గైతి హాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గైతి హాసన్
Gaiti Hasan
గైతి హాసన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

గైతిహాసన్ అలీఘడ్ లో పుట్టి పెరిగింది. గైతిహాసన్ తల్లితండ్రులు యూవివర్శిటీ లెక్చరర్లు. ఆమె తల్లితండ్రులు ఆడపిల్లల వివాహంకంటే అధికంగా చదువుకు అలాగే వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. విద్యా నేపథ్యంలలో పుట్టిపెరిగిన కారణంగా గైతిహాసన్‌కు సహజంగానే విద్య అంటే మక్కువ ఏర్పడింది. ఆమె ఇద్దరు అక్కలు కెమెస్ట్రీ, ఫిజిక్స్ ప్రధానాంశంగా చదువుకుని వేత్తికొనసాగించారు. ఆమె ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసే సమయానికి ఆమె ఫిజిక్స్ టీచర్ ప్రభావంతో ఆమెకు ఫిజిక్స్ మీద మక్కువ ఏర్పడింది. అలీఘడ్ స్కూలులో మాథమెటిక్స్ బూధించడానికి సరైన ఉపాధ్యాయులు లేనికారణంగా స్కూల్ ఫైనల్ ఫలితాలు బాధించబడ్డాయి. ఆ కారణంగా మంచి యూనివర్శిటీలో కాలేజి చదువు ప్రవేశించడం కష్టమైంది. ఇతర అవకాశలుగా కెమెస్ట్రీ లేక బయాలజీ చదవడానికి ఉండగా బయాలజీలో ముందే ఆసక్తి ఉన్నందున జూవాలజీ ప్రధానాంశంగా తీసుకుని " ఢిల్లీ యూనివర్శిటీలోని మహీంద్రా హౌస్ "లో అధ్యయనం కొనసాగింది.

కాలేజ్[మార్చు]

కాలేజ్ టీచర్లందరూ మహిళలే వారంతా అత్యుత్సాహంగా బోధించి విసుగులేకుండా ప్రయోగాలు చేయించారు. ఆసమయంలో ఆమె కాలేజ్ లైబ్రెరీలో ఫిజియాలజీ, డెవలెప్మెంట్, ఎకాలజీ అండ్ ది ఎవల్యూషన్ గురిచి అధికంగా చదివి తెలుసుకుంది. అప్పుడామె ఇండియాలో డిగ్రీ స్థాయిలో మాలిక్యూల్ బయాలజీకి ప్రధాన్యత తక్కువగా ఉందని తెలుసుకుంది. అందువలన ఆమె పైచదువు కొనసాగించడానికి ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కొత్తగా స్థాపించడిన స్కూల్ ఆఫ్ సైన్సెస్ (ఎస్.ఎల్.ఎస్) ని ఎంచుకున్నది. సమగ్రమైన ప్రణాళికతో ఏర్పరిచిన సబ్జెక్ట్‌తో ఉన్నతవిద్య కొనసాగింది. ఉన్నత విద్య తరువాత ఆమె మాలిక్యూల్ మయాలజీలో పనిచేయాలని అభిలషించింది. మాస్టర్ డిగ్రీ చదివే సమయంలో ఆమె " ముంబయి టి.ఐ.ఎఫ్.ఆర్, వద్ద నిర్వహించిన సమ్మర్ స్కూలులో పాల్గొన్నది.

ఉన్నతవిద్య[మార్చు]

మాలిక్యూల్, జెనెటిక్ ప్రయోగాలకు అనువైన ప్రయోగశాలలు భారతదేశంలో లేనందున ఆమె ఇంగ్లండ్ యూనివర్శిటీలకు స్నేహితులతో కలిసి అభ్యర్థించింది. యు.కె యూనివర్శిటీ ప్రవేశానికి ఆమెకు కొన్ని అవాంతరాలు ఎదురైయ్యాయి. చివరకు ఆమెకు కేంబ్రిడ్జిలో అధ్యయనం కొనసాహించడానికి అవకాశం లభించింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో సెమినార్లలో పాల్గొనడం ద్వారా ప్రముఖ బయాలజిస్టుల ఉపన్యాసాలు విని శాస్త్రఙానం అభివృద్ధి చేసుకున్నది.

టి.ఐ.ఎఫ్.ఆర్[మార్చు]

గైతి హాసన్ రీసెర్చ్ పూర్తిచేయగానే భారతదేశం వచ్చి" టి.ఐ.ఎఫ్.ఆర్" పోస్ట్- డాక్టరల్ పొజిషన్ బాధ్యతలు స్వీకరించింది. ఆమె మాలిక్యూల్ జెనెటిక్స్ ఉపయోగించి బయోలాజికల్ సమస్యను తీర్చడంపై అధ్యయనం చేయాలని ఆసించింది. టి.ఐ.ఎఫ్.ఆర్‌లో ఈ రంగంలో పనిచేయడానికి అవసరమైన బృందాలు పనిచేస్తున్నాయి. టి.ఐ.ఎఫ్.ఆర్ మాలిక్యూల్ శిక్షణకు ప్రత్యేకప్రదేశం. మాలిక్యూల్ క్లోనింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న తరువాత జనరల్ బయాలజీ సమస్యల పరిష్కారానికి మాలిక్యూల్ పరిశోధనను ఉపయోగించడం గురించి ఆలోచించసాగింది.

వివాహం[మార్చు]

టి.ఐ.ఎఫ్.ఆర్ శిక్షణ పూర్తి అయిన తరువాత గైతిహాసన్ వివాహం అయింది. ఆమె భర్త పోస్ట్ డాక్టరల్ పొజిషన్ బాధ్యత స్వీకరించడానికి బోస్టన్ నుండి అవకాశం అందుకున్నాడు. గైతిహాసన్‌కు టి.ఐ.ఎఫ్.ఆర్‌లో విజిట్ చేసిన కల్పనా వైట్ పరిచయం లభించింది. బోస్టన్ ప్రాంతంలో ఉన్న బ్రాండీస్ వద్ద పనిచేస్తున్న మైకేల్ రాస్‌బాష్‌తో పనిచేయడానికి అభ్యర్థించమని సూచించింది. ఆమె మమ్మల్స్ గురించి పనిచేయడామికి ఆసక్తి ఉందని మైకేల్ రాస్‌బాష్‌కు ఉత్తరంద్వారా తెలియజేసింది. ఆరు మాసాల తరువాత ఆమెకు ఆరంగంలో పనిచెయ్యడం సాధ్యపడదని గ్రహించిని. తరువాత ఆమె ఇతరమార్గాల కొరకు అన్వేషించింది. సతికొత్త ప్రాజెక్ట్ అభ్యర్ధనను మైకేల్ రాస్‌బాష్‌ చక్కగా సమర్ధించాడు.

పి.సి.ఆర్[మార్చు]

మైకేల్ సాయంతో ఈ ప్రయోగాలను బెంగుళూరులో ఉన్న " నేషనల్ సెంటర్ ఫర్ బయొలాజికల్ సైన్స్ " ప్రయోగశాలలో డ్రోసోఫిలా మాలిక్యూల్ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతి సాధించింది. ఆమె పనిచేస్తున్న ప్రయోగశాలలో డయానియీస్, న్యూరోడీజనరేషన్ గురించిన పరిశోధనలు కొనసాగాయి. ఆమెకు ప్రయోగశాలలో మేధాపరంగా స్వయం నిర్ణయాలు చేయడానికి అనుమతి లభించింది. అయినప్పటికీ కుటుంబజీవితంలో బాధ్యతలు నిర్వహిస్తూ అత్యధిక సమయం ప్రయోగశాలలో గడపడం వంటి సమస్యలు మాత్రం ఎదురైయాయి.ఏది ఏమైనప్పటికీ మహిళలు వృత్తిరీత్యా అభివృద్ధి సాధించడానికి కుటుంబ సహకారం అత్యవసరమని ఆమె భావన. పురుషాధిఖ్య సమాజంలో స్త్రీలు వృత్తిరీత్యా స్థిరపడడానికి నిరంతర పరిశ్రమ అవసరమని ఆమె భావించింది. గైతి హాసన్ సైన్సు, ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగాల పట్ల పెంచుకున్న ఆరాధన ఆమె వృత్తిజీవితంలో ముందుకుసాగడానికి దోహదంచేసింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.