ప్రీతి శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతి శంకర్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ప్రీతి శంకర్ తల్లి ఉన్నత పాఠశాల టీచర్. ఆమె విద్యార్థులకు గణితం, ఫ్రెంచ్ బోధించేది. ఆమె తల్లి ద్వారా అల్‌జీబ్రా నేర్చుకున్నది. 1958లో ఆమె కుటుంబం పూనా నుండి జమ్ముకు మారింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీ ఆఫీసరుగా పనిచేసేవాడు. ఆయనను భారత్, పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్న సురన్‌కోటే అనే చిన్న ఊరికి బదిలీ చేయబడ్డాడు. ప్రీతి శంకర్ అక్కడ ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి పూనాకు బదిలీ చేయబడ్డాడు. తరువాత " ఫర్‌గుషన్ కాలేజ్ "లో డిగ్రీ చదువు పూర్తిచేసింది. తరువాత ఆమె ఢిల్లీ ఐ.ఐ.టిలో ఎలెక్ట్రికల్ బి.టెక్ చేసింది.

ఉన్నత విద్య[మార్చు]

1968లో ఉన్నతవిద్య కొరకు యు.ఎస్.ఎ రాజధాని వాషింగ్టన్ లోని మేరీలాండ్ లోని కాలేజ్ పార్క్‌లో ఉన్నత విద్య కొనసాగించింది. తరువాత ఆమె అల్జీబ్రా ప్రధానాంశంగా తీసుకుని 1972లో పి.హెచ్.డి పూర్తి చేసింది.

పోస్ట్ డాక్టొరల్ పొజిషన్[మార్చు]

1973లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె " స్కూల్ ఆఫ్ ఆటోమేషన్ "లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఐ.ఐ.టిలో సరికొత్తగా ఏర్పాటు చెయ్యబడిన విభాగం కనుక ప్రొఫెసర్ల కొరత అధికంగా ఉంది. స్వల్పంగా ఉన్న ప్రొఫెసర్ల మీద పనిభారం అధికమైంది. ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులను చూడం వారిని కలుపుకుంటూ పనిచెయ్యడం ఆమెకు ఉత్సాహం కలిగించింది.1974లో ఆమెకు దియరేటికల్ ఫ్లూయిడ్ డైనమిస్ట్ పి.ఎన్ శంకర్‌తో వివాహం అయింది. ఆమె గ్రాజ్యుయేషన్ చేసే సమయంలో ఆయనను కలుసుకున్నది. 1972లో ఆయన భారతదేశానికి వచ్చిన తరువాత బెంగుళూరు నేషనల్ ఏరోనాటికల్ లాబరేటరీలో పనిచేయడం మొదలు పెట్టాడు. 1976లో కుమారునికి 1983లో జన్మ ఇచ్చిన తరువాత ప్రీతి శంకర్ కొంత సమయం వృత్తికి దూరం అయింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.