ఇరావతీ కర్వే

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇరావతీ కర్వే
Irawati karve.jpg
ఇరావతీ కర్వే
జన్మ నామం ఇరావతీ కర్వే
జననం డిసెంబరు 15, 1905
మరణం ఆగష్టు 11, 1970
ఇతర పేర్లు ఇరావతీ కర్వే
ప్రాముఖ్యత ఆంథ్రాపాలజిష్టు
విద్యావేత్త
రచయిత
సంతానం ఆనంద్ ,
నందిని నింబాకర్
గౌరీ దేశ్ పాండే
తండ్రి జి.హెచ్.కర్మాకర్

ఇరావతీ కర్వే (హిందీ :इरावती कर्वे; డిసెంబరు 15, 1905ఆగష్టు 11, 1970) భారత దేశానికి చెందిన ఆంథ్రాపాలజిష్టు. ఈమె విద్యావేత్త మరియు రచయిత. ఈమె భారత దేశము లో మహారాష్ట్ర కు చెందినవారు. ఈమె బర్మా దేశానికి చెందిన ఇంజనీరు జి.హెచ్.కర్మాకర్ కు జన్మించారు. ఈమెకు బర్మాకు చెందిన పవిత్ర నది "ఇరావతీ" పేరు పెట్టారు. ఈమె భారతదేశం లోని పూనా లో పెరిగారు.

విద్యా విషయాలు[మార్చు]

కర్వే 1928 లో ముంబయి విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 1930 లో జర్మనీ లోని బెర్లిన్ నందు గల విస్వవిద్యాలయం నుండి ఆంథ్రోపాలజీ లో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.కార్వే భారతదేశం లోని పూనే నగరంలో గల దక్కన్ కాలేజి పోష్ట్ గ్రాడ్యుయేత్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (దక్కన్ కాలేజీ) లోని ఆంధ్రాప్లాజీ మరియు సోషియాలజీ విభాగాలకు అధిపతిగా అనేక సంవత్సరాలు ఉన్నారు.

ఆమె న్యూఢిల్లీ నందు 1947 లో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఆంత్రోపాలజీ విభాగానికి అధ్యక్షత వహించారు.

ఈమె సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ విభాగాలలో పలు అంశాలను మరాఠీ మరియు ఆంగ్ల భాషలలో వ్రాసారు.

రచనలు[మార్చు]

ఇరావతీ కర్వే గారి రచనలు
  • హిందూ సొసైటీ -వివరణ (1961) (ఆంగ్లం :Hindu Society - an interpretation (1961)) : ఈ గ్రంథంలో కర్వే తన క్షేత్ర పర్యటనలలో హిందూ సమాజం పై అధ్యయనం చేసి సేకరించిన అంశాలు పొందుపరచబడ్డాయి. ఆమె హిందీ, మరాఠీ, సంస్కృతం, పాలీ మరియు ప్రకృతి భాషలలో గల గ్రంథాలను అధ్యయనం చేసి వ్రాయబడిన గ్రంథము. ఇందులో హిందూమతంలో ఆర్యుల రాక పూర్వము గల కుల వ్యవస్థ గూర్చి చర్చించడం జరిగినది.
  • కిన్‌షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా (1953) (ఆంగ్లం :Kinship Organization in India(1953)) : భారతదేశములోని వివిధ సంస్థల గూర్చి అధ్యయనం గూర్చి
  • మహారాష్ట్ర - లాండ్ ఆఫ్ పీపుల్ (1968) (ఆంగ్లం: :Maharashtra -Land and People(1968)) : మహరాష్ట్ర లోని వివిధ ఆచారాలు , సామాజిక సంస్థల గూర్చి
  • యుగాంతం (ఆంగ్లం :Yuganta : మహాభారతం లోని ముఖ్య పాత్రల గూర్చి అధ్యయనం గూర్చి వ్రాయబడిన గ్రంథం. ఇందులో చారిత్రక వ్యక్తుల వారి ప్రవర్తన మరియు వైఖిరులను గూర్చి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అంశాలున్నాయి. ఈ గ్రంథాన్ని కర్వే మరాఠీ భాషలో వ్రాశారు. ఆ తర్వాత ఆంగ్లం లో అనువాదం చేయబడినది.దీనికి 1968 లో సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఈ రచన పురుషభారత ప్రభావాలకు దూరంగా మహాభారతాన్ని స్త్రీ పరంగా, స్త్రీవాదపరంగా వ్యాఖ్యానించింది.
  • పరిపూర్తి (మరాఠీ)
  • భోవర (మరాఠీ)
  • ఆమచి సంస్కృతి (మరాఠీ)
  • సంస్కృతి (మరాఠీ)
  • గంగాజల్ (మరాఠీ)

కుటుంబం[మార్చు]

కర్వే మహర్షి దోండో కేశవ్ కార్వే యొక్క మనుమరాలు. ఈమె భర్త దినకర్ ఒక విద్యావేత్త మరియు ఫెర్గుసన్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా యున్నారు. ఈమె కుమారుడు ఆనంద్ పూనే లో ఎన్.జి.ఓ ను నడుపుతున్నారు. ఇది "ఆర్తి" గా పిలువబడుతున్నది. ఆమె చిన్న కుమార్తె "గౌరీ దేశ్ పాండే" ప్రముఖ మరాఠీ రచయిత మరియు లఘు కథల రచయిత. ఈమె పెద్ద కుమార్తె జై నింబాకర్ ఫల్టాన్ లో నివసిస్తున్నారు. ఈమె కూడ నవలా మరియు కథా రచయిత. జై నింబాకర్ యొక్క కుమార్తె నందిని నింబాకర్ యు.ఎస్.ఎ లోని ప్లోరిడా విశ్వవిద్యాలయంలో ప్రముఖ వ్యక్తి. ఆనంద్ యొక్క కుమార్తె ప్రియదర్శినీ కర్వే 1991 నుండి గ్రామీణ ప్రాంతాలో బయోమాస్ శక్తి సంకేతికత అభివృద్ధికి కృషిచేయు చున్నారు.

సూచికలు[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [2] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.