Jump to content

సోమదత్త సిన్హా

వికీపీడియా నుండి
(సోమదత్తా సిన్‌హా నుండి దారిమార్పు చెందింది)
సోమదత్త సిన్హా
వృత్తిమహిళా శాస్త్రవేత్త
సోమదత్తా సిన్‌హా
సోమదత్తా సిన్‌హా
జననం1951
జాతీయతభారతీయులు
రంగములుజీవశాస్త్రం
వృత్తిసంస్థలుIISER మొహాలీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
చదువుకున్న సంస్థలువిశ్వ భారతి విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం

సోమదత్తా సిన్హా 1951 లో జన్మించిన భారతీయ శాస్త్రవేత్త.[1] మొహాలీ లోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) జీవశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.[2] ఆమె గణిత, గణన జీవశాస్త్రం, కాంప్లెక్స్ సిస్టమ్స్ శాఖలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా జీవ వ్యవస్థలలో స్పాషియో టెంపరల్ వ్యవస్థ గూర్చి పనిచేస్తున్నారు. ఈమె భారతదేశం లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఫెలోగా కూడా ఉన్నారు.[3]

విద్య, ఉద్యోగం

[మార్చు]

సోమదత్తా ఉన్నత పాఠశాల టాపర్‌గా ఉత్తీర్ణత సాధించిన తరువాత సోమదత్తా సింహాకు కాకేజి చదువు, పోస్ట్ గ్రాజ్యుయేషన్‌లలో ఆమె మరో ఆలోచన లేకుండా ఫిజిక్స్‌ను ఎంచుకున్నది పలు ఆర్థిక, సాంఘిక సమస్యల మధ్య ఆమె జీవితం నిరాడంబరంగా సాగింది. తరువాత " ది నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్పు " (ఎన్.ఎస్.టి.ఎస్) లభించింది. ఆమె చదువు ఒకదారికి వచ్చే వరకు అది సహకరించింది. స్కాలర్ స్కాలర్‌షిప్పులో భాగగా పుస్తకాలు కూడా లభించడం మరికొంత సహకరించింది. కాలేజ్ చదువుకు కొంత నిధిసహాయం అందింది. కాలేజి రోజులలో ఆమె పలు విజ్ఞాన శాస్త్ర మాగజీన్లు చదువుతూండేది.

ఆమె తండ్రి అకాలంగా మరణించిన తరువాత వారు శాంతినికేతన్‌లో స్థిరపడ్డారు. కళాత్మకత, సాహిత్యకత నిండి ఉన్న శాంతినికేతన్ నివాసం ఆమెకు ఆనందం ఇచ్చింది. ఠాగూరు ఆలోచనలకు ప్రతిబింబంగా ఏర్పాటుచేయబడిన శానితినికేతన్‌లో విద్యాభ్యాసం కొనసాగడం అదృష్టమని ఆమె భావించింది. ఆమె తల్లి కుమార్తెలిద్దరినీ వారి కోరిన విధంగా చదువుకుని స్థిరపడమని చెప్పింది. ఆ అవకాశాలను అందుకుని సోమదత్తా సింహా కూడా చక్కగా చదివి స్కాలర్‌షిప్ సాధించింది. ఆమెకు అప్పుడే విజ్ఞాన శాస్త్రము అంటే ఆరాధన కలిగింది. తగినవిధంగా టీచర్లు కూడా తోడ్పాటు ప్రోత్సాహం అందించారు. సోమదత్తా సింహా విజ్ఞాన శాస్త్రము అందులోని సమస్యలను అధ్యయనంచేసి అందులో తలెత్తే సందేహాలకు పరిష్కారం కనుక్కోవడానికి జీవితాలను అంకితం చేసిన శాస్త్రవేత్తల జీవితకథలను చదివి వారిపట్ల ఆరాధనా భావం పెంచుకున్నది.అలాగే వారిలా పరిశోధనలు చేయాలన్న తహ తహ కూడా మొదలైంది.

ఈమె విశ్వభారతి విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో బి.యస్సీ, ఎం.యస్సీ లను పూర్తి చేసారు. జవహర్ లాల్ విశ్వవిద్యాలయం నుండి సైద్ధాంతిక జీవశాస్త్రంలో ఎం.ఫిల్, పి.హెచ్.డిలు పూర్తి చేశారు. ఈమె సెంటర్ ఫర్ సెల్యులర్, మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాదులో 1983 నుండి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈమె ఆంగ్ల, బెంగాలీ భాషలలో వివిధ పత్రికలు, జర్నల్స్ లలో అనేక విజ్ఞానశాస్త్ర వ్యాసాలను వ్రాసారు. ఈమె ఎన్.సి.ఇ.ఆర్.టి యొక్క సైన్స్ పుస్తకాల ప్రచురణలో సహరచయితగా ఉన్నారు.[4]

సోమదత్తా సింహా విద్యార్థింగా ఉన్నప్పుడే బెంగాలీ భాషలో వ్రాసిన కొన్ని వ్యాసాలు ప్రాంతీయ భాషలో అందించిన కాతణంగా పలువురి ఆదరణను చూరగొన్నాయి. ఆమె ఎన్.ఎస్.టి.సిలో రెండు సమ్మర్ క్యాపులలో పాల్గొన్నది. అక్కడ ఆమెకు పతిచయమైన వారిలో కొంతమందితో జీవితకాలం స్నేహం కొనసాగింది. వారిలో కొంతమంది జాతీయస్థాయిలో గుర్తింపు పొంది ఉన్నారు. చిన్న పట్టణం నుండి వచ్చిన సోమదత్తా సింహాకు సమ్మర్ క్యాంపులు జాతీయస్థాయిలో విద్యార్థుల అనుభవాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం కలిగించాయి. ఉన్నతస్థాయి అధ్యయనానికి ఆమె తతల్లి ఆలోచనలకు భిన్నంగా కొలకత్తాకు వెలుపలి ప్రాంతాలను ఎంచుమున్నది. అదే సమయం బెంగాలులో కొన్ని సమాజిక అల్లర్లు చెలరేగాయి. రాజకీయ యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా యు.ఎస్, ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలలో అస్థిరత చోటుచేదుకుంది. చైనా, క్యూబాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ఉన్నత విద్య

[మార్చు]

సోమదత్తా సింహా ఎం.ఎస్.సి పూర్తిచేసిన తరువాత ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దియరేటికల్, ఎంవిరాన్‌మెంటల్ విజ్ఞాన శాస్త్రము, బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సిలో ఫిజిక్స్ అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నది. చాలామందికి థియరాటికల్ ఎంవిరాన్‌మెంటల్ విజ్ఞాన శాస్త్రము అంటే స్పష్టంగా తెలియదు. తరువాత రెండు సంచత్సరాలు ఢిల్లీ, బెంగుళూరుల మద్య అటూఇటూ పలుమార్లు ఆమె ప్రయాణాలు కొనసాగించింది. సహ విద్యార్ధూతో, టీచర్ల మద్య అనేక చర్చలు కొనసాగాయి. ఆమెలో ఈ అనుభవంతో రెండు సబ్జెక్టులను సమన్వయం చేస్తూ సరికొత్త ఆలోచనలు మొదలైయ్యాయి. తరువాత ఆమె జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మాథమెటికల్, ఎక్స్‌పెరిమెంటల్ టూల్స్ ఉపయోగిస్తూ హైడ్రాలో డెవలప్‌మెంటల్ ప్రోసెస్ గురించి అధ్యయనం చెయడం మొదలు పెట్టింది. ఐ.ఐ.ఎస్.సి అతున్నత విద్యాసంబంధిత వాతావరణం, నెహ్రూ విశ్వవిద్యాలయంలో రాజకీయ, సామాజిక వాతావరణం ఆమెను మరింత ప్రభావితం చేసాయి.

ఉద్యోగం

[మార్చు]

1983లో సోమదత్తా సింహా హైదరాబాదులో కొత్తగా స్థాపినచబడిన " ది సెంటర్ ఫర్ సెల్ల్యులర్ , మాలిక్యులర్ బయాలజీ "కి అభ్యర్థించి అందులో పనిచేయడం మొదలుపెట్టింది. ది సెంటర్ ఫర్ సెల్ల్యులర్ , మాలిక్యులర్ బయాలజీ "లో చురుకైన మేధావంతులైన యువత అధికంగా పనిచేస్తున్నారు. వారంతా శక్తివంతమైన నాయకత్వంలో చక్కని ఊహాత్మకమైన ఆలోచనలతో పనిచేస్తుండేవారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-11. Retrieved 2013-08-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-25. Retrieved 2013-08-29.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-03. Retrieved 2013-08-29.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-11. Retrieved 2013-08-29.
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.