జయశ్రీ రామదాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయశ్రీ రామదాస్
జయశ్రీ రామదాస్
జననంజయశ్రీ రామదాస్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

జయశ్రీ రామదాస్ 1954లో ముంబయిలో జన్మించింది. ఆమె తండ్రి టెలికమ్యూనికేషన్ ఇంజనీరుగా పనిచేసేవాడు. ఆమె డిల్లీలోని" సెయింట్ థోమస్ స్కూల్ "లో చదువుకున్నది. వారి ఇంట్లో మరాఠీ మాట్లాడేవారు. 7వ తరగతి నుండి బాగ్దాదులో ఉన్న అమెరికన్ స్కూలులో చదువుకున్నది. జయశ్రీ రామదాసుకు అప్పటి నుండి చదువంటే ఆసక్తి ఏర్పడింది. వారి విజ్ఞాన శాస్త్రము, మాథ్స్ టీచర్ మిస్టర్ బవ్డ్‌ట్ విద్యార్ధులలో ప్రేరరణ కలిగిస్తూ పలు ప్రాజెక్ట్ పనులలో విద్యార్ధులను భాగస్వామ్యం చేసాడు. ఆ విద్యార్థిబృందాలలో జయశ్రీ రామదాస్ కూడా భాగస్వామ్యం వహించిది.

పూనా

[మార్చు]

అరబ్, ఇజ్రాయేలు మద్య ఆరు రోజుల యుద్ధం తరువాత స్కూలు మూతపడిన కారణంగా జయశ్రీ రామదాస్ తల్లి పిల్లలను భారతదేశానికి తీసుకువచ్చింది. భారతదేశం రాగానే జయశ్రీ రామదాస్‌ను పూనాలోని " సెయింట్ హెలెనా బోర్డింగ్ స్కూలు "లో చేర్పించింది. అక్కడ ఆమెకు సైన్, మాథ్స్ బోధించడానికి మంచి టీచర్లు (మిస్ జోసెఫ్, మిస్టర్ జాగ్ ) లభించారు. అలాగే గ్రిగోరీ, ధాండ్, ఇంగిల్ ఆసక్తిఅరమైన వ్రాసిన ఫిజిక్స్ పుస్తకాలు ఆమెకు చదువుపట్ల మరింత ఆసక్తి కలిగించాయి. .

కాలేజి

[మార్చు]

జయశ్రీ రామదాస్ ఆమె ఆంటి ( అత్త/పిన్ని, పెదతల్లి) ప్రభావంతో ఫిజిక్స్ అంటే అభిమానం ఎర్పరచుకున్నది. స్కూలు పూర్తిచేసిన తరువాత పూనాలోని ఫర్‌గషన్ కాలేజిలో చేరింది. ఆమె మిస్టర్ ఇనాందార్ నిహ్వహించిన సాలిడ్ జామెంట్రీ అంటే ఎంతో ఉత్సాహం కనబరచింది. అలాగే కెమెస్ట్రీ ఉపాధ్యాయుడు మిస్టర్ పతక్ బోధనశైలి ఆమెను ప్రభావితం చేసింది.

ఐ.ఐ.టి

[మార్చు]

కాన్పూరు " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "లో ప్రొఫెసర్ శుక్లా, హె.ఎస్.మణి, ఇతరులు నుండి అద్భుతమైన రీతిలో ఫిజిక్స్‌ను నేర్పించారని తద్వారా జయశ్రీ రామదాస్ ఫిజిక్స్‌ గురించి చక్కగా అవగాహన చేసుకుంది. ఎం.ఎస్.సి తరువాత వేసవి శలవులలో పర్సెల్ వ్రాసిన బర్కిలీ సీరీస్ ఏలెక్ట్రిసిటీ, మాగ్నటిజం పుస్తకాలను అధ్యయనంచేసింది. కాలేజిలో వారి పాఠ్యస్తకాలు అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉన్నదని భావించి స్నేహితులతో తాను ఎప్పటికైనా సులభరీతిలో అర్థం చేసుకునే పాఠ్యస్తకాలు వ్రాస్తానని చెపుతూ ఉండేది. 1976 ఆమె " హోమి బబా సెంటర్ ఫర్ విజ్ఞాన శాస్త్రము ఎజ్యుకేషన్ " ( టి.ఐ.ఎఫ్.ఆర్) చేరినప్పుడు ఆమె అభిమానించే ఫిజియాలజీ పెడగోజీ ఒకటిగా నేర్చుకునే అవకాశం లభించింది. జయశ్రీ రామదాస్ భారతదేశంలో విజ్ఞాన శాస్త్రము ఎజ్యుకేషన్ సంబంధిత మొదటి విజ్ఞాన శాస్త్రము థిసీస్ సార్పించిన వ్యక్తిగా గుర్తింపు పొందింది.

ఉద్యోగం

[మార్చు]

జయశ్రీ రామదాస్‌కు హెచ్.బి.సి.ఎస్.ఇ రాష్ట్రీయంగా పాఠశాలలను, ఉపాధ్యాయులను సమూలంగా పరిశీలించే అవకాశం ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గోన్ జిల్లా గ్రామీణ పాఠశాలలలో కొన్ని వందల విజ్ఞాన శాస్త్రము పాఠాలను పరిశీలించే అవకాశం లభించింది. అలాగే వారాంతాలలో బాంబే మురికివాడలలోని పాఠశాలలలో విధ్యాబోధన చేయడానికి అవకాశం కలిగింది. పూనాలో " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎజ్యుకేషన్ " ఆమె చేపట్టిన నాన్ ఫార్మల్ ఎజ్యుకేషన్ కార్యక్రమాలు గామీణ బాలలు ప్రకృతిఙానలో ఎంత పరిపూర్ణులో అర్థం అయింది. అలాగే వారు సాధారణ పాఋహ్యాంశాలతో వారి విఙానం ఎలా వ్యర్ధం ఔతుందో కూడా అర్థం అయింది.

హెచ్.బి.సి.ఎస్.ఇ

[మార్చు]

హెచ్.బి.సి.ఎస్.ఇ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వి.జి కులకర్ణి, విజ్ఞాన శాస్త్రము నేర్చుకోవడానికి భాష ప్రాముఖ్యత గురించి అత్యధికంగా యోచిస్తుండేవాడు. ఆల్స్యంగానైనా జయశ్రీ రామదాస్‌కు కూడా అది అర్థం అయింది. భాషను ఆలోచనల నుండి దూరం చేయడం సాధ్యం కాదు. ప్రాథమిక విద్యావిధానంలో మాతృభాషేతర భాషలలోవ్రాయడం, నేర్చుకోవడం మన భారతీయ విద్యార్ధుల శాపం అని ఆమె భావన. హె.బి.సి.ఎస్.సిలో సమస్యాత్మామైన గ్రాజ్యుయేట్ విద్యార్ధిని స్థాయి నుండి టీచర్ పాత్రను పోషించడం మొదలైంది. తరువాత ఆమె విద్యార్ధులలో విజ్ఞాన శాస్త్రము గురించి ఆలోచించడం ఎలాగో నేరొఇంచింది. ఆమె వద్ద పాఠాలు నేర్చుకునే విద్యార్ధులు వారి విద్యార్ధులకు పాఠాలు నేర్పించే సమయంలో ఈ మెళుకువలు ఆచరించాలన్నది ఆమె అభిప్రాయం. అదే సమయం ఇలాంటి పరిశోధనలు పలువిధాలుగా " స్టూడెంట్స్ ఆల్టర్నేటివ్ కాన్-సెప్ట్ " అనే పేరుతో సాగుతూ ఉన్నాయి.

పోస్ట్‌డాక్టొరల్

[మార్చు]

పోస్ట్‌డాక్టొరల్ బాధ్యతలలో ఆమెకు మార్గదర్శకులుగా ప్రొఫెసర్ రోసలిండ్ డ్రైవర్, ప్రొఫెసర్ పౌల్ బ్యాక్ (" చెల్సియా కాలేజ్" ), ఇతరులు సహకారం అందించారు. తరువాత కొన్ని సంవత్సరాల తరువాత మసాచ్యూట్స్ ఇంస్టిట్యూట్‌లో ప్రొఫెసర్ సేమౌర్ పాపర్ట్ ఆమెకు మేధాపరంగా అభివృద్ధి సాధించడానికి సహకరించాడు. యు.ఎస్ లో కంప్యూటర్ సైంటిస్టులు, ఫిజియాలజిస్టులు మరుయు యువ ఇంజనీర్లు ఆమెకు స్ఫూర్తిని అందించారు. అలాగే విద్యార్థులతో కలిసిమెలిసి పనిచేస్తూ వారికి చక్కగా అర్ధమయ్యే రీతిలో బోధన జరిగేలా ప్రోత్సహిస్తూ గ్రామీణ, నగరాంతర పాఠశాలలో పనిచేయడం ఆమెకు తతినిచ్చిందని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి.

రీసెర్చ్

[మార్చు]

జయశ్రీ రామదాస్ హెచ్.బి.సి.ఎస్.సి.ఇ పలు సంవత్సరాలు సాగించిన మాస్ రీసెర్చ్‌కు పలు సంవత్సరాలు ముఖ్యత్వం తక్కువగానే ఉంటూ వచ్చింది. 1990లో సెంట్రల్ డైరెక్టర్ ప్రొఫెసర్. అరవింద్ కుమార్ ఆమె కరికులం అభివృద్ధికి కృషిచేయామని సలహా ఇచ్చాడు. ఆమె దానిని కరికులం ఆధారిత రీసెర్చ్ చేయడానికి ఫీల్డ్ వర్క్ చేయడానికి అవకాశంగా స్వీకరించింది. ఈ పయత్నం సఫలంకావడానికి టీచర్స్, తల్లితండ్రుల సాకారం అత్యవసరం.

సహకారం

[మార్చు]

జయశ్రీ రామదాస్ వృత్తిలో అభివృద్ధి కావడానికి ఆమె భర్త సకారం ఒక కారణం. మరొక వైపు ఆమెకు ఒక శాస్త్రవేత్తకు భార్య అయినప్పటికీ ప్రేమభావం కారణంగా పిల్లలిద్దరి పెంపకలో సహకరించిన మిసెస్ బాపత్, టి.ఐ.ఎఫ్.ఆర్ కాలనీలో బాల్యం నుండి సేవలందిస్తున్న కళా కారణమని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి. అలాగే పల్లలు కూడా అనుగుణంగా ఉండి వృత్తిరీత్యా కొసాగడానికి కారణమయ్యారని ఆమె తెలియజేస్తుంది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.