మహారాణి చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాణి చక్రవర్తి
మహారాణి చక్రవర్తి
జననం1937 జనవరి 2
భాగల్‌పూర్, బీహార్
నివాసంకోల్‌కత, పశ్చిమ బెంగాల్
జాతీయతభారతీయులు
రంగములుజెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యూలార్ బయాలజీ
డాక్టొరల్ విద్యార్థులుప్రో. జహర్ కంటి దేబ్
ముఖ్యమైన పురస్కారాలువై. స్. నారాయణ రావ్ అవార్డ్, జె.సి. సెన్‌గుప్తా మెమొరియల్ అవార్డ్

మహారాణి చక్రవర్తి ఒక భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు. ఈమె ఆసియా, సుదూర తూర్పు ప్రాంతంలో 1981 లోనే రీకాంబినెంట్ DNA పద్ధతులపై మొదటి ప్రయోగశాల కోర్సు ఏర్పాటు చేసారు.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

మహారాణి చక్రవర్తి కోల్‌కతాలో 1937 జనవరి 2 న జన్మించారు. తాతగారి ప్రభావం వలన శాస్త్రం, గణితం పై ఆసక్తితో పెరిగారు. 1950 లో మెట్రిక్యులేషన్ చేసిన తరువాత ఈమె B.Sc కోసం కోలకతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో చేరారు. 1956 లో ఎం.యస్సీ (బోటనీ), 1961 లో డి.ఫిల్ (బోటనీ) డిగ్రీలు [1] అందుకున్న తర్వాత బయో కెమిస్ట్రీలో డి.ఎస్.సి. (1973) పట్టా పొందారు. తదనంతరం అమెరికా వెళ్ళీ పరిశోధనలు నిర్వహించారు.

పరిశోధనలు[మార్చు]

మహారాణి న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో అత్యున్నత స్థాయి శిక్షణ పోందారు. కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ, ఇంటర్నేషనల్ లేబొరేటరీ ఆఫ్ జనరల్ అండ్ బయో ఫిజిక్స్ (ఇటలీ) లో పరిశోధనలు జరిపారు. యూనివర్శిటీ ఆఫ్ యేలె, న్యూ హవెన్, కనెక్షన్, అమెరికా, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మూస్టన్; ఇన్‌స్టిట్యూత్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మైక్రో బయాలజీ, యూనివర్శిటీ ఆఫ్ పారిస్ - సద్ - ఓర్నే (ఫ్రాన్స్) మొదలైన ప్రతిష్ఠాత్మక సంస్థలలో పరిశోధనలు చేశారు.

మహారాణి చక్రవర్తి గారు బనారస్ హిందూ యూనివర్శిటిలో మాలిక్యులర్ బయాలజీ యూనిట్ ను అనూహ్య రీతిలో అభివృద్ధి చేసి, "సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్"గా తీర్చిదిద్దారు. దీనికి ప్రపంచ దేశాలన్నిటా ఘనమైన గుర్తింపు లభించింది. అంతేకాదు యునెస్కో ఐసిఆర్‌ఓలు కూడా గుర్తించాయి. సాధారణంగా జెనెటిక్ ఇంజనీరింగ్ గా వ్యవహరిస్తున్న అంశాన్ని "రీకాంబినేషన్ డి ఎన్ ఎ టెక్నిక్స్"గా దాని ప్రాధాన్యతను వివరించి, మరింతగా వెలుగులోకి తీసుకు రావడంతో ఈ రోజున మన దేశంలో జన్యుశాస్త్రం కీలక పాత్ర పోషించుతున్నది. జెనెటిక్ ఇంజనీరింగ్ రంగంలో అపూర్వ పరిశోధనలు చేసి, పలు పరిశోధనాత్మక వ్యాసాలను, ప్రతిపాదిత సిద్ధాంతాలను అంతర్జాతీయ పత్రికలలో వెలువరించారు. దేశ విదేశ విజ్ఞాన సదస్సులలో తమ ఉపన్యాసాలను అందించారు.

డాక్టర్ మహారాణి గారికి డిగ్రీ విద్యాస్థాయి నుంచే ప్రభుత్వ స్కాలర్‌షిప్ లు అందాయి. బి.యస్సీ (ఆనర్స్) లో అద్వితీయమైన ప్రతిభ కనబరుస్తూ యూనివర్శిటీ స్థాయిలో ప్రథమురాలిగా ఉత్తీర్ణత సాధించి నాగ్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.

అంతర్జాతీయ ఖ్యాతి[మార్చు]

డాక్టర్ మహారాణి గారి పరిశోధనాంశాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ (అమెరికా) లోని హ్యూమన్ జెనెటిక్స్ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్ (1968-69) గా, బనారస్ హిందూ యూనివర్శిటీ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి బయోకెమిస్ట్రీ విభాగానికి సీనియన్ రీసెర్చి ఆఫీసరుగా ( 1969 - 72), అంతర్జాతీయ పాఠ్య ప్రణాళిక "జెనెటిక్స్ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ది బాక్టీరియల్ వైరస్" బోధకురాలుగా (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు) (1986), 15 వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ జెనెటిక్స్ కు నేతృత్వం, రీసెర్చే అడ్వయిజరీ కమిటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్ వైరోలజీ, పూణే) లకు సారథ్యం వహించారు. ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలకు పాఠ్య ప్రణాళికలు సమకూర్చారు. యు.జి.సి వారి బయో సైన్స్ పానెల్ కు కన్వీనర్ గా ఉంటూ, ప్రత్యేక కమిటీని నెలకొల్పి జీవశాస్త్ర రంగాలకు ఎనలేని అభివృద్ధి చేకూర్చారు.

సేవలు[మార్చు]

డాక్టర్ మహారాణి గారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్ గా, మాలిక్యులర్ బయాలజీ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉండి పదవీవిరమణ చేశారు. జీవరసాయన శాస్త్ర రంగంలో, పరమాణు జీవశాస్త్రం, జన్యు శాస్త్ర రంగాలలో విశేష ప్రతిభ కనవరచి పలు అవార్డులు, రివార్డులు పొందారు.

ఆమె పరిశోధనా పనిలో భాగంగా, అజొటోబాక్టెర్ వినెలాండీ నుండి ప్రత్యేక తయారీతో "సెల్ ఫ్రీ ప్రోటీన్"ను సంశ్లేషణచేసి ప్రదర్శించారు. ఆమె న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ లోని బి.ఎల్.హోరెకెర్ లాబొరేటరీలో ఎంజైం రసాయన శాస్త్రంలో పోస్టు డాక్టరల్ శిక్షణ పొందారు. లాంగ్ ఐలాండ్, యు.ఎస్.ఎ లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ వద్ద ఆమె బాక్టీరియా జెనెటిక్స్, వైరాలజీలో ప్రత్యేక శిక్షణ పొందారు.[2] 1968 నుండి 1969 ల మధ్య యు.ఎస్.ఎ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్, అన్న్ హార్బర్, మిచిగాన్ వద్ద గల ప్రొఫెసర్ మైరోన్ లెవిన్ లాబొరేటరీలో పనిచేశారు. ఆమె 1000S యొక్క స్థిరమైన అవక్షేపం కలిగిన సాల్మోనియా టైఫిమురియమ్ యొక్క సంకిష్ట పొరను రూపొందించారు. ఈమె DNA సంస్లేషనలోనే కాకుండా RNA సంస్లేషణలో కూడా కృషిచేశారు. తన పరిశోధనల అనంతరం ఆమె భారతదేశానికి వచ్చి బోస్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. ఏకకణజీవుల జీవక్రియ యొక్క నిబంధనలు పరిశోధన చేపట్టారు. తర్వాత ఆమె బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోని బయోకెమిస్ట్రీ విభాగంలో చేరారు. బనారస్ లో ఆమె లైసోజెనీ, విచ్ఛిన్నం చేయించుకుంటున్న కణాల మధ్య బయోకెమికల్ డిఫరెన్సెస్ పై పరిశోధన చేపట్టారు.

గౌరవ పురస్కారాలు[మార్చు]

  • ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వారి మెరిట్ సర్టిఫికెట్ (1975–76)
  • ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, BHU యొక్క ఉత్తమ పరిశోధన అవార్డు (1979)
  • ICMR వారి క్షనిక ఓరేషన్ అవార్డు (1979)
  • ICMR వారి నారాయణ్ రావు అవార్డు (1981) Y.S
  • మెడికల్ కౌన్సిల్, భారతదేశం యొక్క హరి ఓం ఆశ్రమం అలెంబిక్ రీసర్చ్ అవార్డు (1981)
  • J.C గుప్తా మెమోరియల్ అవార్డు
  • INSA వారి ప్రొఫెసర్ దర్శన్ రంగనాధన్ మెమోరియల్ అవార్డు (2007).

ఆమె తోటి శాస్త్రవేత్త డాక్టర్ దేబి ప్రొసాద్ బర్మాను వివాహమాడారు. సంతానం ఇద్దరు.[1]

అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన పరిశోధనాత్మక గ్రంథాలు[మార్చు]

  1. Polyol dehydrogenase of Candida utilis I.DPN - lInked polyol dehydrogenase, methods in Enzymology ( 1966)
  2. Role of siegene in the transient depression of macromolecular synthesis in phase P22 infected salmonella typhimurium, Nature New Biol (1971)
  3. MB78, a virulent bacteriophage of Salmonella typhimurium, Virol (1982)
  4. Construction of cloning vector from naturally occuring plasmid of Salmonella typhimurium (1955)
  5. Identification of a strong promoter of bacteriophase MB 78 that lacks consensus sequence around minus 35 region and interacts with phase specific facors, Virus Genes (1977)

సూచికలు[మార్చు]

[1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.

  1. 1.0 1.1 1.2 Chakravorthy, Maharani. "Why and how I became a scientist" (PDF). Lilavati's daughters. Retrieved 25 November 2012.
  2. "Author Profile : Maharani Chakraborthy". Pearson. Retrieved 25 November 2012.

యితర లింకులు[మార్చు]