Jump to content

ఖమర్ రహమాన్

వికీపీడియా నుండి
Qamar Rahman
ఖమర్ రహమాన్
ఖమర్ రహమాన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఖమర్ రహమాన్ జన్మస్థలం 1950లో షాహ్‌జాన్‌పూర్‌. ఆమె పురాతన ప్రముఖ సంప్రదాయ మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది. ఆమె పుట్టిన సమయంలో వారి కుటుంబంలో పరదాల సంప్రదాయం కూడా కొనసాగుతుండేది. ఆమెకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఇంటివద్ద తల్లిని పరీక్షిస్తున్న మహిళావైద్యురాలిని చూడడం తటస్తించింది. అప్పుడే ఆమె డాక్టర్ కావాలని నిశ్చయించుకున్నది. కాలం మెల్లగా గడిచింది ఖమర్ రహమాన్ " అబ్దుల్లాహ్ స్కూలు "లో 10 వ తరగతి వరకు చేరుకున్నది. అప్పుడు ఆమె తన తల్లితో తాను డాక్టర్ కావాలని కోరుకున్నది. ఆమె తల్లి స్వయంగా నిర్ణయం తీసుకోకుండా కుటుంబంలో మగవారితో సంప్రదింపులు జరిపింది. అవి ఫలించలేదు.

వివాహం

[మార్చు]

ఆమె బి.ఎస్.సి చదివే సమయంలో ఆమెకు వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి. ఆమె తనకు కనీసగౌరవం కూడాలేని వాతవరణంలో ఉండలేక అది తాను జీవించాలని కోరుకున్న జీవితం కాదని అనుకున్నది. తతువాత ఆమె తన నెలల కుమార్తెను తీసుకుని పుట్టింటికి చేరుకున్నది. తరువాత ఆమె ఆగ్రా లోని " సెయింట్ జాంస్ కాలేజి "లో ఎం.ఎస్.సి ఫిజికల్ కెమెస్ట్రీలో చేరింది. అక్కడ ఆమె తండ్రి కమీషనరుగా నియమితుడయ్యాడు. పసిపాపతో చదువు కొనసాగించడం శ్రమతో కూడుకున్నదైనా ఆమె తల్లి ఆమెకు ఎంతగానో సహకరించింది. ఎం.ఎస్.సి పూర్యిచేసిన తరువాత ఖమర్ రహమాన్ తన తల్లితండ్రులు ఉన్న షాహ్‌జాన్‌పూర్‌ చేరుకున్నది.

రీసెర్చ్

[మార్చు]

ఖమర్ రహమాన్ ఒకసారి తన సోదరిని కలుసుకోవడానికి లక్నో వెళ్ళింది. అక్కడ ఆమె " కరామత్ హుస్సేన్ ముస్లిం గరల్స్ కాలేజ్ " ప్రింసిపల్ కుమారి వాసింను కలుసుకున్నది. అప్పుడు కుమారి వాసిం ఇంటర్ మీడియట్ క్లాసులకు కెమెస్ట్రీ లెక్చరర్ కావాలని ప్రయత్నిస్తుంది. ఆమె లెక్చరర్‌గా చేరింది. అది ఆమెకు గొప్ప అనుభూతిని కలిగించింది. యువ విద్యార్ధినులకు సైన్స్ బోధించడం, శాస్త్రవేత్తల గురించి చర్చించడం, విద్యార్ధినుల కలల గురించి వినడం ఆమెకు అత్యంత ఆసక్తిని కలిగించింది. ఆమె చేస్తున్న పనికి ఆమెకు తృప్తిని గర్వాన్ని కలిగించినా ఇంకా చేయాలన్న తపన మాత్రం ఆమెను విడనాడలేదు. ఒకరోజు ఆమె లక్నో యూనివర్శిటీలోని బయోకెమెస్ట్రీ డిపార్టుమెంటుకు వెళ్ళి ప్రఖ్యాత బయోకెమిస్ట్ ప్రొఫెసర్ ఫీ.ఎస్. కృష్ణన్‌ను కలుసుకున్నది. ఆమె తనను రీసెర్చ్ స్కాలరుగా తీసుకుని మార్గదర్శకం చెయ్యమని కృష్ణన్‌ను కోరింది. మొదట ఆయన నిరాకరించినా ఖమర్ రహమాన్ డిమాన్‌స్ట్రేషన్ చూసిన తరువాత ఆమెకు గైడుగా ఉండడానికి అంగీకరించాడు.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

1970లో " ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ "కు అభ్యర్ధించి అందులో జూనియర్ సైంటిఫిక్ రీసెర్చ్ అసిటెంట్ (జె.ఎస్.ఎ) లో ఉద్యోగబాధ్యతలు స్వీకరించింది. ఖమర్ రహమాన్ ఆస్బెస్టాస్‌లో లోతైన అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపింది. తరువాత సిగరెట్టు పొగ , కిరోసిన్ వాసన ఆరోగ్యం మీద చూపే ప్రభావం గురినిచి పరిశోధనలు కొనసాగాయి. భారతదేశంలో ఆస్బెస్టాస్ ఆధారిత పరిశ్రమల గురించి చేసిన పరిశోధన ఆమెకు జాతీయగుర్తింపును తీసుకువచ్చాయి. ఇవి ప్రజలఆరోగ్యం మీద చూపుతున్న దుష్ప్రభావం గురించి తెలుసుకోవడానికి ఆర్గనైజ్ , అన్‌ఆర్గనైజ్ సర్వేలు జరిగాయి. తరువాత ఆమె ఇండోర్ వాయుకాలుష్యం మీద విసృత పరిశోధనలు సాగించింది. ఆమె ఆస్బెస్టాస్ గనుల ప్రాంతాలలో కూడా లోతైన పరిశోధనలు సాగించింది. మహిళాకార్మికులు ఈ కాలుష్యం మూలంగా ఆరోగ్యరీత్యా ఎలా బాధించబడుతున్నారు అన్న అంశం మీద ఆమె చిత్రించిన డాక్యుమెంటరీకి భారత ప్రభుత్వ నుండి ఉత్తమ వీడియో చిత్రంగా గుర్తింపు పొందింది. జాతీయంగా అంతర్జాతీయంగా మహిళలపై కాలుష్యం ప్రభావంగురించిన పరిశోధనలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్, కామెన్‌వెల్త్ సైంస్ కౌంసిల్, లండన్, జెర్మనీ , భారతప్రభుత్వం నిధిసహాయం అందించింది.

గుర్తిపు

[మార్చు]

ఖమర్ రహమాన్ సైంటిఫిక్ పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఫలితంగా విదేశాలలో పరిశోధనలు సాగించడానికి అలాగే పరిశోధనా వ్యాసాలు వ్రాయడానికి, అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడానికి ఆమెకు ఆహ్వానాలు అందాయి. 1981 నవంబరులో నేషనల్ సెంటర్ ఫర్ టెక్నాలజీ రీసెర్చ్, 1987 ఫ్రాంస్ రాజధాని ప్యారిస్ లోని క్రెషియల్ యూనివర్శిటీ, యు.ఎస్ ఎవింరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెంసీ , నార్త్ కరోలినా డ్యూక్ యూనివర్శిటీల నుండి సహకారకార్యక్రమాల పరిశోధనలలో ఆతిథ్యం వహించమని ఖమర్ రహమాన్‌కు ఆహ్వానాలు వచ్చాయి. అలాగే 1996లో యు.ఎస్ నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైంసెస్ " 1994, 1996 లలో జర్మన్ ఫోర్‌స్కన్‌జంగ్ కరిష్రుహి నుండి ఆహ్వానాలు వచ్చాయి. 1998, 1999, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007 and 2008 లలో అంతర్జాతీయ సమావేశాలలో మాట్లాడడానికికీ నోట్స్ సమర్పించడానికి ఆహ్వానాలు అందుకున్నది. ఆమె యువశాద్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి, జాతీయంగా సైన్సు ఉన్నతికి, సాంఘిక ప్రయోజనకరమైన పరిశోధనలు చేయడానికి ఖమర్ రహమాన్ వైద్యమైన కృషిచేసింది.

కుటుంబం

[మార్చు]

ఖమర్ రహమాన్ ఒక్కొక్క స్టేజీలో మహిళలు గుర్తింపు పొందడానికి పురుషులకంటే అధికంగా శ్రమపడవలసిన అవసరం ఉందని, పురుషాధిఖ్య సమాజంలో సాధించడానికి తనకంటూ ఒక స్థానం సంపాదించడానికి మహిళగా అత్యధికంగా శ్రమపడాలన్నది ఆమె అభిప్రాయం. అయినప్పటికీ ఆమె ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆమె నిర్ణయించుకున్నది. ఆమె ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. అందుకే ఆమె విద్యారంగంలో అత్యున్నత విజయాలు సాధించింది. ఆమె కుమార్తె ప్రఖ్యాత వైద్యురాలైంది. ఆమె అనుమలు ఆమెను ఆదర్శంగా తీసుకుని శాస్త్రవేత్తలు కావాలని నిశ్చయింకున్నారు. ఆమె వ్రాసిన 130 పేపర్లు ప్రచురించబడ్డాయి. ఆమె సిలికా, ఆస్బెస్టాస్, స్లేట్ డస్ట్, కార్పెట్ డస్ట్, సూట్, ఇతర పీచు ఉత్పత్తుల నుండి ఉత్పత్తి ఔతున్న టాక్సిటీ గురించి పరిశోధనలుచేసింది. తెలియని వాతావరణం, వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న కాలుష్యం, అది మానవుల ఆరోగ్యంమీద చూపుతున్న ప్రభావం ఆమెను దశాబ్ధాలుగా ఆకర్షిస్తూ ఆమె ప్రధాన పరిశోధనా అంశాలుగా మారాయి.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.