాన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందినది. అప్పటి పరిస్థితులలో మహిళకు చదువుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుండేవి. ఆమె తన అమెరికా ప్రయాణం కొరకు 30 రోజులు సింగపూర్ మీదుగా సముద్రం మీద ప్రయాణం చేసి మిచిగాన్ చేరినది. ఆమె తన మాస్టర్ డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 1947లో పొందినది. తదనంతరం ఆమె భారతీయ ప్రభుత్వ అదేశానుసారం తన ట్రైనింగ్ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్, వాషింగ్‌టన్ డి.సి.లోని రెడియో ప్రీక్వెన్‌సీ కొలతల విభాగంలో 1949లో ఎనిమిది నెలలు పనిచేసింది. తరువాత ఆమె తిరిగి మిచిగాన్ వచ్చి తన పి.హెచ్.డి. కొరకు ప్రొఫెసర్ విలియం జి. దోవ్‌తో కలసి పనిచేసి 1953లో పి.హెచ్.డి. సాధించింది.
ప్రయోగాలు, ఉద్యోగాలు[మార్చు]
ఆమె తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఐ.ఐ.సి.ఎస్.) లో ఫేకల్టీగా చేరింది. చాలా సంవత్సరాలుగా పరిచయం ఉండి అక్కడే ఫేకల్టీగా పనిచేస్తున్న శిశిర్‌కుమర్ చటర్జీను పెళ్ళిచేసుకొన్నది. అలా ఆమె రాజేశ్వరీ చటర్జీగా మారినది. ఐ.ఐ.సి.ఎస్.లో పనిచేసిన ఒకే ఒక్కస్త్రీ ఆమె మాత్రమే. మైక్రోవేవ్ ఇంజనెరింగ్ విభాగంలో ఆమె భర్తతో కలసి ప్రప్రథమంగా భారతదేశంలో రీసెర్ఛ్, బోధన ప్రారంభించింది. ఆ కాలంలో వారు రీసెర్చ్ కోసం ఒక లాబొరేటరీ కూడా స్థాపించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 20 మంది విద్యార్థులకు పి.హెచ్డి పట్టాలు వచ్చేందుకు శిక్షణైచ్చారు.
అవార్డులు[మార్చు]
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా బెస్ట్ రీసెర్చ్ పేపర్‌కు గాను లార్డ్ మౌంట్‌బాటన్ బహుమతి.
- * ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా బెస్ట్ రీసెర్చ్ పేపర్‌కు గాను జె.సి.బోస్ మొమొరియల్ బహుమతి.
- రీసెర్చ్, శిక్షణ కొరకు రాం లాల్ వాద్వా అవార్డు.
ఇతర విశేషాలు[మార్చు]
- రాజెశ్వరీ చటర్జీకి ఇందిరాచటర్జీ అనే కుమార్తె ఉంది. ఈమె నోయిడా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.
మూలాలు[మార్చు]
- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.
- http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/on-her-own-terms/article805338.ece