పి మొహంతి హెజ్మాడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి మొహంతి హెజ్మాడీ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మొహంతి హెజ్మాడీ తండ్రి పేరు భగబత్ మొహంతి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. తరువాత విజయాంతంగా కంట్రాటర్‌ వృత్తి సాగించి విదుల ఉద్యమానికి కూడా నిధిసహాయం అందించాడు. ఆమె తల్లి నిసమొనీ దేవి స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామ్యం వహించింది. ఆమె తండ్రి షెడ్యూల్ ప్రదేశంలో గృహనిరాణం చేసిన కారణంగా. ఆమె చదువు బాల్యంలో ఇంటివద్ద కొనసాగింది. స్కూలుకు వెళ్ళడానికి రోడ్డువసతి, బసువసతి లేకపోవడేఅందుకు కారణం. తరువాత ఆమె బసులో ప్రయాణిస్తూ " రావంషా బాలికకల పాఠశాల " విద్యాభ్యాసం కొనసాగించింది. స్కూలులో ప్రత్యేకంగా సంగీతం అభ్యసించింది. అలాగే కాలేజీలో సైన్స్ అధ్యయనం కొనసాగించుంది.

కాలేజ్[మార్చు]

ఆమె కాలేజ్‌ జీవితం ఆమెలో అనూహ్యంగా మార్పులు తీసుకు వచ్చింది. నాలుగు వైపులా విస్తరించి ఉన్న భవనాలు, ఆకర్షణీయమైన లాన్లు, పూలమొక్కలతో నిండి ఉన్న కాలేజి వాతావరణం ఆమెలో నూతనోత్సాహాన్ని నింపింది. సైన్స్ ఆమెను అనేపదం ఉత్తేజాన్ని కలిగించుంది. ప్రయోగాలు చేయడం కూడా ఆమెకు ఆనందం కలిగించింది. ఆరోజులలో అధికంగా ఆడపిల్లలు అధికంగా అనుకున్నట్లుగా ఆమె కూడా డాక్టర్ కావాలని కోరుకొనక బి.ఎస్.సిలో కొనసాగవలసివచ్చింది. ఆమెకు జంతువులపట్ల ఉన్న మమకారం వలన ఆమె జాంతుశాస్త్రం ప్రధానంశంగా కాలేజ్ చదువు కొనసాగించుంది. అది ఆమె జీవితంలో సరికొత్త మలుపును తిప్పింది. ఆమె " లక్నో యూనివర్శిటీలో " మాస్టర్ డిగ్రీ అభ్యసించింది.

ఉద్యోగం[మార్చు]

ఎ.ఎస్.సీ పూర్తిచేసిన తరువాత ఒడిషాకు తిరిగి వచ్చి " ఉత్కల్ యూనివర్శిటీలో " కొత్తగా ప్రవేశపెట్టిన మె.ఎస్.సి టీచరుగా బాధ్యతలు స్వీకరించింది. యూనివర్శిటీ గ్రంథాలయంలో వైవిధ్యమైన పరిశోధనా పత్రికలను చదవడం వలన ప్రేరణ పొంది పరిశీధనకొరకు అభ్యర్ధనలు చేయగా ఆమెకు " యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్" నుండి పూర్తి ప్రయాణపు ఖర్చులతో బార్బర్ ఫెల్లో షిపి లభించింది. తరువాత ఆమె అందమైన " అన్నె అర్బర్ " నగరంలోని " యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్"లో జూవాలజీ డిపార్ట్మెంటులో పరిశోధనలు ప్రారంభించింది. ఆమె " ట్రంఫర్ ఆఫ్ మేటర్న్లల్ సెరం ప్రొటీన్స్ అండ్ దేర్ రోల్ ఇన్ డెవలపెంట్ ఇన్ ది అమెరికన్ లెప్పర్డ్ ఫ్రాగ్ రనా పిపింస్ " పరిశోధన పూర్యిచేసి డాక్టర్ పట్టా పొందింది. ఆమె " ఉత్కల్ యూనివర్శిటీకి " తిరిగి వచ్చిన తరువాత " ఉభయచరాలు, ప్రమాదంలో సరీసృపాలు " పరిశోధనకు సాకరించడానికి గ్రంథాలయం ప్రారంభించింది.

గుర్తింపులు[మార్చు]

1992లో ఉభయచారాల గురించి బ్రేక్‌త్రూ ద్వారా ప్రచురించిన పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. పలురూపాలలో లభించిన గుర్తింపులకో 1998లో అభించిన పద్మశ్రీ " పురస్కారం ఒకటి . తరువాత " ప్రెసిడెంటాఫ్ ఇండియన్ డెవలెప్మెంట్ బయాలజిస్ట్స్ " ఎన్నికైన ప్రథమ మహిళగా " పి మొహంతి హెజ్మాడీ "గా గుర్తింపు పొందింది. అలాగే " వైస్ చాంసలర్ ఆఫ్ ఒడిషా - సంబల్పూర్ యూనివర్శిటీ "గా (1995-98) బాధ్యత స్వీకరించిన ప్రథమ అహిళగా కూడా గుర్తింపు పొందింది. ఆమె పదవీ విరణ చేసిన తరువాత కూడా అమెకు వివిధ సైన్సు ఏజెన్సీలలో సభ్యత్వం మూలంగా సైన్స్ గురించి అధ్యయనం కొనసాగిస్తూ సైన్స్ వ్యాసాలు వ్రాస్తూ సైన్స్‌తో అనుబంధం కొనసాగింది. అమే ఆరాధించిన సైన్స్‌ అమెకు విజయవంతమైన వృత్తిజీవితాన్ని, ప్రత్యేక గుర్తింపును ఇచ్చిది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.