Jump to content

ఇందిరా నారాయణస్వామి

వికీపీడియా నుండి
ఇందిరా నారాయణస్వామి
Indira Narayanaswamy
ఇందిరా నారాయణస్వామి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఇందిరా నారాయణస్వామి వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె కేరళలో సుదూరప్రాంతంలో ఉన్న భూస్వామ్యకుటుంబంలో జన్మించింది. వారి కుటుంబం ఆడపిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి అత్యంత ప్రోత్సాహం అందిస్తారు. ఆమె తండ్రి వృత్తిరీత్యా న్యాయవాద వృత్యిని స్వీకరించాడు. ఆయన అలిపిలో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ ఉండేవాడు. ఆమె తల్లి " మద్రాసు యూనివర్శిటీ "లో చదువుకున్న పట్టభద్రురాలు. అయినప్పటికీ ఆమె గృహిణిగా ఉండాలని నిశ్చయించుకుంది. వారి తల్లితండ్రుల కుటుంబాలు విద్యానేపథ్యం కలిగి ఉన్నాయి. కుటుంబాలలోని ఆరోగ్యకరమైన వాతావరణం ఆమెకు చక్కని నడవడి అలవడడానికి కారణమైంది.

ఉన్నత పాఠశాల

[మార్చు]

ఇందిరా నారాయణస్వామి " ఎస్.టి. ఆంటోనీస్ గరల్స్ ఉన్నత పాఠశాల, ఎస్.టి. జోసెఫ్'స్ కాలేజ్ ఫర్ వుమెన్ "లో సాగింది. గ్రాజ్యుయేషన్ , పోస్ట్ గ్రాజ్యుయేసన్ అలెపీలోని " శాంతనధర్మా "లో సాగింది. ఆమె పోస్ట్ గ్రాజ్యుయేషన్ కొరకు గణితం ప్రధానాంశంగా తీసుకుంది. ఆమెకు చాలా విన్న వయసులోనే గణితం మీద ఆసక్తి ఏర్పడింది. అది తల్లితండ్రుల ప్రోత్సాహంతో దేదీప్యమానంగా వెలిగింది. చాలా చిన్నవయసు నుండి ఆమె తండ్రి ఆమెకు చిన్న చిన లెక్కలు ఇచ్చి వాటికి సమాధానాలు రాబట్టేవాడు. అలాగే మెంటల్ ఆర్ధమెటిక్ మంచి ఫలితాలు సాధించడానికి అవసరమైన సూచనలు అందజేస్తూ ఉండేవాడు. అది ఆమెలో జీవితాతం గణితం పట్ల ఆరాధన , ప్రేమ కలిగడానికి దోహదమయింది.

ఉన్నత విద్య

[మార్చు]

ఆమెలో గణితం పట్ల కలిగిన ఆరాధనను ఆమెకు పాఠశాల , కాలేజిలో లభించిన ఉపాధ్యాయుల వలన మరింతగా అభివృద్ధిచెందింది. ఉపాధ్యాయులు ఆమెకు గణితం పట్ల ఉన్న ఆసక్తి గ్రహించి అది స్థిరపడడామికి అవసరమైన తోడ్పాటును అందించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆమె న్యూ ఢిల్లీ లొని ఎన్.సొ.ఆర్.టి నిర్వహించిన " నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ "లో పాల్గొన్నది. ప్రింసిపా మాథమెటికా, ఫౌండేషంస్ ఆఫ్ మాథమెటిక్స్ మూడు ప్రచురణలు చదవడం ఆమెకు మరింత ప్రేరణ కలిగించింది. ఈ ప్రేరణ కారణంగా ఆమె గణితంలో పరిశోధనలు చేపట్టాలని స్థిరనిశ్చయం చేసుకుంది.

పరిశోడన

[మార్చు]

ఆమె గణితంలో పరిశోధనలు చేపట్టాలని నిశ్చయించుకోవడ, ఇంటికి దూరంగా చెన్నైలో చదవాలని నిశ్చయించుకోవడం ఆమె కుటుంబానికి ఆందోళన కలిగించింది. అయినప్పటికీ ఆమె మాథ్‌సైంస్ (ఐ.ఎం.ఎస్.సి) లో డాక్టర్. కె.ఆర్. ఉన్ని మార్గదర్శకంలో పరిశోధన కొంతభాగం కొనసాగిన తరువాత ఆమె కె.ఎస్. నారాయణస్వామిని వివాహం చేసుకుంది. ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్. ఆయన అహమ్మదాబాదులో బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు. ఆమె భర్త ఆమె చదువుకు అపారమైన తోడ్పాటును అందించాడు. ఆమె అత్తమామలు ఆమెతో నివసిస్తూ ఆమె అధ్యయనానికి మరింత తోడ్పాటును అందించారు. ఆమె కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం కొరకు తరచూ మాథ్‌సైంస్‌కు వెళ్తూ ఉండేది. ఆమె పతిడోధన ముగించి థిసీస్ సమర్పించింది.

పోస్ట్ డాక్టర్ పొజిషన్

[మార్చు]

ఇందిరానారాయణస్వామి పరిశోధన పూర్తి అయిన తరువాత పోస్ట్ డాక్టర్ పొజిషన్ చేయడానికి అనువుగా " యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ నుండి ఫెల్లో షిప్ అందుకుంది. ఆమె అక్కడ కొంతకాలం పనిచేసింది. తరువాత బెంగుళూరులోని " ఏయిరో నాటికల్ ఇంజనీరింగ్ " విభాగంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది. ఏయిరో నాటికల్ ఇంజనీరింగ్ రక్షణ శాఖకు చెందిన స్వతంత్ర సంస్థ. ఎన్.డి.ఎ సూపర్ సోనిక్ యుద్ధవిమానాలకు అనుసంధానిత సంస్థ. గణితశాత్రవేత్త కావడమన్నది ఆమె స్వంత నిర్ణయం. అనుదుకు సహకరించే కుటుంబం కలిగి ఉండడం అదృష్టమన్నది ఆమె భావన. సైన్సు స్త్రీలకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వగలదు, అలాగే విధానాలను ఏర్పరచుకోవడం అలాగే కుటుంబ నిర్వహణకు అనువైనన సమయాలలో పనిచేసే అవకాశం కల్పించడం, ఉన్నత శిఖరాలను ఎక్కడానికి సహకరించడం చేస్తుందన్నది ఆమెభావన.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.