Jump to content

ప్రజ్వల్ శాస్త్రి

వికీపీడియా నుండి
ప్రజ్వల్ శాస్త్రి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ప్రజ్వల్ శాస్త్రి మంగుళూరు సమీపంలో ఉన్న మొఫ్యూసిల్ అనే పట్టణంలో జన్మించింది. ఆమె చిన్నవయసులో తోటలో చాపమీద పడుకుని రాత్రివేళలో నక్షత్రాలను చూస్తూ గడిపినప్పుడే ఆమెకు పాలపుంత అంటే ఆసక్తి కలిగింది. అలాగే ఒక తోకచుక్కను కూడా కొన్ని గంటల సమయం తదేకదీక్షతో చూస్తూ ఉండేది. తరువాత ఆమె తాను చూసిన దృశ్యాన్ని చిత్రీకరించింది. ఆమెను కాస్మోస్ అత్యనంత ప్రభావితం చేసాయి. చంద్రుని మీద అడుగు పెట్టనప్పటికీ చిన్న తనంలో " యూనీ గగారియన్ " ప్రజ్వల్ శాస్త్రికి కథానాయకుడులాగా కనిపించేవాడు. ఆమె బాల్యంలోనే శాస్త్రవేత్త అయి స్పేస్ షిప్‌లో పనిచేస్తున్నట్లు కలలు కనేది.

పుస్తకపఠనంతో ప్రేరణ

[మార్చు]

ఆమె హేతువాద తల్లితండ్రులు ఆమె చదవడానికి సైన్సు పుస్తకాలు కొని తీసుకు వచ్చేవారు. అందులో ఒకటి అణువును గురించిన ఆసక్తికరమైన పుస్తకం. ఆమె 11సంవత్సరాల వయసులో ఆమె తండ్రి ఆమెచేత ఆండ్రోమేడా పుస్తకం చదివింపజేసాడు. అది అంతరిక్ష విస్పోటం, గ్రహాంతర సంబంధాలను విశ్లేషించే పుస్తకం. ఆమె యుక్తవయసులో ప్రవేశించిన సమయంలో ఆమె తల్లి ఆమెతో బయోగ్రఫీ ఆఫ్ మతియా స్లోడోస్కా పుస్తకం ఇచ్చింది. అది చదివిన తరువాత సైన్సు ప్రపంచంలో స్త్రీల పట్ల సమాజం చూపుతున్న వివక్ష గురిచి తొలిసారిగా ఒక అభిప్రాయం ఏర్పడింది.

స్కూలు

[మార్చు]

ప్రజ్వల్ శాస్త్రి స్కూలులో టీచర్లు నేర్చుకోవడంలో ఉన్న సౌందర్యం తెలిసేలా బోధించడం ఆమెకు సైన్సు పట్ల ఉన్న ఆరాధనను అధికం చేసింది. తరువాత ఆమె ఫిజిక్స్‌ను ప్రధానాంశంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నది. అలాగే ఆమె ఆరాధించే గణితం కూడా ప్రధానాంశంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నది. అయినప్పటికీ చిన్నతనంలో కలలు కన్నట్లు స్పేస్‌షిప్‌లో పని మరుగున పడింది.

మాస్టర్ డిగ్రీ

[మార్చు]

ప్రజ్వల్ శాస్త్రి మాస్టర్ ఫిజిక్స్ అధ్యయనం చేయడానికి ముంబయి " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "ని ఎంచుకున్నది. ముంబయి ఉమంస్ హాస్టల్‌లో ఆమెకు తనలాగా ఫిజిక్స్ అంటే అభిమానం ఉన్న సహవిద్యార్థులతో కలిసి చర్చించే అవకాశం లభించింది. ఫిజిక్స్ తరువాత ఆమె రీసెర్చ్ చేయడానికి నిర్ణయించుకున్నది. తతువాత ఆమె " టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ " రీసెర్చ్ చేయాలని నిర్ణయింకున్నది. ఐ.ఐ.టి ప్రొఫెసర్ పి.పి.కానే ప్రజ్వల్ శాస్త్రికి ప్రేరణ కలిగించాడు.

తరువాత ప్రజ్వల్ శాస్త్రి విజయ్ కపాహి టీచింగ్‌తో ప్రాభావితురాలైంది. విజయ్ టీచింగ్ ఆమెకు విశ్వంలో శక్తివంతమైన గేలెక్సీలు పనితీరు గురించిన అవగాహన కలిగింది. గేలెక్సీలు గ్రావిటీల ద్వారా కదిలే తీరు, కృష్ణబిలాలు అగురించిన అవగాహన కలిగింది.విజయ్ వినోదం మిళితంచేస్తూ గేలెక్సీ కేంద్రాలగురించి వివరించే తీరుపట్ల ఆమె ఆకర్షితురాలైంది.

వివాహం

[మార్చు]

రీసెర్చ్

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.