రాధా బాలకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా బాలకృష్ణన్
రాధా బాలకృష్ణన్
జననంరాధా బాలకృష్ణన్
ఇతర పేర్లురాధా బాలకృష్ణన్
వృత్తిఅరేఖీయ గతిశాస్త్రము, భౌతికశాస్త్ర అనువర్తనములు,క్లాసికల్ అవకలన రేఖాగణిత సంధానాలు
ప్రసిద్ధిభౌతిక శాస్త్రవేత్త

రాధా బాలకృష్ణన్ భారత దేశానికి చెందిన మహిళా భౌతిక శాస్త్రవేత్త. ఈమె 1970 లో బ్రాండీస్ లో పి.హెచ్.డి చేశారు. ఆమె ఫుల్‌బ్రైట్ అవార్డు, తమిళనాడు శాస్త్రవేత్తల అవార్డు, దర్శన్ రంగనాధన్ మెమోరియల్ లెక్చర్ అవార్డు పొందిన శాస్త్రవేత్త. ఈమె ప్రస్తుతం చెన్నైలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటికల్ సైన్సెస్ లో నాన్ లీనియర్ డైనకిక్స్, అప్లికేషన్స్ ఇన్ ఫిజిక్స్ విభాగంలో పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

1957 లో ఆమె 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు న్యూఢిల్లీలో ఎకో-ఎడ్యుకేషనల్ స్కూల్ లో 9 వ తరగతిలో చేరారు. తర్వాత ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ యొక్క ప్రేరణతో సైన్స్ గ్రూపులో ప్రవేశించింది.ఆమెకు శాస్త్రసంబధ విషయాలపై మక్కువ ఎక్కువ ఉందేది. ఆమె సైన్స్ చదువుటను కొనసాహించింది. ఆమె 1960 లో బోర్డ్ పరీక్షలు ఉత్తీర్ణురాలయింది. తదుపరి ఆమెకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ఆనర్స్ లో ప్రవేశం లభించింది. ఆకోర్సు భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ కోర్సుకు కొద్ది మంది మహిళలే దరఖాస్తుచేసేవారు.కుటుంబంలో అందరూ ఈ కోర్సు కష్టమని భావించినా ఆమె భౌతికశాస్త్రం పట్ల అభిరుచి కలిగియుండి ఆ కోర్సులోనే ప్రవేశించారు. 1965 లో ఎం.యస్సీ పూర్తి చేశారు. అందరి మహిళల లాగే తల్లిదండ్రులు వివాహం చేయుటకు సిద్ధపడ్డారు కానీ ఆమె యు.ఎస్లో పి.హె.డి పూర్తి చేయాలని సంకల్పించింది. ఆమె కుటుంబం విశాల దృక్పధం కలవారైనందున ఆమెకు ప్రోత్సాహం అందించారు. ఆమె బ్రాండీస్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి ప్రారంభించారు. 1970 లో ఆమె ఘన హీలియం (2He3) లో హీలియం (2He4) యొక్క మలినాల ప్రభావాన్ని గూర్చి మొదటి సిద్ధాంతాన్ని (క్వాంటం స్ఫటికాల గూర్చి అతి ముఖ్యమైన అధ్యయనం) ప్రవేశపెట్టారు. ఆమె సలహాదారు అయిన ప్రొఫెసర్ రాబెర్ట్ లాంజ్ మంచి ప్రేరణను అందించటంటో పాటు స్వేచ్ఛను యిచ్చారు. యు.ఎస్.లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేయుటకు ఆమెకు సహాయపడ్డారు.ఆమె ఇండియా వచ్చునపుదు ఆయన ఆమెతో " "ఒక మహిళ భౌతికశాస్త్రవేత్త గా, మీరు సగం గుర్తింపు పొందడానికి ఒక వ్యక్తి కంటే రెండు రెట్లు ఎక్కువ పని చేయవలసిన అవసరం ఉంది. మహిళల ఎదుగుదలపై పలువురు పురుషులు పక్షపాతం భయంకరమైన ఉంటుంది." అన్నారు.

పరిశోధనలు

[మార్చు]

1980 లలో ప్రొఫెసర్ పి.ఎం.మాథ్యూస్ మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర విభాగంలో పనిచేయుటకు సహకరించారు. 1982 నుండి 1987 ఆమె రీసెర్చి అసోసియేట్ (CSIR, UGC),గా యున్నారు. అపుదు IMSc డైరక్టరుగా ప్రొఫెసర్ ఎ.సి.జి.సుదర్శన్ గారు ఉన్నారు. ఆయన సహకారంతో అచట శాశ్వత స్థానం 1987 లో దక్కింది. 1980 లో ఆమె నాన్ లీనియర్ దృగ్విషయాలను, సోలిటన్స్ పై పరిశోధనలు ప్రారంభించారు.ఆ రంగం తర్వాతి కాలంలో ప్రధాన పరిశోధానారంగంగా మారింది. IMSc లో ఆమె 37 సోలిటన్స్ అనువర్తనాలపై పరిశోధన చేశారు. సాంప్రదాయక, క్వాంటం అయస్కాంత గొలుసులు,సూపర్ ప్లూయిడ్స్ హీలియం, జామెట్రిక్ ఫేస్ అసోసియేటెడ్ విత్ మూవింగ్ కర్వ్స్ మొదలగు విషయాలకు విలోమ పరిక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆమెకు లాస్ ఆలమోస్ లాబ్ ను సందర్శించుటకు ఫుల్‌బ్రైట్ నిధులు వచ్చాయి. ఆమె ICTP,ట్రీస్టెకు సీనియర్ అసోసియేట్ కాగలిగారు. ఆమె ఫ్రాన్స్ లో జరిగే CNRS ను సందర్శించే ఫొఫెషన్ షిప్ ను పొందారు. ఆమెకు చైనా, ఇంగ్లాండ్, పోలండ్, యు.ఎస్.ఎ లోని భౌతిక శాస్త్రవేత్తలతో కలసి పనెచేసే అవకాశం లభించింది. 1990 లలో ఆమె అరేఖీయ, అవకలన జ్యామితీయ వక్రములు, తలాల మధ్య ముఖ్యమైన సంబంధం గూర్చి పరిశోధనలు చేశారు. ఆమె చేసిన పరిశోధనలకు గానూ భౌతిక శాస్త్రంలో తమిళనాడు శాస్త్రవేత్తల అవార్డు (1999) లభించింది. అరేఖీయ గతిశాస్త్రం పై పరిశోధనకు గానూ 2005 లో ప్రొఫెసర్ దర్శన్ రంగనాథన్ మెమోరియల్ లెక్చర్ అవార్డు లభించింది.

ఆమె 2004 లో పదవీవరమణ చేసిన తదుపరి IMSc లో CSIR ఎమెరిటస్ శాస్త్రవేత్తగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె భర్త వి.బాలకృష్ణన్ కూడా భౌతిక శాస్త్రవేత్త. ఆయన పార్టికల్ భౌతిక శాస్త్రం,ఘన పదార్థాల యాంత్రిక ప్రవర్తన, డైనమికల్ సిస్టమ్స్, క్వాంటం గతిసాస్త్రం పై పరిశోధనలు సాగిస్తున్నారు. ఈమె కుమారుడు హరి బాలకృష్ణన్ ఎం.యి.టి వద్ద డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా యున్నారు.

మూలాలు

[మార్చు]